For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ఎలాంటి దువ్వెన వాడుతున్నారు ?

By Nutheti
|

మీ జుట్టుకి ఎలాంటి దువ్వెన వాడుతున్నారు ? ఒక్కసారి చెక్ చేసుకోండి. కనీసం మూడు రకాల దువ్వెనలు మీ డ్రెస్సింగ్ టేబుల్ లో ఉండాల్సిందే. మీ జుట్టు పల్చగా ఉన్నా.. మందంగా ఉన్నా ప్రతి ఒక్కరికి మూడు దువ్వెనలు ఉండాల్సిందే అంటున్నారు నిపుణులు. స్టీల్, మెటల్ దువ్వెనలను తడి జుట్టుకి వాడటం మంచిదని సూచిస్తున్నారు.

అందమైన జుట్టు ఉందిలే అని సంబరిపడిపోతే సరిపోదు.. దాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. సున్నితంగా చిక్కు తీసుకోవాలి. బాగా దువ్వడం వల్ల జుట్టు పెరగడమే కాదు.. రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. అలాగని ఏ దువ్వెన పడితే దాన్ని వాడితే.. జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. కాబట్టి మీ కురుల తత్వాన్ని బట్టి దువ్వెనను ఎంపిక చేసుకోవాలి.

ఉడెన్ కూంబ్

ఉడెన్ కూంబ్

చెక్క దువ్వెన జుట్టును సంరక్షిస్తుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది. చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. అయితే ఈ చెక్క దువ్వెనలను క్లీన్ చేయడానికి ఆయిల్ మాత్రమే వాడాలి.

హార్న్ కూంబ్

హార్న్ కూంబ్

ఇవి కూడా ఉడెన్ కూంబ్ ల మాదిరిగానే ఉంటాయి కానీ.. వీటి ఖరీదు ఎక్కువ. జుట్టు రాలే సమస్య ఉన్న వాళ్లు వీటిని ఎంపిక చేసుకోవడం మంచిది.

మెటల్ కూంబ్

మెటల్ కూంబ్

మెటల్ కూంబ్ లు అల్యూమినియంతో తయారు చేస్తారు. వీటిని తడిగా ఉన్న జుట్టు దువ్వుకోవడానికి ఉపయోగించాలి.

ప్లాస్టిక్ కూంబ్

ప్లాస్టిక్ కూంబ్

సాధారణంగా ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కూంబ్ లనే ఉపయోగిస్తుంటారు. అయితే వీటితో తడి జుట్టు దువ్వకూడదు. తడిగా ఉన్న జుట్టుని ప్లాస్టిక్ కూంబ్ తో దువ్వడం వల్ల.. జుట్టు చిట్లడం, రాలిపోవడం వంటి సమస్యలు మొదలవుతాయి. అయితే ప్లాస్టిక్ దువ్వెనలు వాడితే.. చుండ్రు సమస్య తగ్గుతుంది.

టెయిల్ కూంబ్

టెయిల్ కూంబ్

పొట్టి జుట్టు ఉన్నవాళ్లకు.. ఈ టెయిల్ కూంబ్ సరిపోతుంది. జుట్టుని స్టైల్ చేయడానికి ఈ దువ్వెన అనువుగా ఉంటుంది.

పిక్ కూంబ్

పిక్ కూంబ్

జుట్టు ఒత్తుగా కనిపించాలని కోరుకునే వాళ్లకు ఈ పిక్ కూంబ్ ఫర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.

బ్రష్

బ్రష్

బ్రష్ తో జుట్టు దువ్వడం వల్ల కుదుళ్లకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీనివల్ల జుట్టు ఒత్తుగా.. ఆరోగ్యంగానే పెరుగుతాయి. కానీ.. జిడ్డుగా శిరోజాలకు బ్రష్ ఉపయోగించరాదు.

English summary

What Kind Of Comb Should You Use?: beauty tips in telugu

Which comb do you use to pamper your hair with. It is said that one should own at least three different types of comb, no matter how thick or thin your hair is. Experts state that using a brush to comb your hair is good as it helps to increase hair growth and promote blood circulation in the scalp.
Story first published: Thursday, October 8, 2015, 15:34 [IST]
Desktop Bottom Promotion