For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాలు జడలతో హొయలుపోతున్న వయ్యారి భామలు

|

వాలు జడను ఇష్టపడని వాళ్లుండరంటే అతిశయోక్తి కాదు. భారతీయ సంప్రదాయం ప్రకారం పొడగైన కురులు స్త్రీ అందాన్ని మరింత ద్విగుణీకృతం చేస్తాయి. అందుకే పెళ్లిళ్లు, ఫంక్షన్స్ లో పొడవాటి పూల జడతో.. అమ్మాయిలు హొయలు పోతుంటారు. చీర, లెహంగా వంటి ట్రెడిషనల్ దుస్తులకు పొడవైన జుట్టే అందం, ఆకర్షణ.

READ MORE: జుట్టురాలడం తగ్గించి, వేగంగా జుట్టు పెంచు ఉత్తమ హోం రెమెడీలు

పొడవాటి జుట్టు ఇండియన్ బ్యూటీనెస్ కి చాలా ఇంపార్టెంట్. అయితే పొడవైన జుట్టుని జడలా అల్లుకుంటేనే అందం అనుకుంటే పొరపాటి. పొడవాటి జుట్టుతో ఉండే ఉపయోగాలే అవి. ఎందుకంటే షార్ట్ జుట్టుని కేవలం వదిలేయడానికే వీలవుతుంది. అదే పొడవైన జుట్టు అయితే.. చక్కగా అల్లుకుని జడ వేసుకోవచ్చు, లేదంటే సింపుల్ గా లూజ్ గా వదిలేసినా.. అందంగా కనిపిస్తాయి. అలాంటి లాంగ్ హెయిర్ మనకే కాదు.. మనల్ని నటనతో మైమరిపిస్తున్న హీరోయిన్లకూ ఇష్టమే.

READ MORE: భారతీయ మహిళలకు 6 ఉత్తమ కేశాలంకరణ రీతులు

నల్లగా, ఒత్తుగా, అందంగా కనిపించే జుట్టుకి ఉన్న క్రేజే వేరు. ఇప్పుడు ట్రెండ్ మారి చాలా మంది జుట్టుకి కొత్త హంగులు తీసుకొస్తున్నారు. కానీ.. వాలు జడకు ఉన్న క్రేజ్ మాత్రం ఎవర్ గ్రీన్. షార్ట్ జుట్టుతో స్టైల్ గా కనిపించినా.. లాంగ్ హెయిర్ తో చాలా ట్రెడిషనల్ గా, అందంగా కనిపించవచ్చు. అందుకే సిల్కీ, షైనీ జుట్టుతో మెరిసిపోతున్న బాలీవుడ్ బ్యూటీస్ ఎవరో ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాం. పొడవాటి కురుల సోయగం కలిగిన టాప్ హీరోయిన్స్ ఎవరో చూద్దాం..

పరిణీతి చోప్రా

పరిణీతి చోప్రా

ప్రతి ఒకట్టిని ఆకట్టుకునే సౌందర్యం పరిణీతి చోప్రా సొంతం. సొగసైన కురులతో స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపిస్తుంది పరిణీతి చోప్రా.

రేఖ

రేఖ

కొన్ని ఏళ్లుగా బాలీవుడ్ ని ఏలి.. తన సత్తా చాటుకుంది మోస్ట్ బ్యూటిఫుల్ యాక్టర్ రేఖ. లాంగ్ అండ్ సిల్కీ హెయిర్ తో ఎక్కడైనా స్పెసల్ ఎట్రాక్షన్ కనిపిస్తుంది ఈ ఎవర్ గ్రీన్ బ్యూటీ. ఎప్పుడు పొడవాటి జుట్టుని అలా వదిలేసి.. అందంగా మెరిసిపోతూ ఉంటుంది.

హేమ మాలిని

హేమ మాలిని

బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ గా ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న బ్యూటీ క్వీన్ హేమ మాలిన. ఈ అందాల తార సౌందర్యంలో పొడవైన జుట్టుదే స్పెషల్ రోలేనండోయ్.

శ్రీదేవి

శ్రీదేవి

ఒకప్పుడు కుర్రకారు మనసు గెలుచుకున్న అందాల తార శ్రీదేవి. 15 ఏళ్ల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ 2012లో స్టార్ట్ చేసింది. 80లలో నల్లగా, నిగనిగలాడే జుట్టుతో.. ఇండియన్ సినీ ప్రపంచంలో మెరిసిపోయింది.

జూహీ చావ్లా

జూహీ చావ్లా

1984లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న జుహీ చావ్లా అందం చాలా విభిన్నం. బ్యూటిఫుల్ స్మైల్ తో అందరినీ ఎట్రాక్ట్ చేసే ఈ తారకు ఒత్తైన నల్లటి జుట్టు మరింత అందాన్ని తెచ్చిపెట్టింది.

మాధురీ దీక్షిత్

మాధురీ దీక్షిత్

ధక్ ధక్ గర్ల్ అంటే అందరికీ గుర్తొచ్చేది మాధురీ దీక్సిత్. పద్మశ్రీ అవార్డు కూడా పొందింది ఈ బ్యూటీ. మాధురీ దీక్షిత్ బ్యూటిఫుల్ హెయిర్ నేటి తరం అమ్మాయిల మనసు దోచుకుంటోంది.

కరిష్మా కపూర్

కరిష్మా కపూర్

ఆమె అందమైన పొడవాటి జుట్టు కరిష్మా కపూర్ అందానికి ప్రతీక. అందమైన హావభావాలతో పాటు కురుల సోయగం అమ్మడి అందాన్ని రెట్టింపుచేశాయి.

రవీనా టాండన్

రవీనా టాండన్

90లలో మాంచి క్రేజ్ సంపాదించుకున్న తారల్లో రవీనా ఠాండన్ ఒకరు. ఎప్పుడు లాంగ్ హెయిర్ తో కనిపించడం రవీనా స్పెషాలిటీ.

శిల్పాశెట్టి

శిల్పాశెట్టి

సినిమాల్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి పొడవాటి కురులతో అందంగా మురిపిస్తూ వచ్చింది పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి. లాంగ్ హెయిర్ శిల్పాశెట్టికి అమేజింగ్ లుక్ తీసుకొస్తుంది.

కాజోల్

కాజోల్

బ్రిలియంట్ యాక్టర్ గా రికార్డ్ క్రియేట్ చేసుకున్న కాజోల్ మోస్ట్ బ్యూటిఫుల్ బ్యూటీ. గార్జియస్ హెయిర్ ఈ అమ్మడి అందానికి స్పెషల్ ఎట్రాక్షన్.

ప్రతీజింటా

ప్రతీజింటా

రింగు రింగుల జుట్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రీతి జింటా.. ఇటీవల స్ర్టెయిట్ గా..చేయించుకుంది.

సుస్మితా సేన్

సుస్మితా సేన్

మాజీ విశ్వసుందరి సుష్.. ఇండియన్ సినీ ఇండస్ర్టీలో మోస్ట్ ఫ్యాషనబుల్ ఐకాన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె జుట్టు అందానికి ఎవరైనా ముగ్ధులు కావాల్సిందే.

రాణీ ముఖర్జీ

రాణీ ముఖర్జీ

నటనతో తానేంటో నిరూపించుకుంది అందాల తార రాణీ ముఖర్జీ. ఈ ముద్దుగుమ్మ పర్సనాలిటీకి తగ్గట్టే పొడవాటి జుట్టు ప్రత్యేక ఆకర్షణ.

దియా మీర్జా

దియా మీర్జా

షైనీ బ్లాక్ హెయిర్ తోనే అందరి మనసు గెలుచుకుంది దియా మీర్చా. పొడవుగా.. ఆకర్షణీయంగా ఉండే ఆమె కురులు ఇష్టపడని వారుండరు.

కరీనా కపూర్

కరీనా కపూర్

గార్జియస్ లాంగ్ హెయిర్ కరీనా కపూర్ సొంతం. బాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ ముద్దుగుమ్మకు కళ్లు, జుట్టే ప్రత్యేక ఆకర్షణ.

ఐశ్వర్యారాయ్

ఐశ్వర్యారాయ్

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా అందమైన జుట్టు, ఆకట్టుకునే సౌందర్యం ప్లస్ పాయింట్స్.

విద్యా బాలన్

విద్యా బాలన్

డర్టీ పిక్చర్ సినిమాతో.. నటనలో తనకు సాటిలేరని నిరూపించింది విద్యాబాలన్. లాంగ్ హెయిర్ ఈ ముద్దుగుమ్మకు చాలా ట్రెడిషనల్ లుక్ తీసుకొస్తుంది.

మల్లికా షెరావత్

మల్లికా షెరావత్

ప్రతి ఒక్క అమ్మాయికి అసూయ పుట్టేలా ఉంటుంది మల్లికా షెరావత్ జుట్టు. సెక్స్ సింబల్ గా క్రేజ్ సంపాదించిన ఈ బ్యూటీకి జుట్టు కూడా అందంగా ఉంటుంది.

లారా దత్త

లారా దత్త

ఇండియన్ సూపర్ మోడల్, హీరోయిన్ లారా దత్త. ఈమె మాజీ విశ్వసుందరి. అద్భుతమైన స్కిన్ టోన్, అందమైన కళ్లు, మైమరిపించే నల్లటి జుట్టు ఆమె సొంతం.

అమ్రితా రావ్

అమ్రితా రావ్

అందమైన పొడవాటి జుట్టు అమ్రితా రాయ్ ప్రత్యేకత.

ఇలియానా

ఇలియానా

స్లిమ్ బ్యూటీ ఇలియానాకి స్పెషల్ ఎట్రాక్షన్ పొడవాటి జుట్టు. ఫ్రెష్ ఫేస్ ఉమెన్ గా నిరూపించుకున్న ఈ బ్యూటీకి అందమైన కురులు అందరికీ ఆకర్షణీయమే.

ప్రియాంకా చోప్రా

ప్రియాంకా చోప్రా

పిగ్గీ చాప్స్ కూడా బాలీవుడ్ ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటున్న తారే. అందమైన పొడవాటి జుట్టు ప్రియాంకాకు ప్రత్యేక ఆకర్షణ.

నర్గీస్ ఫక్రీ

నర్గీస్ ఫక్రీ

అమెరికా నుంచి వచ్చి బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది నర్గీస్. తన జుట్టుతో మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది నర్గీస్.

అశిన్

అశిన్

గజిని సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అశిన్ కురులు చాలా సహజ అందంతో మురిపిస్తాయి. అందమైన జుట్టు అశిన్ కు చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు.

అనుష్క శర్మ

అనుష్క శర్మ

విభిన్నమైన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకున్న అనుష్క శర్మ కూడా చాలా పొడవైన జుట్టుతో అందరి మనసు దోచుకుంటుంది.

సోనమ్ కపూర్

సోనమ్ కపూర్

టాలెంటెడ్ పర్ఫామెన్స్ తో బాలీవుడ్ ప్రేక్షకుల మనసు గెలుచుకున్న తార సోనమ్ కపూర్. అందమైన కళ్లు, జుట్టు ఆమె సోయగాన్ని రెట్టింపు చేశాయి.

కంగనా రనౌత్

కంగనా రనౌత్

జుట్టుతోనే బాలీవుడ్ లో ఫేమస్ అయింది కంగనా రనౌత్. చాలా ఒత్తుగా, అందంగా, పొడవుగా కనిపించే ఆమె జుట్టుని అందరూ ఇష్టపడతారు.

జెనీలియా

జెనీలియా

ప్రిటీ బ్యూటీ జెనీలియా సహజ నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇన్నోసెంట్ బ్యూటీగా మనసు గెలుచుకుంది. నల్లగా పొడుగ్గా ఉండే జుట్టు ఇలియానా గ్లామర్ ని మరింత పెంచేశాయి.

అలియా భట్

అలియా భట్

బాలీవుడ్ లో యంగ్ బ్యూటీ అలియా భట్. ఇప్పుడిప్పుడే బీటౌన్ లో టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్న అలియా భట్ జుట్టు అమ్మాయిల మనసు దోచుకుంటుంది.

కత్రినా కైఫ్

కత్రినా కైఫ్

ఫెంటాస్టిక్ హెయిర్ కత్రినా కైఫ్ సొంతం. ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ గా క్రేజ్ సంపాదించింది కేట్.

బిపాసా బసు

బిపాసా బసు

మోస్ట్ టాలెంటెడ్ యాక్టరస్ గా బాలీవుడ్ లో స్థానాన్ని సంపాదించింది బిప్స్. అందమైన శరీరాకృతి, నల్లటి కురులు బిపాసా సొంతం.

దీపికా పదుకొనె

దీపికా పదుకొనె

అందమైన బ్రౌన్ కళ్లు, అద్భుతమైన నటన, ఆకట్టుకునే నల్లటి కురులు దీపికా గ్లామరస్ గా క్రియేట్ చేసినవి.

సోనాక్షి సిన్హా

సోనాక్షి సిన్హా

బ్యూటిఫుల్ హెయిర్ తో ఆకట్టుకుంటున్న అందగత్తెల్లో ప్రస్తుతం సోనాక్షి సిన్హా ఫస్ట్ ప్లేస్ లో ఉంది.

English summary

Top 33 Indian Actresses With Stunning Long Hair: Heroines Who Have Long Hair

Long hair is synonymous with beauty in India. Over the years our leading ladies from Bollywood have sported lustrous hair. Many actresses have been known to flaunt long, dark and beautiful locks.
Desktop Bottom Promotion