For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు రాలడం తగ్గిస్తుంది..జుట్టు పెరిగేలా చేస్తుంది: అరటి జ్యూస్

|

జుట్టును సంరక్షించుకోవడం కోసం ఎన్నో రకాల హోం రెమెడీస్, మార్కెట్లో బ్యూటీ ప్రొడక్ట్స్ ను, హెయిర్ మాస్క్ లను ఉపయోగించి ఉంటాయి. అయితే అరటి పండు కూడా జుట్టు సంరక్షణలో ఒక బాగం అంటే ఆశ్చర్యం కలగక మానదు. అరటి పండ్లు ఆరోగ్యం కోసం మాత్రమే కాదు, అందానికి కూడా గొప్పగా ఉపయోగపడుతుంది అని నిరూపించుకోవడానికే ఈ ఆర్టికల్ ! ఇది నిజం కావాలంటే మీరు ఈ ఆర్టికల్ ను పూర్తిగి చదివి తెలుసుకోండి. అరటి పండ్ల జ్యూస్ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నిరూపించుకొన్నది..

మరి ఆశ్చర్యం కలిగించేలా అరటిపండ్లు జుట్టుకు ఏ విధంగా సహాయపడుతాయి? ఈ హెల్తీ ఫ్రూట్ జీర్ణక్రియకు చాలా గొప్పగా సహాయపడుతుందన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే . మరియు స్టొమక్ అప్ సెట్ ను కూడా కంట్రోల్ చేస్తుంది. మరి జుట్టుకు ఏవిధంగా ఉపయోగపడుతుంది? అందుకు అనేక కారణాలు ఇక్కడ ఉన్నాయి..అవేంటో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం....

విటమిన్స్ కు ఒక గొప్ప నిలయం అరటి:

విటమిన్స్ కు ఒక గొప్ప నిలయం అరటి:

అరటి పండ్లలో విటమిన్స్ అధికం. విటమిన్ బి3, బి6 మరియు సి. మరిు పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవన్నీ మీ జుట్టుకు అందినప్పుడు మీ జుట్టు మరింత తేజో వంతంగా మరియు ఒత్తుగా చిగురిస్తూ కనిపిస్తుంది.

పొటాషియం:

పొటాషియం:

శరీరంలో పొటాషియం లోపం వల్ల కూడా జుట్టు రాలడానికి తెలియని కారణం ఒకటి. కాబట్టి, బనానా జ్యూస్ లో ఉండే పొటాషియం జుట్టు పోషణకు ఒక గొప్ప మూలం.

మాయిశ్చరైజింగ్:

మాయిశ్చరైజింగ్:

బనానా జ్యూస్ ను తలకు మరియు కేశాలకు పట్టించడం వల్ల జుట్టుకు కావల్సినంత మాయిశ్చరైజింగ్ ను అందిస్తుంది మరియు జుట్టును సాఫ్ట్ గా మరియు ప్రకాశవంతంగా మరియు హెల్తీగా మార్చుతుంది.

గ్రేట్ కండీషనర్:

గ్రేట్ కండీషనర్:

ఎప్పుడైతే జుట్టుకు మంచి కండీషన్ అందుతుందో అప్పుడు జుట్టు ప్రకాశవంతంగా...అందంగా కనబడుతుంది. హెయిర్ ను మ్యానేజ్ చేయడం కూడా సులభం అవుతుంది మరియు ముఖం అందంగా కనబడుతుంది . కాబట్టి బనానా జ్యూస్ ను జుట్టుకు కండిషనర్ గా అప్లై చేయడం మంచిది.

ఎగ్ అండ్ బనానా:

ఎగ్ అండ్ బనానా:

జుట్టుకు ఎగ్ అప్లైచేయడం చాలా ఆరోగ్యకరం . ఎగ్ కు కొద్దిగా అరటి జ్యూస్ ను మిక్స్ చేసి తలకు అప్లై చేయడం వల్ల న్యూట్రీషియన్ లెవల్స్ పూర్తిగా అందుతాయి మరియు జుట్టుకు మరియు తలకు సూపర్ ఫుడ్స్.

తేనె మరియు బనానా:

తేనె మరియు బనానా:

జుట్టును బలోపేతం చేసే పదార్థాల్లో తేనె ఒకటి. తేనెను జుట్టుకు పట్టించినప్పుడు జుట్టు సాఫ్ట్ అండ్ షైనీగా మారతుంది . తేనె మరియు అరటి జ్యూస్ ను సమంగా తీసుకొని హెయిర్ కు ప్యాక్ లా వేసుకోవాలి. ఇది జుట్టుకు తగినంత పోషణను మరియు రక్షణ కల్పిస్తుంది.

పెరుగు మరియు అరటి:

పెరుగు మరియు అరటి:

అరటిపండ్ల జ్యూస్ లో ఉండే ప్రయోజనాలేంటో మీకు తెలిసింది. దీని జతకు మరింత ప్రోటీన్ రిచ్ ఫుడ్ అయినా బనాను జోడించడం వల్ల మరింత ఎఫెక్టివ్ రిజల్ట్ ను మీరు పొందవచ్చు . ఇది జుట్టు రాలడం తగ్గించడం మాత్రమే కాదు, ఇది జుట్టుకు అవసరం అయ్యే పోషణను అందిస్తుంది.

శెనగపిండి:

శెనగపిండి:

జుట్టు బాగా పెరగాలంటే , తగినంత పోషకాలు అందివ్వడం అవసరం మరియు మరియు విటమిన్లు కూడా అవసరం అవుతాయి . శెనగపిండిలో అరటి జ్యూస్ మిక్స్ చేసి తలకు పట్టించి, 20 నిముషాల తర్వాత కడిగేసుకోవాలి . అరటి జ్యూస్ విటమిన్స్ ను అందిస్తే, శెనగపిండి ప్రోటీనుల అందిస్తుంది . ఈ రెండింటి కాంబినేషన్ హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ మార్చుతాయి.

English summary

How Banana Juice Helps Your Hair: Beauty tips in Telugu

How Banana Juice Helps Your Hair.Want to go bananas with a headful of healthy glowing hair? The best way is to use bananas. That is right! Banana juice is proven to improve hair health.
Story first published: Tuesday, September 22, 2015, 18:06 [IST]
Desktop Bottom Promotion