For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు పల్చబడడం, సమస్యకు 9 గృహ నివారణోపాయాలు

By Super
|

ఏ వ్యక్తికైనా ఈ సన్నని జుట్టు సమస్య ఆ వ్యక్తి యొక్క వయస్సుతోపాటు పెరుగుతుంది.

ఈ సమస్యకు హార్మోన్ల అసమతుల్యత, ప్రోటీన్ యొక్క లోపం మరియు ఇతర సాధారణ కారణాలు. ఒక వ్యక్తి బలమైన మరియు ఆరోగ్యకరమైన జుట్టు పొందడానికి ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.

READ MORE: మహిళల్లో జుట్టు రాలడానికి గల 10 కారణాలు: నివారణ

జుట్టు పల్చబడడం సమస్యను నివారించేందుకు సరైన సమయంలో చికిత్స చేయాలి లేదంటే బట్టతల ఏర్పడుతుంది. వైవిధ్యమైన మరియు సాధారణ మైన గృహ నివారణోపాయాలను ఉపయోగింఛి ఈ సమస్యను నివారించవొచ్చు.

READ MORE: జుట్టు రాలడం నివారించే హోం మేడ్ హెయిర్ మాస్క్

సన్నని జుట్టు సమస్యను నివారించేందుకు 9 నివారణోపాయాలు

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె (4 టేబుల్ స్పూన్స్) మరియు నిమ్మ రసం (2 టీస్పూన్లు) కలిసిన మిశ్రమం ఈ సమస్యకు చికిత్స కొరకు ఉపయోగించవచ్చు. కనీసం10-15 సార్లు ఈ మిశ్రమంతో తలమీద మసాజ్ చేసుకోండి.మంచి ఫలితాల కొరకు 60 - 75 నిముషాల తరువాత మాత్రమే జుట్టును కడగండి. ఈ విధంగా క్రమం తప్పకుండ చేయటం వలన జుట్టు శుభ్రంగా ఉండి, పెరగటంలో సహాయపడుతుంది.

అలోవెరా

అలోవెరా

తాజా ఆలోవేరా (కలబంద) జెల్ తల మీద రుద్దండి మరియు బాదం నూనె కొన్ని చుక్కలను తల మీద రుద్దటం వలన కూడా ఈ సమస్యను తగ్గించవొచ్చు. కలబంద రసం జుట్టు పెరుగుదలను మెరుగు పరుస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అలోవెర జెల్ జుట్టు నిర్మాణం మెరుగుపరచడం కోసం ఒక కండీషనర్ వలె పనిచేస్తుంది.

ఆముదము నూనె

ఆముదము నూనె

వారంలో 4 సార్లు తేనెను (1 టీస్పూన్) ఆముదము నూనెతో కలిపి 3 - 4సార్లు వర్తింప చేయటం వలన ఈ సమస్యను తగ్గించవచ్చు. ఆముదము నూనె క్రమం తప్పకుండ వాడటం వలన జుట్టు పెరుగుతుంది.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్

ఆలివ్ నూనెతో జుట్టును మర్దన చేయటం వలన ఈ సమస్యను తొలగించవచ్చు.మంచి ఫలితాల కోసం 6 నుండి 8 గంటల తరువాత జుట్టును కడగండి.ఆలివ్ నూనెతో తల మీద మర్దన చేయటం వలన జుట్టులో ఉన్న మలినాన్ని తొలగిస్తుంది. తరువాత మరింత జుట్టు నిర్మాణ అభివృద్ధికి సహాయపడుతుంది.

మెంతులు

మెంతులు

మెంతుల విత్తనాలు (2 టేబుల్ స్పూన్స్ ) మరియు ఒక గ్లాసు నీటిని ఉపయోగించి పేస్ట్ సిద్ధం చేసుకోండి. రోజూ ఈ పేస్ట్ తో తల మీద చర్మాన్ని ఒక నెల రోజులపాటు మసాజ్ చేయటం వలన ఈ సమస్యకు ముగింపు పలకవచ్చు మరియు జుట్టు పెరుగుదల కూడా మెరుగుపడుతుంది.

వెజిటబుల్ జ్యూస్

వెజిటబుల్ జ్యూస్

క్యారట్, పాలకూర మరియు కాప్సికమ్ ల మిశ్రమం రసం ఈ సమస్యను నివారించటంలో అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది. తాజా అల్ఫాల్ఫా మరియు పాలకూర కలిపిన రసం త్రాగటం వలన కూడా ఈ సమస్యకు మంచి ఫలితం ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కొత్తిమీర రసంతో తలమీద జుట్టును కడగటం వలన కూడా మంచి సమర్థవంతమైన ఫలితాలను అందుకుంటారు.

వినెగార్

వినెగార్

ఒక షాంపూతో తలస్నానం చేసిన తర్వాత వినెగార్ తో తలను నెమ్మదిగా రుద్దటం వలన ఈ సమస్యకు చికిత్స చేయవచ్చు. మంచి ఫలితాల కోసం ఆపిల్ పళ్లరసం వినెగార్ (సగం కప్) మరియు వెచ్చని నీరు (1 కప్పు) కలిపిన మిశ్రమం ఉపయోగింఛి హెయిర్ రిన్సింగ్ కు ఉపయోగించవచ్చు. ఒక గ్లాసు నీటిలో ఆపిల్ పళ్లరసం వినెగార్ (సగం టీస్పూన్) కలిపి వారం లో 4 సార్లు తాగటం వలన జుట్టు పెరుగుదలను వృద్ధి చేయవచ్చు.

ఉల్లిపాయ

ఉల్లిపాయ

ఉల్లిపాయ రసం మరియు తేనె కలిపిన మిశ్రమాన్ని జుట్టుమీద వర్తింప చేయటం వలన కూడా ఈ సమస్య నుండి మీరు ఉపశమనం పొందవచ్చు.2 వారాలపాటు రోజు మార్చి రోజూ ఉల్లిపాయ గుజ్జుతో తల మీద మసాజ్ చేయటం వలన కూడా అత్యంత ప్రభావవంతమైన ఫలితాలను అందుకోవచ్చు.

హెన్నా

హెన్నా

వారంలో 2 నుండి 3 సార్లు త్రిఫాల పొడితో ఉన్న గోరింట మిశ్రమాన్ని, షికాకాయి, రీథా, కొత్తిమీర సారాన్నివర్తింప చేయటం వలన ఈ సమస్యను నివారించవచ్చు.

English summary

9 Home Remedies For Thinning Hair: Beauty Tips in Telugu

The problem of thinning hair may grow with the age of an individual. Common causes of thinning hair may include hormonal imbalance, protein deficiency and so on.
Desktop Bottom Promotion