For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడం ఎలా

|

జుట్టు రాలడానికి అనేక కారణాలున్నాయి. అయితే జుట్టు రాలడంతో పాటు, జుట్టు పెరుగుదల ఆగిపోయినట్లైతే, వాటిని తిరిగి పెరిగేలా చేయవచ్చు. జుట్టు రాలడానికి గల కారణాలు తెలుసుకొన్నట్లైతే, వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకుంటే సమస్యను నిర్మూలించుకోవచ్చు. రోజుకు 0.5mm పొడవు జుట్టు పెరుగుతుంది. కాబట్టి, జుట్టు పెరుగుదల రేటును పెంచుకోవడానికి మీరు ఏమైనా చేవయచ్చు.

కొన్ని పరిస్థితులను వెంటనే పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వెంటనే సమస్యను తగ్గించుకోవచ్చును. జుట్టు రాలడానికి ప్రదాణ కారణం ఒత్తిడి, పౌష్టికాహార లోపం. వీటి గురించి సరైన జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే వెంటనే జుట్టు సమస్యలను నివారించుకోవచ్చు . మరియు జుట్టు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి.

READ MORE: జుట్టు పెరుగుదలకు 30 వండర్ఫుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్

జుట్టు సమస్యలను నివారించి జుట్టు పెరుగుదల ప్రోత్సహించే చిట్కాలను పరిశీలిద్దాం...

ఒత్తిడి:

ఒత్తిడి:

జుట్టు పెరుగుదల మీద ఒత్తిడి ఎక్కువ ప్రభావం చూపుతుంది . మరియు ఇది జుట్టు రాలే సమస్యకు దారితీస్తుంది. కాబట్టి విశ్రాంతిగా ఉండి, స్ట్రెస్ లెవల్స్ ను తగ్గించుకోవాలి.

డైట్:

డైట్:

జుట్టు పెరుగుదలలో డైట్ చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది. మీ జుట్టుకు తగినంత విటమిన్స్, మినిరల్స్, జిక్ మరియు ఐరన్ మరియు ప్రోటీన్స్ అధికంగా అవసరం అవుతాయి . ఇవన్నీ మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల ద్వారానే పొందవచ్చు.

స్టైలింగ్:

స్టైలింగ్:

జుట్టు అందం కోసం ఉపయోగించే కొన్ని స్టైలింగ్ ప్రొడక్ట్స్ కూడా జుట్టు రాలడానికి కారణం అవుతుంది . కాబట్టి, ఇలాంటి స్టైలింగ్ ప్రోడక్ట్స్ ను ఉపయోగించడానికి దూరంగా ఉండాలి.

తల:

తల:

తలను శుభ్రంగా ఉంచాలి. కాబట్టి, జుట్టు పెరుగుదలకు మంచి కండీసనర్ అవసరం వుతుంది. కాబట్టి తలను ఎల్లప్పుడు క్లీన్ గా ఉంచుకోవడం మంచిది.

ఇతర పరిస్థితులు:

ఇతర పరిస్థితులు:

కొన్ని పరిస్థితులు మన చేయి దాటి పోయి ఉండవచ్చు. వాటిని మనం కంట్రోల్ చేయలేము. జన్యు సంబంధమైన, అనారోగ్య సమస్యలు, ఓల్డ్ ఏజ్ మరియు హార్మోన్స్ ప్రభావం వీటిని మనం కంట్రోల్ చేయలేము. అయితే ముందు జాగ్రత్తలు కనుక తీసుకొన్నట్లైతే జుట్టు రాలడం తగ్గించుకోవచ్చు.

English summary

How To Accelerate Hair Growth

You don't need to wait. Do you know the fact that you can accelerate hair growth? Well, your hair generally grows only 0.5 mm per day. You can do something to increase the growth rate.
Story first published: Monday, June 1, 2015, 12:47 [IST]
Desktop Bottom Promotion