For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెయిర్ డ్యామేజ్ ను అరికడుతుంది, హెయిర్ గ్రోత్ పెంచుతుంది

|

ఆలివ్ ఆయిల్- ఆలివ్ ఆయిల్ 'గాడ్ మదర్ ఆఫ్ హెయిర్' గా భావిస్తారు. అన్నిరకాల నూనెలలో కంటే మంచిది ఆలివ్ ఆయిల్. ఒకవిధమైన సీమచెట్టు, దాని యొక్క పండున్ను, దానివిత్తులలోనుంచి నూనె తీస్తారు. ఇతర నూనెలకన్నా ఖరీదు ఎక్కువే అయినా ఆలివ్ నూనెలో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి . దీనిలో మోనో అన్సాచ్యురేటెడ్ కొవ్వు ఆమ్లాలు అత్యధికము. అందుకే ఇది మనకు వివిధ రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఆరోగ్య పరంగానే కాదు సౌందర్య విషయంలో కూడా ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుంది.

మీ జుట్టును ఆరోగ్యంగా, మంచి షైరనింగ్ తో ఉండాలని మీరు కోరుకుంటే ఆలివ్ ఆయిల్ ఒక ఉత్తమమైన ఆయిల్. ఒక్క జుట్టుకు మాత్రమే కాదు స్కిన్ చర్మానికి కూడా చాలా మంచిది. ఆ కారణం చేతను ఆలివ్ ఆియల్ ను మనం ఉపయోగించే బ్యూటీ ప్రొడక్ట్స్ లో కొన్ని వందల సంవత్సరాల నుండి రొటీన్ గా వీటిని ఉపయోగిస్తున్నారు.

చాలా మంది జుట్టు పెరుగుదల కొరకు ఆలివ్ ఆయిల్ ను ఉపయోగిస్తుంటారు. ఆలివ్ ఆయిల్ తలలో సెన్సిటివ్ స్కిన్ మరియు కేశాల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మరియు ఇది జుట్టు రాలడం తగ్గిస్తుంది.

జన్యుసంబంధ కారణాలు, వాతారణంలో కాలుష్యం, హెయిర్ కలర్స్, పోషకాల లోపం లేదా మెడికేషన్ లాంటివి జుట్టు రాలడానికి ప్రధాణ కారణాలు. ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల అన్ని రకా జుట్టు సమస్యల నివారిస్తుంది.

ఒత్తైన మరియు మంచి షైనింగ్ తో ఉన్న జుట్టును పొందవచ్చు. ఆలివ్ ఆయిల్ ఒక కండీషనర్ గా పనిచేస్తుంది. ఆలివ్ ఆయిల్ కు కొద్దిగా ఆముదం మరియు బాదం ఆయిల్ మిక్స్ చేసి వేడి చేసి తలకు పట్టించాలి. జుట్టు పెరుగుదలకు ఆలివ్ ఆయిల్ వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం...

1. తలకు:

1. తలకు:

ఆలివ్ ఆయిల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి . ఇది తలకు చాలా మేలు చేస్తుంది . ఆలివ్ ఆయిల్ ను తలకు పట్టించడం వల్ల హెయిర్ డ్యామేజ్ ను నివారిస్తుంది.

2. జుట్టు రాలడం నివారిస్తుంది:

2. జుట్టు రాలడం నివారిస్తుంది:

హెల్త్ ఎక్స్ ఫర్ట్స్ అభిప్రాయం ప్రకారం కొన్ని హార్మోనుల ప్రభావం వల్ల జుట్టు రాలడం జుగుతుంది.కొన్ని స్ట్రెస్ హార్మోన్స్ హెయిర్ ఫోలిసెల్స్ ను బలహీనంగా మార్చుతుంది. ఆలివ్ ఆయిల్ ఈ సమస్యలను నివారించి జుట్టును స్ట్రాంగ్ గా మార్చుతుంది.

3. చుండ్రు:

3. చుండ్రు:

ఆలివ్ ఆయిల్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది తలలో చుండ్రు మరియు పేలను నివారిస్తుంది. ఆలివ్ ఆయిల్ తో హెల్తీ హెయిర్ ను పొందవచ్చు.

4. బ్లడ్ సర్కులేషన్:

4. బ్లడ్ సర్కులేషన్:

మీరు హెల్తీ అండ్ షైనీ హెయిర్ పొందాలంటే, ఆలివ్ ఆయిల్ ను గోరువెచ్చగా వేడి చేసి తలకు పట్టించి మసాజ్ చేయాలి. ఇది బ్లడ్ సర్కులేషన్ ను ప్రోత్సహిస్తుంది . మీ జుట్టు హెల్తీగా పెరుగుతుంది.

5. కండీషనర్:

5. కండీషనర్:

ఆలివ్ ఆయిల్ ఒక నేచురల్ కండీషనర్ గా పనిచేస్తుంది . మీరు సాఫ్ట్ అండ్ షైనీ హెయిర్ పొందాలనుకుంటే ఆలివ్ ఆయిల్ ను కండీషనర్ గా అప్లై చేయాలి.

English summary

Reasons To Use Olive Oil For Hair

Most of us know that olive oil is healthy in many ways. But using olive oil for hair is the best thing to do if you want to make your hair healthy and shiny.
Story first published: Friday, May 29, 2015, 12:31 [IST]
Desktop Bottom Promotion