For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కురుల సౌందర్యానికి హోం రెమిడీస్

By Nutheti
|

అతివల అందానికి ఒత్తైన కురులు మరింత అందాన్ని చేకూరుస్తాయి. జుట్టుని సంరక్షించుకోవడానికి అమ్మాయిలు చాలా ప్రయత్నిస్తుంటారు. కానీ కాలుష్యం, గాలి, దుమ్ము, తీసుకునే ఆహారం, ఒత్తిడి కారణంగా.. జుట్టు నిర్జీవంగా మారడం, ఊడిపోవడం, చుండ్రు వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఇలాంటి సమస్యలన్నింటికీ గుడ్ చెప్పడానికి కొన్ని చిట్కాలు. ఫాలో అవ్వండి.

జుట్టు అందంగా.. ఆరోగ్యంగా పెరగాలంటే.. శరీరానికే కాదు.. కురులకూ ఆహారం పెట్టాలి. అదేనండీ.. ప్యాక్ ల రూపంలో.. ట్రీట్ మెంట్ ఇస్తే మీరు కోరుకునే.. జుట్టు మీ సొంతమవుతుంది. ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే తయారు చేసుకునే.. కొన్ని హెయిర్ ప్యాక్స్ ప్రయత్నించి.. మీ జుట్టుకు సహజ సౌందర్యాన్ని ఇవ్వండి.

avacado

అవకాడో
అవకాడో.. ఆరోగ్యానికే కాదు.. కురుల సౌందర్యానికి బాగా ఉపయోగపడుతుంది. అవకాడో గుజ్జు తీసి.. దానికి ఒక టేబుల్ స్పూన్ పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టంతా పట్టించి... 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

milk

నిమ్మకాయ, పాలు
నిమ్మకాయలోని పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతాయి. అయితే నిమ్మకాయని ఎప్పుడూ డైరెక్ట్ గా అప్లై చేయకూడదు. కాబట్టి రెండు కప్పుల పాలు తీసుకుని.. దానికి ఒక నిమ్మకాయ రసం కలిపి.. జుట్టంతా పట్టించాలి. కుదుళ్లకు, జుట్టుకు రాసుకుని... అరగంట తర్వాత కడిగేసుకోవాలి.

olive

తేనె, ఆలివ్ ఆయిల్
మీ జుట్టు పొడిబారిపోయి ఉందా. అయితే తేనె, ఆలివ్ ఆయిల్ ను మిశ్రమంలా కలుపుకుని.. దాన్ని తలకు పట్టించాలి. అరగంట తర్వాత కడిగేసుకుంటే.. జుట్టు మృదువుగా తయారవడమే కాదు.. చివర్లు కూడా చిట్లిపోకుండా.. సిల్కీగా మెరిసిపోతాయి.

egg

కోడిగుడ్డు
గుడ్డులోని తెల్లసొన, టీ డికాషన్ తీసుకుని రెండింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి అప్లై చేస్తే.. పొడిబారిన, గరుకుగా మారిన జుట్టుకు గుడ్ బై చెప్పవచ్చు. బ్లాక్ టీ కురులకు సహజ మెరుపుని రంగుని అందిస్తుంది.

English summary

Foods To Feed Your Hair : beauty tips in telugu

It is time ladies to feed your hungry tresses with some of the best foods on the list. Did you know, pampering your hair with these foods as masks can help deal with hair loss and dandruff issues.
Story first published: Thursday, October 1, 2015, 12:57 [IST]
Desktop Bottom Promotion