For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషులు స్టైల్ గా పొడవాటి జుట్టును పెంచుకోవడానికి మార్గాలు

By Super
|

స్త్రీలు చిన్నతనం నుండే జుట్టును పెంచుకోవడం, దాన్ని నిలబెట్టుకోవడం చేస్తారు, కానీ పురుషులకు కనీసం అది ఒక పని లాగా భావించి పొందుతారు.

కానీ ఆధునిక ఫాషన్ విధానంతో కొత్త శైలిని ప్రయత్నిస్తూ పురుషులు జుట్టును పెంచుకోవడానికి అనేక చిట్కాలు వివరించబడ్డాయి.

READ MORE: పురుషుల జుట్టు సమస్యలకు 20 బెస్ట్ హోం రెమడీస్...!

మీ జుట్టును పొడవుగా పెంచడం ఎలా? సరే, దీనికి సహనం, సరైన నిర్వహణ, సరైన ఆహారం అవసరం. అవును, జుట్టు పెంచడం సరదా పని కాదు, సహన౦, మంచి ఆహారం లేకుండా ఇది సాధ్యం కాదు. మీ జుట్టు బలంగా, పొడవుగా పెరగడానికి బాగా పోషణ అవసరం.

READ MORE: పురుషులు అందంగా..గుబురుగా గడ్డం పెంచుకోవడానికి 8 చిట్కాలు

అంతేకాకుండా, అనేకమంది ప్రముఖుల చిత్రాలను బ్రౌజ్ చేసి ఒక శైలిని ఎంచుకోండి. లేకపోతే, మీరు మీ స్టైలిస్ట్ దగ్గరకు వెళ్లి, మీ ముఖానికి నప్పే జుట్టు శైలిని సూచించమని అడగండి. ఇప్పుడు, జుట్టును పొడవుగా పెంచడం ఎలాగో తెలుసుకుందాం...

ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని, దానిపై నిలబడండి

ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని, దానిపై నిలబడండి

ఎటువంటి లక్ష్యం లేకుండా, మీరు దేన్నీ సాధించ లేరు, అదేవిధంగా జుట్టు పెరుగుదల కూడా అంతే. మీరు మీ జుట్టును పొడవుగా పెంచుకోవాలి అంటే ఎన్నో నెలల సమయం మీరు ఓపిక వహించాలి.

మీ లక్ష్యం ఎపుడూ వాస్తవంగా ఉండాలి

మీ లక్ష్యం ఎపుడూ వాస్తవంగా ఉండాలి

మీరు ఒక నటుడి జుట్టు శైలిని అనుసరించడానికి ప్రయత్నం చేయవచ్చు, కానీ మీ జుట్టు ఆకృతి, సహజత్వం దృష్టిలో పెట్టుకుని, మీకు ఆ శైలి నప్పుతుందా లేదా విచారించుకోవాలి. అంతేకాకుండా, లక్ష్యాలను ఏర్పరచుకొనడంలో వాస్తవికంగా ఉండాలి.

చివర్లు కత్తిరించండి

చివర్లు కత్తిరించండి

మీరు మీ జుట్టును కత్తిరించడానికి ఇష్టపడకపోతే, చివర్లు ట్రిమ్ చేయండి, ఆరోగ్యకరంగా జుట్టును పెంచాలి అంటే ఇది చాలా అవసరం. దీన్ని చేయించుకోవడానికి సెలూన్ కి వెళ్ళండి.

కండిషనర్

కండిషనర్

ప్రత్యేకంగా మీరు మీ జుట్టును పెంచుకోవాలి అనుకుంటే, ప్రతిరోజూ మీ జుట్టుకు కండిషన్ ను అప్లై చేయండి. పొడవు జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది, దాన్ని తగ్గించడానికి కండిషనర్ ఉపయోగపడుతుంది.

చల్లని నీరు

చల్లని నీరు

వేడి నీటితో తలస్నానం చేసిన ప్రతిసారీ, మరలా మీ జుట్టును చల్ల నీటితో శుభ్రం చేయాలి. దీనివల్ల మీ జుట్టు కొద్దిపాటి తేమను పొందడానికి సహాయపడుతుంది.

సహనం

సహనం

సహనం లేకపోతే, మీ ప్రయాణం అనుకున్న స్థానం చేరుకోదు. మొదటి 2 నెలలు కొంచెం అసౌకర్యంగా ఉండి, మీ జుట్టు దురదగా ఉంటుంది.

షాంపూ చేసుకోవడం

షాంపూ చేసుకోవడం

మీరు మీ జుట్టుకి వారానికి 3 సార్ల కంటే ఎక్కువ షాంపూ ను వాడవద్దు, ఎందుకంటే దీనివల్ల మీ నెత్తిమీద ఉన్న సహజ నూనెలు బైటికి వెళ్ళిపోతాయి. మీ జుట్టు పొడిబారి, పెంచుకోడానికి అనువుగా ఉండదు.

మంచి ఆహరం తినాలి

మంచి ఆహరం తినాలి

ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం, విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉన్న ఆకుకూరలు తీసుకోవాలి. అవును, మీ జుట్టుకు మంచి ఆహరం కుడా అవసరం.

English summary

How Men Can Grow Long Hair: Beauty Tips in Telugu

How Men Can Grow Long Hair: Beauty Tips in Telugu, How to make your hair grow longer? Well, it requires patience, proper grooming and the right food. Yes, growing your hair long is no joke and it isn't possible without patience and good food. Your hair must be nourished well to grow long and strong.
Desktop Bottom Promotion