For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చుండ్రు నివారించడానికి వేపాకు ఎలా ఉపయోగపడుతుంది ?

By Nutheti
|

కాలుష్యం, ఒత్తిడి, దూర ప్రయాణాల కారణంగా ప్రతి ఒక్కరిని చుండ్రు సమస్య వేధిస్తుంది. ప్రస్తుత బిజీ లైఫ్ లో చుండ్రుతో బాధపడే వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. ఎన్ని ప్యాక్ లు వేసుకున్నా, ఎన్ని షాంపూలు వాడినా.. చుండ్రు సమస్య నుంచి మాత్రం బయటపడలేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి చక్కటి పరిష్కారం వేపాకు.

ప్రకృతిసిద్ధంగా లభించే వేపాకులో ఎన్నో మెడికల్ గుణాలున్నాయి. ఇవి చుండ్రును ఈజీగా నివారిస్తాయి. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు వేపాకులో మెండుగా ఉన్నాయి. మధుమేహం, స్కిన్ అలర్జీలు, పిగ్మెంటేషన్, చుండ్రు, మాడుపై దురద, పొడిబారిన స్కాల్ఫ్, పింపుల్స్, యాక్నే సమస్యలను నివారించడంలోనూ వేపాకు సహాయపడుతుంది.

neem

యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్న వేపాకు తలలో వచ్చే అన్ని రకాల సమస్యలకు గుడ్ చెబుతుంది. ఇందులో 35 రకాల పవర్ ఫుల్ ఇంగ్రిడియంట్స్ ఉన్నాయి. అవి తలలో వచ్చే చుండ్రు, దురద సమస్యలను ఈజీగా పోగొడతాయి. వేపాకుతో చుండ్రు నివారించే ఉపాయాలేంటో తెలుసుకుందాం..

curd

వేపాకు, పెరుగు, మెంతులు: మెంతులు జుట్టును స్ర్టాంగ్, షైనీగా మారుస్తాయి. వేపాకు, మెంతులలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి. పెరుగు కండిషనర్ లా పనిచేస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ ద్వారా చుండ్రు సమస్య తగ్గడమే కాదు, దురద కూడా తగ్గిపోతుంది. నానబెట్టిన మెంతులు, వేపాకు, పెరుగు సమానంగా తీసుకుని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

వేపాకు, కొబ్బరినూనె: చుండ్రు నివారించడానికి వేప నూనె చక్కటి పరిష్కారం. కొబ్బరినూనె, వేప నూనెను సమాన భాగంలో తీసుకుని మిక్స్ చేయాలి. ఈ ఆయిల్ ని మాడుకు రాసుకోవాలి. తర్వాత 20 నిమిషాల పాటు మర్దనా చేయాలి. ఇలా చేస్తూ ఉంటే చుండ్రు తగ్గిపోతుంది.

oil

వేపనీళ్లు: నీళ్లను బాగా మరిగించి దానిలో 40 వేపాకులు కలపాలి. నీటిలో రాత్రంతా అలానే నాననివ్వాలి. ఈ వేప నీటితో ఉదయాన్నే తలను శుభ్రం చేసుకోవడం వల్ల తలలో చుండ్రు ద్వారా వచ్చిన దురద తగ్గిపోతుంది.

వేపాకు: చుండ్రు నివారించడానికి వేపాకు పేస్ట్ సరైన ఉపాయం. వేపాకులకు నీళ్లు, తేనె కలుపుతూ పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి కాసేపటి తర్వాత కడిగేసుకుంటే.. మంచి ఫలితాలనిస్తుంది.

English summary

How To Use Neem To Get Rid Of Dandruff in telugu

Dandruff is one of the most common problems faced by every third person these days. We try almost all possible ways to get rid of dandruff. Out of all the remedies, neem holds the first position in treating dandruff effectively.
Story first published:Tuesday, November 24, 2015, 17:14 [IST]
Desktop Bottom Promotion