For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్న వయసులోని తెల్లజుట్టు సమస్యా ? ఇవిగో సింపుల్ టిప్స్

By Nutheti
|

లేటు వయసులో తెల్ల జుట్టు వస్తే సమస్య కాదు. కానీ ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా.. జుట్టు తెల్లబడుతోంది. స్వీట్ సిక్స్ టీన్ లోనే.. తెల్లజుట్టు సమస్య అమ్మాయిలను, అబ్బాయిలను వేధిస్తోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. వేలాదిమంది మహిళలు, మగవాళ్లు తెల్లజుట్టు నివారణోపాయాల కోసం ఎదురుచూస్తున్నారు.. అన్వేషిస్తున్నారు.

READ MORE: చిన్న పిల్లల్లో తెల్లజుట్టు నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్

జుట్టు తెల్లబడటాన్ని ఎలా నివారించాలి ? అన్నది యూత్ ని వెంటాడుతున్న ప్రశ్న. జుట్టులో పిగ్మెంటేషన్ సెల్స్ ఉంటాయి. ఈ కణాలు జుట్టు రంగు బాధ్యత నిర్వహిస్తాయి. బ్లాక్, బ్రౌన్ వంటి రంగులు ఈ కణాల మీద ఆధారపడి ఉంటాయి. మనం పెరిగి పెద్దవాళ్లు అయ్యే కొద్దీ ఈ కణాలు తగ్గిపోతూ ఉంటాయి. దీనివల్ల రంగు మారుతుంటుంది. కానీ ఈ మధ్య కాలంలో సమయానికి ముందే జుట్టు తెల్లబడుతోంది. ఇది చాలా మందిని ఇబ్బందికి గురిచేస్తోంది. అసలు చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటానికి కారణాంటి ? తెల్లజుట్టు నివారించే మార్గాలేంటి ? తెల్లజుట్టుని నల్లగా నిగనిగలాడేలా మార్చుకునే చక్కటి హోం రెమిడీస్ ఉన్నాయి. అవి ట్రై చేయండి.. మీ జుట్టుని పట్టుకుచ్చులా మెరిపించండి.

జుట్టు తెల్లబడటానికి కారణాలు

జుట్టు తెల్లబడటానికి కారణాలు

ఒత్తిడి చాలా ముఖ్యమైన కారణం. ఇది ఎక్కువ ప్రభావం చూపేది జుట్టుపైనే. ఒత్తిడితో పాటు పోషకాహార లోపం, హీటింగ్ ఎక్యుప్ మెంట్స్ వాడటం, వారసత్వం, తలమాడు భాగాన్ని శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఈ సమస్య వస్తోంది.

కరివేపాకు

కరివేపాకు

కరివేపాకు తీసుకోవడం వల్ల కూడా తెల్లజుట్టు తగ్గుతుంది. పూర్వం నుంచి జుట్టు సంరక్షణలో కరివేపాకు బాగా సహాయపడుతుంది. కొబ్బరినూనెలో కరివేపాకు ఆకులు వేసి బాగా ఉడికించాలి. చల్లారిన తర్వాత ఆ నూనెను తలకు పట్టించుకోవడం వల్ల తెల్లజుట్టు సమస్య దరిచేరదు.

అల్లం, తేనె

అల్లం, తేనె

అల్లం తురుము, తేనెను కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఒక టేబుల్ స్పూన్ తీసుకోవడం వల్ల తెల్లజుట్టు సమస్య తగ్గిపోతుంది.

మసాజ్

మసాజ్

ప్రతి రోజూ రాత్రిపూట ఉసిరికాయ రసం, ఆల్మండ్ ఆయిల్, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రేయింగ్ ని నిరోధించవచ్చు.

ఉసిరి, హెన్నా ప్యాక్

ఉసిరి, హెన్నా ప్యాక్

తాజా హెన్నా పేస్ట్ కి 3 టేబుల్ స్పూన్ల ఉసిరికాయ పొడి కలపాలి. దానికి 1 టేబుల్ స్పూన్ కాఫీ పొడి, కొంచెం నీళ్లు కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. దీన్ని తలకు పట్టించి పూర్తీగా ఆరనివ్వాలి. తర్వాత మైల్డ్ షాంపూతో స్నానం చేస్తే జుట్టు నల్లగా మెరిసిపోతుంది.

బ్లాక్ టీ రెమిడీ

బ్లాక్ టీ రెమిడీ

రెండు టేబుల్ స్పూన్ల టీని ఉడికించాలి. ఇందులో చక్కెర, పాలు కలపకూడదు. ఈ నీళ్లు తీసుకుని చల్లారనివ్వాలి. తర్వాత జుట్టు అంతటికీ రాసుకోవాలి. తర్వాత షాంపూ ఉపయోగించకుండా చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

కొబ్బరినూనె, నిమ్మకాయ

కొబ్బరినూనె, నిమ్మకాయ

మీ జుట్టుకు సరిపడా ఆయిల్ తీసుకుని దానిలో.. 3 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలపాలి. తర్వాత కుదుళ్ల నుంచి జుట్టుకి పట్టించాలి. గంట తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

పొటాటో వాటర్ మాస్క్

పొటాటో వాటర్ మాస్క్

ఒక బంగాళదుంపను ఉడకబెట్టాలి. ఆ నీటిని తలకు పట్టించుకుంటే.. జుట్టు నల్లగా మారుతుంది. లేదా పొటాటో వాటర్ కి పెరుగు కలిపి పట్టించుకున్నా జుట్టు నల్లగా మారుతుంది.

అవకాడో మాస్క్

అవకాడో మాస్క్

అవకాడోలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు నల్లగా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది. కాబట్టి అవకాడో ని నీటిలో ఉడకబెట్టాలి. తర్వాత అంతటినీ బాగా పేస్ట్ లా చేసుకోవాలి. దాన్ని కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు అప్లై చేయడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది.

మిరియాల మాస్క్

మిరియాల మాస్క్

నల్లమిరియాలను గ్రైండ్ చేయాలి. తర్వాత పెరుగు, నిమ్మరసం కలిపి పేస్ట్ చేయాలి. స్కాల్ఫ్ కి పట్టించాలి. యాక్నే, డాండ్రఫ్ సమస్యలతో పాటు జుట్టు తెల్లబడటాన్ని న్యాచురల్ గా నివారిస్తుంది.

ఒత్తిడి

ఒత్తిడి

ఈ మాస్క్ లతో పాటు కొన్ని అలవాట్ల వల్ల కూడా తెల్లజుట్టు రాకుండా నివారించవచ్చు. ముందుగా ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఒత్తిడి తగ్గించుకుని చూడండి.. మీ జుట్టు కలర్ లో వచ్చే మార్పులు గ్రహించండి. చిన్న చిన్న సంతోషాలు మీ ఒత్తిడిని ఈజీగా తగ్గిస్తాయి. కాబట్టి షికారుకి వెళ్తూ ఉండండి.

ఆహారం

ఆహారం

సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. కెరటిన్ ఉండే ప్రొటీన్స్ పుష్కలంగా తీసుకోవడం వల్ల తెల్ల జుట్టు సమస్యను తగ్గించుకోవచ్చు. పాలకూర, మీగడ, పాలు, వెన్న వంటివి డైట్ లో చేర్చుకోవాలి. ఒకవేళ డైరీ ప్రొడక్ట్స్ ఇష్టం లేకపోతే తక్కువ ఫ్యాట్ ఉండే ఐస్ క్రీమ్, ప్రొటీన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి.

స్మోకింగ్ మానేయడం

స్మోకింగ్ మానేయడం

స్మోకింగ్ అలవాటు ఉంటే.. దాన్ని మానేయాలి. ఇది జుట్టుకి రక్షణ కల్పించే ఫోలికల్స్ అనే కణాలపై దుష్ర్పభావం చూపిస్తాయి.

ధైరాయిడ్

ధైరాయిడ్

థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లకు జుట్టు తెల్లబడటానికి ఎక్కువ అవకాశాలున్నాయి. కాబట్టి ఒక్కసారి థైరాయిడ్ చెక్ చేయించుకోవడం మంచిది.

షాంపూ ఎంపిక

షాంపూ ఎంపిక

మైల్డ్ షాంపూలు, ఆర్గానిక్ షాంపూలు వాడటం అలవాటు చేసుకోవాలి. ఎక్కువ ఘాడత, కెమికల్స్ ఉన్న షాంపూలు, కండిషనర్ లు తెల్లజుట్టుకి, జుట్టు రాలడానికి కారణమవుతాయి.

ఆయిల్

ఆయిల్

జుట్టుకి ఆయిల్ తక్కువ అవడం, మాయిశ్చరైజర్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల డీహైడ్రేట్ అయి జుట్టు తెల్లబడుతుంది. కాబట్టి రెగ్యులర్ గా ఆయిల్ పెట్టుకోవాలి. స్పాలకు వెళ్లడం కంటే ఇంట్లోనే మసాజ్ చేసుకుంటే మంచిది.

English summary

Amazing Ways To Turn Grey Hair Into Black: Reasons for Premature Greying

There was a time when Hair graying happened to only older people. But in our present day, due to high stress levels and pollution, we are seeing this even among girls as young as 16. It has become an important concern and thousands of people, men and women alike, are seeking medication.
Desktop Bottom Promotion