For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెయిర్ ఫాల్ తగ్గించే ఆర్గానిక్ ట్రీట్మెంట్..

|

అందమైన జుట్టు కలిగి ఉండటం ఒక వరమే. అయితే కొంత మందిలో వరం కాదు, కలవరం. ఎందుకంటే జుట్టు పల్చబడి, జుట్టు రాలిపోతుంటే, వారి బాధ వర్ణనాతీతం. నిర్జీవమైన జుట్టు, డల్ హెయిర్ ఉంటే, జుట్టు రాలిపోతుంటే కలవరపెడుతుంది. చాలా మంది మహిళలు ఉన్న జుట్టును అందంగా చూపించుకోవడానికి కొన్ని స్టైలింగ్ ప్రొడక్ట్స్ మరియు హీటింగ్ ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తుంటారు. ఇవి తాత్కాలికంగా మార్పును చూపించినా...దీర్ఘకాలంలో జుట్టుకు ఎక్కువ డ్యామేజ్ కలిగిస్తుంది. కాబట్టి జుట్టు అందంగా చూపించుకోవడానికి కెమికల్ ప్రొడక్ట్స్ మరియు హీటింగ్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం సరికాదు, వీటికి బదులుగా కొన్ని నేచురల్ ట్రీట్మెంట్ ను ఇంట్లోనే సౌకర్యవంతంగా తయారుచేసుకోవచ్చు.

ఈ నేచురల్ ట్రీట్మెంట్ వల్ల జుట్టు ఎలాంటి దుష్ప్రభావం ఉండదు. జుట్టును అందంగా మార్చుకోవడానికి, జుట్టును పెంచుకోవడానికి కొన్ని హెర్బ్స్, పువ్వుల నుండి తయారుచేసిన ఎసెన్సియల్ ఆయిల్స్ ఉపయోగపడుతాయి. వీటి వల్ల జుట్టుకు ఎలాంటి డ్యామేజ్ ఉండదు. ఈ ఆర్గానిక్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వల్ల డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేస్తుంది, తలలో దురదను తగ్గిస్తుంది. జుట్టుకు మంచి షైనీంగ్, గ్లాసి స్ట్రక్చర్ ను తీసుకొస్తుంది.

మీ జుట్టు సమస్యలను నివారించుకోవడానికి బెస్ట్ ఆర్గానిక్ హెయిర్ ట్రీట్మెంట్ కోసం చూస్తుంటే..ఇక్కడ కొన్ని హెల్తీ అండ్ బ్యూటిఫుల్ ఆర్గానిక్ ట్రీట్మెంట్స్ అందివ్వడం జరిగింది.

1. బనానా:

1. బనానా:

అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉంది. ఇది జుట్టును ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది, హెయిర్ ఎలాసిటిని నేచురల్ గా పెంచుతుంది. బాగా పండిన అరటిపండును మెత్గగా చేసి తలకు అప్లై చేసి 15నిముషాల తర్వాత మంచి షాంపుతో హెయిర్ వాష్ చేసుకోవాలి. డ్యామేజ్ అయిన హెయిర్ ను రిపేర్ చేయడంలో ఇది ఎఫెక్టివ్ ఆర్గానిక్ హెయిర్ ట్రీట్మెంట్ .

2. గుడ్డుపచ్చసొన:

2. గుడ్డుపచ్చసొన:

డ్రైహెయిర్ ఉన్నవారు గుడ్డు పచ్చసొనను మాయిశ్చరైజర్ గా ఉపయోగించుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్ కోసం 3 గుడ్డులోని పచ్చసొన కప్పులోకి తీసుకొని , దీనికి ఆలివ్ ఆయిల్ మరియు మూడు చుక్కల విటమిన్ ఇ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి 10నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి . ఈ ట్రీట్మెంట్ ను వారంలో 1సారి చేస్తుంటే మంచి ఫలితం ుంటుంది.

3. బీర్:

3. బీర్:

జుట్టుకు నేచురల్ షైనింగ్ ను అంధివ్వడానికి ఒక ఉత్తమ మార్గం బీర్! జుట్టుకు షాంపుతో తలస్నానం చేసిన తర్వాత తలను టవల్ తో పూర్తిగా తడి ఆర్పుకొన్న తర్వాత జుట్టుకు బీర్ ను స్ప్రే చేయాలి.

4. మెయోనైజ్ కండీషన్:

4. మెయోనైజ్ కండీషన్:

హెయిర్ ను స్మూత్ గా మరియు సాఫ్ట్ గా మార్చుకోవాలనుకుంటే మయోనైజ్ ను జుట్టుకు కండీషనర్ గా అప్లై చేసుకోవాలి. తడి జుట్టుకు మయోనైజ్ అప్లై చేసి, 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. జుట్టుకు మెయోనైజ్ ఎంత సేపు పెడితే అంత మంచి ఫలితం ఉంటుంది.

5. బేకింగ్ సోడ:

5. బేకింగ్ సోడ:

మూడు చెంచాలా బేకింగ్ సోడాకు వాటర్ మిక్స్ చేసి తలకు పట్టించి, 5నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఇది జుట్టుకు నేచురల్ లుక్ ను అందిస్తుంది.

6. ఆలివ్ ఆయిల్:

6. ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్ ను తలకు మరియు జుట్టుకు బాగా అప్లై చేయాలి. అరగంట తర్వాత నార్మల్ షాంపుతో తలస్నానం చేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ ను రాత్రుల్లో తలకు పట్టించి ఉదయం తలస్నానం చేయడం వల్ల జుట్టుకు అదనంగా కండీషనర్ గా పనిచేస్తుంది. హెయిర్ బ్రేక్ కాకుండా నివారిస్తుంది.

7. ఆమ్లా పౌడర్ మరియు నిమ్మరసం:

7. ఆమ్లా పౌడర్ మరియు నిమ్మరసం:

ఒక చెంచా ఆమ్లా పౌడర్ లో నిమ్మరసం మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు డల్ నెస్ తగ్గుతుంది. జుట్టును బలోపేతం చేస్తుంది. 10 నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవచ్చు

8. మెంతులు:

8. మెంతులు:

చుండ్రును నివారించడంలో మెంతులు గ్రేట్ గా సహాయపడుతాయి. మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం వీటిని మెత్తగా పేస్ట్ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి.

9. ఆపిల్ సైడర్ వెనిగర్:

9. ఆపిల్ సైడర్ వెనిగర్:

ఒత్తైన జుట్టును పొందడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ను వేడి నీటిలో వేసి 5నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

10. బాటిల్ గార్డ్:

10. బాటిల్ గార్డ్:

సొరకాయను మెత్తగా పేస్ట్ చేసి ,రసం తీసి, జుట్టుకు అప్లై చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.

English summary

10 Effective Organic Hair Treatments To Get Amazing Hair Locks

These natural treatments are not only paraben free, but also contain ingredients, such as plant matter, essential oils from flowers and others, which can heal damaged hair naturally. These organic hair care recipes can help in repairing hair damage, retain gloss and treat itchy scalp. If you are looking for the best organic hair treatments to get your hair that shine with health, we have just the thing for you! Here are given some of the best organic treatments for healthy and beautiful hair.
Desktop Bottom Promotion