For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్ళికి ముందు మీ కేశాల గురించి తీసుకోవాల్సిన చిన్న జాగ్రత్తలు !

By Super
|

మీ పెళ్లి గురించి ఉత్సుకతతో ఉన్నారా, మీ పెళ్లి రోజున మరింత అందంగా కనపడాలని అనుకుంటున్నారా? అయితే దాని కోసం ఎలా సిద్ధం ఆటున్నారు? దగ్గరలోని బ్యూటీ పార్లర్ కు వెళ్లి ఖరీదైన ఉత్పత్తులతో హెయిర్ స్టైలింగ్ చేయించుకుందాం అనుకుంటున్నారా? సరే, చేయండి, కానీ మీ కేశాలను ప్రమాదకరమైన రసాయనాలతో పాడు చేస్తున్నారన్నమాట!

READ MORE: వివాహానికి ముందు చేయవలసిన 15 క్రేజీ పనులు

మరయితే మీ పెళ్లి రోజున అందంగా కనపడేందుకు మరో ప్రత్యామ్నాయం ఏమీ లేదా? మీ పెళ్లి రోజున ‘రాక్ స్టార్’ గా కనపడేందుకు తేలికైన, ప్రభావవంతమైన దారి లేదా? ఒకటుంది – మీ కేశాలకు వంటింటి చిట్కాలు ఉపయోగించడం. మీకు ముఖ్యమైన రోజున మీ కేశాల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తాపీగా ఈ కింది చిట్కాలు చదవండి:

మానసిక సంసిద్ధత :

మానసిక సంసిద్ధత :

వంటింటి చిట్కాలతో మీ కేశ సంరక్షణ చేసుకోవడానికి మానసికంగా సంసిద్ధులు కండి. కనీసం ఆరు నెలల ముందు నుంచి మొదలు పెట్టండి. ఒక్కసారి మీ పెళ్లి ముహూర్తం ఖరారు అయితే ఇక సమయం వృధా చేయకండి. వంటింటి చిట్కాలు రాత్రికి రాత్రి ఫలితాలు ఇవ్వవని గుర్తుంచుకోండి. సహజమైన, వనమూలికలతో కూడిన వస్తువులతో మీ కేశాలను రసాయనాల ప్రమాదకర ఫలితాలనుంచి రక్షించుకోండి.

డీప్ కండిషనింగ్ :

డీప్ కండిషనింగ్ :

కేశాలను బాగా కండిషన్ చేయడానికి ఒక గుడ్డును మామూలు మీగడ తో కలపండి. ఆ మిశ్రమం మృదువుగా తయారు అయ్యేలా దాన్ని గిలకోట్టండి, ఇక తలకి పట్టించండి. ఇలా కనీసం రెండు వారాలకి ఒకసారి చేసి మీ కేశాలు ఆ ప్రోటీన్ కండిషనింగ్ ప్రభావాన్ని అందిపుచ్చుకునేలా చేయండి. వారానికి ఒకసారి మీ కేశాలకు, బాదం, కొబ్బరి నూనెలు, ఆలివ్ నూనె మిశ్రమం పట్టించండి. టర్బన్ థెరపీ తో మీ కేశాలను సహజంగా పునరుత్తేజం పొందేలా చేయండి.

కేశ సమస్యలను పరిష్కరించండి :

కేశ సమస్యలను పరిష్కరించండి :

మీరు బాగా ముందుగానే మొదలు పెడితే, మీ కేశాల సమస్యలను పరిష్కరించుకోవడం చాలా తేలికౌతుంది. ఉదాహరణకు, మీకు చుండ్రు సమస్య ఉందనుకోండి, కొబ్బరి నూనె, నిమ్మకాయ రసం మిశ్రమం నిత్యం వాడుతుంటే ఆ సమస్య తొలగిపోతుంది. మీ కేశాలు ఊడిపోతుంటే ఉల్లి రసం వాడి ఫలితం చూడండి. కానీ మీ సమస్య చక్కగా తొలగిపోవాలంటే వీటిని నిత్యం వాడుతూ ఉండాలి.

రసాయనాలకు దూరంగా వుండండి :

రసాయనాలకు దూరంగా వుండండి :

రసాయనాలతో తయారయ్యే కేశ సంరక్షణ ఉత్పత్తులకు దూరంగా ఉండండి. దాని బదులు ఇంట్లో తయారు చేసిన కుంకుడుకాయ లేదా సోప్ నట్ శామ్పూలను వాడండి. నో-పూ పధ్ధతి లో బేకింగ్ సోడా, నీరు కలిపి షాంపూ లాగా చేసి కూడా వాడుకోవచ్చు.

హెయిర్ కలర్స్ కు దూరం :

హెయిర్ కలర్స్ కు దూరం :

మీ జుత్తుకు రంగు వేయాలనుకోవద్దు. దాని బదులు గోరింటాకు వాడండి. సాధారణంగా కుంకుడుకాయ తో వారానికి మూడు సార్లు తలంటుకుని, మీకు జిడ్డు జుట్టు వుంటే ఆపిల్ సిడార్ - పొడి జుట్టు వుంటే తేనే తో కడగండి. తీ డికాషన్, కాఫీ పౌడర్ లలో నాన్చిన గోరింటాకు వాడండి. ఈ మిశ్రమం నిత్యం వాడుతుంటే మీ తెల్ల జుట్టు త్వరలోనే మాయం అవుతుంది. మీరు ముందే ప్రారంభిస్తే, మీ జుట్టుకు ఇంట్లో తయారుచేసిన చికిత్సలతో సంరక్షణ చేకూరుతుంది.


English summary

Simple Steps To Take Care Of Your Hair Before Marriage in Telugu

Simple Steps To Take Care Of Your Hair Before Marriage in Telugu.Are you excited about your marriage and are all set to look the best on your wedding day? Then how do you plan to go about it? Rush to the nearest beauty parlour and have your hair stylised with expensive products?
Desktop Bottom Promotion