For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కురుల సౌందర్యానికి అల్లం చేసే అద్భుతం

By Nutheti
|

అల్లం ఆరోగ్యానికే కాదు.. అందానికి సహాయపడుతుంది. ప్రకృతి ప్రసాదించిన అద్భుతాలలో అల్లం ఒకటి. వంటల్లో ఘాటైన.. పసందైన వాసనతో ఘుమఘుమల రుచిని అందించే అల్లం.. జుట్టు సమస్యలకు ఔషధంలా పనిచేస్తుంది.

మెగ్నీషియం, పాస్పరస్, పొటాషియం, విటమిన్ వంటి పోషకాలు సమృద్దిగా ఉండే అల్లం వెంట్రుకలను బలంగా, ఆరోగ్యంగానే కాదు.. నిగనిగలాడేలా చేస్తుంది. అదెలా అనుకుంటున్నారా ? లెట్స్ టేక్ ఎ లుక్

zinger

చుండ్రు సమస్యకు
నేటి యువతను ప్రధానంగా వేధిస్తున్న సమస్య చుండ్రు. యాంటీ సెప్టిక్ గా పనిచేసే అల్లం నుంచి చుండ్రు సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టవచ్చు. రెండు స్పూన్ల అల్లం రసం, మూడు స్పూన్ల నువ్వుల నూనె లేదా ఆలివ్ ఆయిల్, నిమ్మసరం తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుపై మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత.. చల్లనీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 3 సార్లు ప్రయత్నిస్తే.. ఫలితం ఉంటుంది.

dandruf

హెయిర్ ఫాల్ కంట్రోల్
జుట్టు రాలిపోతూ ఉంటే.. రకరకాల షాంపూలు వాడి ఉన్న జుట్టుని కాస్త పోగొట్టుకుని విగిసిపోతుంటారు చాలామంది. రసాయనాలపై ఆధారపడటం కంటే.. ఇంట్లోనే చిట్కాలు ప్రయత్నించడం మంచిది. ఒక స్పూన్ అల్లం, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ ని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు రాస్తూ.. కొన్ని నిమిషాలు మసాజ్ చేయాలి. అరగంట తర్వాత గాడత తక్కువగా ఉండే షాంపూతో జుట్టును శుభ్రం చేసుకోవాలి.

hairfall

ఈ అల్లం ప్యాక్ లను ప్రయత్నించి చూడండి. ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. కొన్ని రోజుల్లోనే మీ జుట్టు పట్టుకుచ్చులా.. మెరుస్తుంది.

English summary

How To Use Ginger For Hair Growth ?: beauty tips in telugu

Ginger is more than just a delectable spice to add flavour to your dishes. It is a natural herb with properties that help in treatment of different medical problems right from nausea and indigestion to respiratory issues and heart problems. Besides, the strong and stimulating property of ginger also makes it an excellent remedy for hair growth.
Desktop Bottom Promotion