For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉసిరికాయ: జుట్టు రాలడం తగ్గిస్తుంది..జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది

|

ఆనందమైన జీవితంలో ఆరోగ్యకరమైన మరియు అందమైన హెయిర్ ను మెయింటైన్ చేయడం కొద్దిగా కష్టమైన పని. ఒత్తిడి మరియు వాతావరణ కాలుష్యం హెయిర్ ఫ్యాల్ మరియు హెయిర్ డ్యామేజ్ కు కారణం అవుతుంది.

ఈ సమస్యను నివారించడానికి కొన్ని త్వరితగతమైన మార్గాలు, సులభ మార్గాలున్నాయి. జుట్టుకు ఎప్పుడూ కెమికల్ ప్రొడక్ట్స్ వినియోగించడం జుట్టు పెరుగుదలకు అంత మంచిది కాదు.

READ MORE: బాబోయ్...ఇది ఉసిరి కాయ కాదు...ఆరోగ్యపు సిరిసంపద...!

కాబట్టి, మీరు కొన్ని సింపుల్ మరియు నేచురల్ హోం రెమెడీస్ ను ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలాంటి సింపుల్ అండ్ ఎఫెక్టివ్ హోం రెమెడీలో ఆమ్లా(ఉసిరికాయ )ఒక ఉత్తమమైనది.

ఆమ్లా నూనె, ఆమ్లా హెయిర్ ప్యాక్ వల్ల తలలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మరియు ఇది హెయిర్ ఫోలి సెల్స్ కు ఆక్సిజెన్ మరియు న్యూట్రీషియన్స్ అందిస్తుంది. అందువల్ల ఆమ్లా మీ జుట్టును హెల్తీగా మరియు బ్యూటిఫుల్ గా ఉంచతుంది. అంతే కాదు త్వరగా జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. READ MORE:కేశ సౌందర్యాన్ని పెంపొందించడంలో ఉసిరి ప్రాధాన్యత...

అంతే కాదు ఉసిరికాయ ఇతర జుట్టు సమస్యలైన చుండ్రు మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను నివారించడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది . మరియు ఇది డ్రైహెయిర్ ను నివారిస్తుంది . అంతే కాదు జుట్టు స్ట్రాంగ్ గా పెరిగేందుకు సహాయపడుుతుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా సింపుల్ గా మరియు ఎఫెక్టివ్ గా హెయిర్ మాస్క్ లను వేసుకోవడమే . ఇది జుట్టు ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది. మరి ఎఫెక్టివ్ హెయిర్ మాస్క్ మనం ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం..

ఆమ్లా జ్యూస్ అండ్ ఎగ్ ప్యాక్:

ఆమ్లా జ్యూస్ అండ్ ఎగ్ ప్యాక్:

మూడు ఉసిరికాయలను తీసుకొని వాటని కట్ చేసి జ్యూసర్ లో వేసి జ్యూస్ చేయాలి. ఈ జ్యూస్ ను ఒక గిన్నెలోకి తీసుకొని అందులో గుడ్డు వేసి బాగా మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని తలకు, కేశాలకు పొడవునా అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆమ్లా పౌడర్ ను ఎలా తయారుచేయాలి:

ఆమ్లా పౌడర్ ను ఎలా తయారుచేయాలి:

ఫ్రెష్ గా ఉండే ఆమ్లాను చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని ఎండలో ఎండబెట్టుకోవాలి. బాగా ఎండిన తర్వాత వాటిని మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయ పౌడర్ ను ఇతర నేచురల్ పదార్థాలతో మిక్స్ చేసి హెయిర్ ప్యాక్ గా వేసుకొని అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.

ఆమ్లా పౌడర్ మరియు కొబ్బరి నూనె:

ఆమ్లా పౌడర్ మరియు కొబ్బరి నూనె:

ఒక టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్ లో రెండు టేబుల్ స్పూన్ల గోరువెచ్చని కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేసి తలకు పట్టించి 10నిముషాల బాగా మసాజ్ చేసి రెండు గంటల తర్వాత షాంపుతో తలస్నానం చేసుకోవాలి.

ఆమ్లా మరియు మెంతులు:

ఆమ్లా మరియు మెంతులు:

ఒక చెంచా ఆమ్లా పౌడర్ కు ఒక చెంచా మెంతి పొడి మిక్స్ చేసి, అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆముదం మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని తలకు మరియు వెంట్రుకలకు పట్టించాలి . ఈ మిశ్రమాన్ని సున్నితంగా మసాజ్ చేయాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి.

ఆమ్లా ఆయిల్ :

ఆమ్లా ఆయిల్ :

ఉసిరికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండ బెట్టి, తర్వాత అందులో మూడు చెంచాల మెంతుల పొడి, అరకప్పు కొబ్బరి నూనెలో వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని తక్కువ మంట మీద బ్రౌన్ కలర్ వచ్చే వరకూ బాయిల్ చేయాలి . తర్వాత దీన్ని చల్లార్చి మూత గట్టిగా ఉండే బాటిల్లో వేసి నిల్వ చేసుకోవాలి.

 ఆమ్లా ఆయిల్ తో మసాజ్ చేయాలి:

ఆమ్లా ఆయిల్ తో మసాజ్ చేయాలి:

ఆమ్లా ఆయిల్ తో జుట్టు మసాజ్ చేయడం వల్ల, ఆమ్లా ఆయిల్ తలలో హెయిర్ ఫోలీ సెల్స్ కు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఈ నూనెను రాత్రి పడుకొనే ముందు తలకు పట్టించి తర్వాత రోజు ఉదయం షాపుతో తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే జుట్టు రాలడం తగ్గి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

శీకాయ:

శీకాయ:

ఒక గుడ్డు సొనలో, ఒక టీస్పూన్ శీకాకాయపొడి, ఒక కుంకుడు కాయ పొడి, ఒక చెంచా ఆమ్లా పౌడర్ మిక్స్ చేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20నిముషాలు తర్వాత తలస్నానం చేయాలి.

English summary

7 Amla Juice Recipes For Hair Growth: Beauty Tips in Telugu

7 Amla Juice Recipes For Hair Growth: Beauty Tips in Telugu. Amla also treats other scalp problems such as dandruff and fungal infections. It also moisturises dry hair and makes them strong. You can make simple and effective amla hair masks at home to promote hair growth and make your hair bouncy.
Story first published: Friday, June 19, 2015, 13:06 [IST]
Desktop Bottom Promotion