For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళల్లో జుట్టు రాలడానికి గల 10 కారణాలు: నివారణ

By Super
|

మహిళల జీవిత కాలంలో వారి శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అలాంటి మార్పుల్లో వాస్తవికమైనది హెయిర్ లాస్ సమస్య. సహజంగా అందంలో జుట్టుకు కూడా ప్రధాన స్థానం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే.. అందమైన కేశ సంపద ఉంటే అది మీ కిరీటం వంటిదే. ప్రతి ఒక్కరిలో జుట్టు రాలిపోవడం అనేది సాధారణ సమస్యగా మారిపోయింది. అయితే అందుకు కారణాలు మాత్రం చాలానే ఉన్నాయి.

READ MORE: పురుషుల్లో జుట్టు రాలడం నివారించే 11 నేచురల్ మార్గాలు

ముఖ్యంగా జుట్టురాలడానికి హార్మోన్ ల అసమతుల్యత, రసాయనాలు కలిగిన షాంపూలు, ఆయిల్స్ ఉపయోగించడం వల్ల, ఈస్ట్, ఫంగల్ ఇన్ఫెక్షణ్, మరియు మందులు తరచూ ఉపయోగించడం, ఒత్తిడి, ఆహారంలో అసమతుల్యత ఇలా చాలా కారణాలే ఉంటాయి. వీటితో పాటు జుట్టు రాలడానికి మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది. అదే చుండ్రు. చుండ్రు వల్ల తలో దురద లేదా మంట వంటి కారణాల చేత కూడా జుట్టు అధికంగా రాలిపోయే అవకాశం ఉంది. కొంత మందిలో అప్పుడప్పుడు జుట్టు రాలిపోవడం జరిగితే, మరికొంత మంది తరచూ జుట్టు రాలే సమస్య వెంటాడుతూనే ఉంటుంది. దాంతో చాలా బాధపడుతుంటారు.

READ MORE: జుట్టు రాలే సమస్యలకు త్వరిత పరిష్కార మార్గం:ఎఫెక్టివ్ యోగాసనాలు

అయితే ఈ సమస్యను గుర్తించిన వెంటనే అప్పటికప్పుడు ట్రీట్మెంట్ తీసుకొన్నట్లైతే మంచి ఫలితం ఉంటుంది. మొదట జుట్టు రాలే సమస్యకు గల కారణాలను తెలుసుకొన్నట్లైతే సమస్యను నివారించడం సులభం అవుతుంది. ముఖ్యంగా మహిళల్లో జుట్టు రాలడానికి గల కారణాలను కొన్నింటి గుర్తించాము . ఇవి లక్షణాలు మీలో కూడా కనిపించినట్లైతే వెంటే కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ను ఉపయోగించడం ప్రారంభించండి...

జుట్టు సంరక్షణకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం :

జుట్టు సంరక్షణకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం :

జుట్టు అందంగా కనబడాలనే తాపత్రయంతో ఎక్కువ హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను ఉపయోగించడం, స్ట్రెటనింగ్ మరియు కర్లింగ్ చేయించుకోవడం. అలాగే జుట్టుకు జెల్స్, స్ప్రేలు, మౌజీ, మరియు కలర్స్ ను అప్లై చేయడం వల్ల జుట్టు యొక్క సాప్ట్ నెస్ పోతుంది. ఇలా దీర్ఘకాలం చేయడం వల్ల జుట్టు పెరుగుదల మీద ప్రభావం చూపుతుంది . అలాగే పోనీటైల్, సరిగా తలదువ్వకపోవడం, సరైన కండీషన్స్ ను అప్లై చేయకపోవడం వల్ల జుట్టు రాలడానికి ప్రధాణ కారణం అవుతుంది.

 పిసిఓఎస్

పిసిఓఎస్

ఈ పరిస్థితిలో, మేల్ హార్మోన్స్ లేదా ఆండ్రోజెన్స్ ఎక్కువగా ఉత్పత్తి కావడం, లేదా అండాశయంలో నీటితిత్తుల వంటివి ఏర్పడటం వల్ల జుట్టు రాలడానికి కారణం అవుతుంది . అలాగే హార్మోనుల అసమతుల్యత వల్ల మీ శరీరం జుట్టు పెరుగుదలకు వ్యక్తిరేకంగా పనిచేస్తుంది. జుట్టు పెరుగుదలను ఆపుతుంది.

 అనీమియా:

అనీమియా:

అనీమియా ముఖ్యంగా రక్తహీనతను తెలియజేస్తుంది. అందుకు ప్రధాణ కారణం డైట్ లో సరైన పాళ్ళు ఐరన్ అందకపోవడం వల్ల. చాలా మంది మహిళలు ఎక్కువ సార్లు రుతుస్రావం అవ్వడం లేదా ఎక్కువగా ఫోలిక్ యాసిడ్లు సరిపడా శరీరంలో లేకపోవడం వల్ల శరీరంలో హీమోగ్లోబిన్ ఉత్పత్తి తక్కువగా ఉండి శరీరంలో అవయవాలకు తక్కువ ఆక్సిజన్ ప్రసరిస్తుంది . ఎప్పుడైతే హెయిర్ ఫోలిసెల్స్ కు ఆక్సిజన్ అందదో, అప్పుడు కేశాలు బలహీనంగా మారుతాయి మరియు జుట్టు డ్యామేజ్ అవ్వడానికి, మరియు జుట్టు రాలడానికి కారణం అవుతుంది.

మోనోపాజ్

మోనోపాజ్

మహిళలు మోనోపాజ్ దశకు చేరుకోగానే రీంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఇది హెయిర్ ఫాల్ కు దారి తీస్తుంది . ఇది శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ లెవల్స్ తక్కువగా ఉండటం వల్ల జరగవచ్చు. ఇవి హెయిర్ డ్రైగా మార్చుతుంది మరియు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల జుట్టు రాలడానికి కారణం అవుతుంది. అందుకు మంచి మన్నికైన షాంపుల మరియు కండీషనర్స్ ఉపయోగించాలి. మరియు మంచి పౌష్టికాహారంను తీసుకోవాలి.

 ప్రసవం

ప్రసవం

చాలా మంది మహిళల్లో ప్రసవం తర్వాత ఎక్కువగా జుట్టు రాలడానికి కారణం అవుతుంది. అందుకు ప్రధాణ కారణం గర్భధారణలో ఈస్ట్రోజెన్ హార్మోన్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి ఆసమయంలో ఎక్కువ హెయిర్ గ్రోత్ ఉంటుంది. అయితే, ప్రసవం తర్వాత హార్మోన్లు నార్మల్ గా స్థితి రావడం వల్ల జుట్టు రాలడం ప్రారంభం అవుతుంది. అయితే ఇది తాత్కాలికమే అయినా, కొన్ని వారాల తర్వాత తిరిగి జుట్టు పెరుగుదల ప్రారంభం అవుతుంది.

 ప్రోటీన్ల లోపం:

ప్రోటీన్ల లోపం:

మన జుట్టు కెరోటిన్ అనే ప్రోటీన్స్ వల్ల పెరుగుతాయి . ఎప్పుడైతే మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ను మనం తీసుకోమో, అప్పడు మన శరీరంలో జుట్టు రాలడానికి కారణం అయ్యే విటమిన్స్, ప్రోటీన్ల లోపం వల్ల జుట్టు రాలడం శాస్వతం అవుతుంది.

మెడికేషన్స్ :

మెడికేషన్స్ :

మహిళలు ఎవరైతే బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకుంటుంటారో అలాంటి వారిలో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండి హెయిర్ ఫాల్ కు దారితీస్తుంది . కాబట్టి వెంటనే వాటికి ఫుల్ స్టాప్ పెట్టండి . మరో హార్మోనల్ పిల్స్ మిరయు థెరపీలు అదే విధమైన ప్రభావం కలిగి ఉంటుంది. కీమో థెరమపీ సెషన్ వల్ల కూడా జుట్టు రాలడం జరుగుతుంది.

 వేగంగా బరువు తగ్గడం:

వేగంగా బరువు తగ్గడం:

క్రాష్ డైటింగ్ మరియు వేగంగా బరువు తగ్గడం లేదా వేగంగా బరువు పెరగడం జుట్టు పెరుగుదల మీద ప్రభావం చూపుతుంది. అందువల్ల, సాధారణంగా శరీరంకు అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ సరైన సమయంలో అందక జుట్టు రాలడానికి కారణం అవుతుంది . కాబట్టి మంచి పౌష్టికాహారంను తీసుకోవాలి.

థైరాయిడ్ , ఆటోఇమ్యూన్ వ్యాధులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల కోసం ఉపయోగించే మందుల వల్ల

థైరాయిడ్ , ఆటోఇమ్యూన్ వ్యాధులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల కోసం ఉపయోగించే మందుల వల్ల

థైరాయిడ్ ట్రైయోడోథైరోనిన్ మిరయు థైరాక్సిన్ వంటి హార్మోన్స్ వల్ల థైరాయిడ్ గ్రంథుల యొక్క ముఖ్యమైన హార్మోనులు ఇవి శరీరం సక్రమంగా అభివ్రుద్ది చెందడానికి పెరుగుదలకు సహాయపడుతుంది. అయితే ఎప్పుడైతే ఈ హ్మార్లలోపంతో వ్యక్తి బాధపడుతారో వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే జుట్టు రాలడం సమస్యగా మారుతుంది.

దీర్ఘకాలిక వైద్యం

దీర్ఘకాలిక వైద్యం

దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటిస్, సోరియోసిస్ వంటివి కూడా జుట్టు రాలడానికి ప్రధాణ కారణం అవుతుంది. డయాబెటిస్ వల్ల తలకు చాలా తక్కవు రక్తప్రసరణ ఉండటం వల్ల హెయిర్ ఫోలీసెల్స్ డెడ్ అయ్యి, జుట్టు రాలడానికి కారణం అవుతుంది

English summary

Top 10 reasons for hair loss in women: Beauty Tips in Telugu

Top 10 reasons for hair loss in women. A woman’s body goes through a lot of changes through her entire course of life. These changes can at times be a contributing factor in hair loss.
Desktop Bottom Promotion