For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టుకు నూనె పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు

|

సాధారణంగా ఎవరికైనా ఒతైన జుట్టు కావాలని కోరుకుంటారు. అయితే కేశాల పట్ల సరైన జాగ్రత్తలు, సంరక్షణ కలిగి వుంటే జుట్టును కాడుకోవచ్చు. సంరక్షణలో ఆయిల్ థెరపీ చక్కటి నివారణ. హాట్ ఆయిల్ థెరపీతో జుట్టును ఎప్పటిలానే మెరిపించవచ్చు. కురులను సహజ పద్దతులతో కాపాడుకోవడానికి ఇది ఒక ఉత్తమమైన మార్గం. నిజం చెప్పాలంటే పూర్వ కాలం నుండి ఈ హాట్ ఆయిల్ మసాజ్ వాడుకలో ఉన్నది. వేడి నూనె శరీరారనికే కాదు తలకు కూడా పట్టించి మన పూర్వీకుల తలంటు పోసుకొనేవారు.

READ MORE: డ్రై అండ్ డ్యామేజ్ హెయిర్ ను నివారించి, షైనీగా మార్చే హెయిర్ మాస్క్

ఇలా చేస్తే చర్మ వ్యాదు దరిచేరవని తలకు శాంతం చేకూరుతుందని వారి నమ్మకం. కాబట్టి తలకు హాట్ ఆయిల్ మసాజ్ చేసుకోవడం వల్ల మంచి ఉపయోగాలున్నాయి. అందుకు కొబ్బరి నూనె, బాదం నూనె లేదా కాస్ట్రాల్ ఆయిల్ ఉపయోగించడం వల్ల అధిక ప్రయోజనాలను పొందవచ్చు. ఇలా వారానికొకసారి హాట్ ఆయిల్ మసాజ్ చేసుకోవడం వల్ల జుట్టు పెరుగుదలలో, పోషణలో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అవేంటో మీరు తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ చేయాల్సిందే....

జుట్టుకు పోషణను అందిస్తుంది:

జుట్టుకు పోషణను అందిస్తుంది:

హాట్ ఆయిల్ ట్రీట్ మెంట్ ఒక మంచి పద్దతి. ఇదులో న్యూరిషస్ మరియు మాయిశ్చరైజింగ్ ఉత్తమమార్గం. ఇది ఒక నేచురల్ పద్దతి. తలకు హాట్ ఆయిల్ మసాజ్ చేయడం వల్ల చాల ప్రయోజనాలున్నాయి. తలలో కేశరంద్రాలను తెరి ఉంచి జుట్టు మూలాలకు మంచి మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. తలలోని జుట్టు మొదళ్ళకు మంచి పోషణను అందిస్తుంది.

కురులకు మెరుపు:

కురులకు మెరుపు:

వేడినూనెతో తలను మర్ధన చేయడం వల్ల తల వెంట్రుకు మెరుస్తుంటాయి. మీ వెంట్రుకలు పొడి బారీ, నిర్జీవంగా ఉన్నప్పుడు ఈ పద్దతి చాలా ఉపయోగకరమైనది. కాబట్టి మీ నిర్జీవమైనటు కేశాలు మంచి కళతో మెరుస్తుండాలంటే వారంలో కనీసం ఒకటి రెండు సార్లు వేడి నూనెతో తలకు మసాజ్ చేయాలి. హాట్ ఆయిల్ మసాజ్ వల్ల కురులు మెరుస్తుండేలా జీవివం పోస్తుంది.

కురులు పెరగడానికి:

కురులు పెరగడానికి:

ఆయిల్ సింపుల్ గా తలకు రాయడం కంటే తలకు చేతి వేళ్ళతో మర్ధన చేయడం వల్ల తలలోని రక్త కణాలకు రక్త ప్రసరణ బాగా జరిగి కురులు పెరగడానికి బాగా సహాయపడుతుంది. కేశరంద్రాలు తెరచుకొనేలా చేసి కొబ్బరినూనె, క్యాస్ట్రాయిల్ మర్ధన చాలా ఉపయోగకరం. తల మూలాలకు పోషణ అందించడమే కాకుండా కురులు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది.

చుండ్రు నివారిస్తుంది:

చుండ్రు నివారిస్తుంది:

చాలా మందికి ఆయిల్ హెయిర్ వల్ల చుండ్రు అధికంగా ఉంటుంది. అలాంటి వారు ఆ ఆయిల్ మసాజ్ చేయడం వల్ల చుండ్రును వదించుకోవచ్చు. హాట్ ఆయిల్ మసాజ్ అనే కాదు హెయిర్ మసాజ్ వల్ల చాల ఉపయోగాలున్నాయి. తలలో రక్త ప్రసరణ బాగా జరగడం వల్ల చుండ్రులేకుండా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

జుట్టు స్ట్రాంగ్ గా పెరిగేలా చేస్తుంది:

జుట్టు స్ట్రాంగ్ గా పెరిగేలా చేస్తుంది:

హాట్ ఆయిల్ మసాజ్ వల్ల కురులకు శక్తి చేకూరుతుంది. నిర్జీవంగా మారి, మద్యలో తెగి, రాలిపోయే కురులు సైతం బలంగా మారుతాయి. హెయిర్ ఫాల్ నుండి కాపాడుతుంది.

ఒత్తైన జుట్టు:

ఒత్తైన జుట్టు:

హాట్ ఆయిల్ మసాజ్ వల్ల కురులు దట్టంగా పెరుగుతాయి. హాట్ ఆయిల్ మసాజ్ వల్ల ముందు మీ కురులు ఎలా ఉన్నా మసాజ్ తర్వాత ఆరోగ్యకరమైన, జుట్టు పెరగడం ప్రారంబమైతుంది.

జుట్టు చిట్లకుండా నివారిస్తుంది:

జుట్టు చిట్లకుండా నివారిస్తుంది:

జుట్టు పొడవుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా వారి ఆరోగ్యస్థితుగతులను బట్టి, తీసుకొనే ఆహారం బట్టి కురుల చివర్లు చిట్లడం మొదలెడాయి. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. అయితే చిట్లిన వెంట్రుకలు ఉండటం వల్ల వెంట్రుకల పెరగనివ్వకుండా ఆపుచేస్తుంది. కాబట్టి హాట్ ఆయిల్ మసాజ్ వల్ల వెంట్రుకలు చిట్లకుండా ఆరోగ్యంగా పొడవుగా పెరగడానికి ఉపయోగపడుతుంది.

డిటాక్సిఫైస్:

డిటాక్సిఫైస్:

సాధారణంగా చాలా మంది తలకు వివిధ రకాలైన షాంపూలను ఉపయోగిస్తుంటారు. అలాగే హానికరమైన రసాయనాలు కలిగిన హెయిర్ డై లను ఉపయోగిస్తుంటారు. దాంతో కేశాలకు తలకు కూడా చెడు జరిగి హెయిర్ ఫాల్ మొదలవుతుంది. వీటి నుండి బయట పడి తలకు, కేశాలకు సంరక్షణ కల్పించాలంటే తప్పనిసరిగా హాట్ ఆయిల్ మసాజ్ చాలా ఉపయోగకరమైన పద్దతి...

English summary

Benefits Of Applying Oil To Hair: Beauty Tips in Telugu

What is the use of applying oil to hair? Though most of us were forced by our parents to apply oil regularly, we gave up the habit once we became adults. But in fact, our grand parents were right.
Story first published: Thursday, July 2, 2015, 18:02 [IST]
Desktop Bottom Promotion