జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే, వింటర్లో ఖచ్చితంగా చేయకూడని 10 పనులు

వింటర్లో జుట్టు సంరక్షణకోసం కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తించుకోవాలి. వింటర్లో తప్పనిసరిగా జుట్టుకు చేయకూడని 10 ముఖ్యమైన విషయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. వీటిని కనుక నివారించస్తే జుట్టు డ్యామేజ్ అవ్వ

Posted By:
Subscribe to Boldsky

సాధారణంగా సీజన్ మారితే శరీరంలో కూడా మార్పులు జరగడం సహజం. వింటర్ సీజన్ తెల్లని మల్లెపువ్వుల లాంటిమంచుతో, గిలిగింతలు పెట్టే చలితో వింటర్ స్ట్రార్ట్ అవుతుంది. కాస్త చలి ఎక్కువైతే చాలు సెలవు పెట్టేసి ఎంచెక్కా రెస్ట్ తీసుకోవాలనుకునేవారెందరో. చలికాలంలో మంచి విషయాలే కాదు, చెడు విషయాలు కూడా ఉన్నాయి. చలికాలంలో స్కిన్, హెయిర్ త్వరగా డ్యామేజ్ అవుతుంది. వింటర్లో హెయిర్ డ్యామేజ్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

వింటర్ సీజన్లో వాతావరణంలో చల్లని గాలులు, హుముడిటి కారణంగా జుట్టు డ్రైగా మారడం, చిట్లడం, బ్రేకేజ్ అవ్వడం జరగుతుంది.

జుట్టు నార్మల్ గా, షైనీగా మరియు బౌన్సీగా ఉన్నా, వింటర్ సీజన్ లో డ్రైగా మారుతుంది. వింటర్లో జుట్టుకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, మరింత డ్యామేజ్ అవుతుంది.

కాబట్టి, వింటర్లో జుట్టు సంరక్షణకోసం కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తించుకోవాలి. వింటర్లో తప్పనిసరిగా జుట్టుకు చేయకూడని 10 ముఖ్యమైన విషయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. వీటిని కనుక నివారించస్తే జుట్టు డ్యామేజ్ అవ్వకుండా, డ్రైగా మారకుండా నివారించుకోవచ్చు.

కాటన్ లేదా ఉలెన్ హ్యాట్స్ ను డైరెక్ట్ గా వేసుకోకూడదు:

కాటన్, అక్రిలిక్, ఉలెన్ ఇతర ఫ్యాబ్రిక్ టైపస్ తో తయారుచేసిన కాటన్ లేదా ఉలెన్ హ్యాట్స్ ను పెట్టుకోకూడదు. ఇవి వంటర్లో జుట్టును మరింత ఎక్కువ బ్రేక్ అవ్వడానికి సహాయపడుతుంది. సిల్క్ స్ర్కాఫ్ కట్టుకోవడం ఉత్తమం

తడిజుట్టును దువ్వకూడదు:

చలికాలంలో తలస్నానం చేస్తే జుట్టు తడి ఆర్చుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి, పూర్తిగా డ్రై అయిన తర్వాత చిక్కు వదిలించుకోవాలి. తడి జుట్టు దువ్వడం వల్ల జుట్టు బ్రేక్ అవుతుంది. లేదా డ్యామేజ్ అవుతుంది. తడిజుట్టును ఆత్రంగా దువ్వితే జుట్టు ఎక్కువగా రాలే అవకాశం ఉంది.

తడిజుట్టుతో బయటకు వెళ్లకూడదు:

వింటర్ సీజన్ లో హెయిర్ క్యూటికల్స్ ఫ్రీజ్ అవుతాయి. దాంతో జుట్టు సరిగా డ్రై అవ్వకుండా ఉంటుంది. దాంతో జుట్టుకు డ్యామేజ్ అవుతుంది.

జుట్టు విరబోసుకుని వెళ్లకూడదు:

వింటర్లో ఓపెన్ హెయిర్ తో బయట తిరగడం వల్ల జుట్టు ఎక్కువ చిక్కుబడుతుంది. ఈ చిక్కును విడిపించడానికి కష్టం అవుతుంది. బలవంతంగా దువ్వడం వల్ల జుట్టు బ్రేక్ అవుతుంది.

షాంపు చేయకూడదు:

వింటర్లో , ఎక్సెస్ షాంపు వాడటం వల్ల తలలో నేచురల్ మాయిశ్చరైజర్ కోల్పోవడంతో జుట్టు డ్రైగా మారుతుంది. వారంలో రెండు సార్లకు మంచి తలస్నానం చేయకూడదు.

కెమికల్ షాంపులను ఉపయోగించకూడుదు:

మార్కెట్లో ఉండే కెమికల్ షాంపులను ఉపయోగించడం వల్ల తలలో దురద, చుండ్రు, డ్రైనెస్ మరింత పెరుగుతుంది. కాబట్టి, వంటర్లో నేచురల్ షాంపులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మంచిది,

జుట్టుకు హీట్ కలిగించే ప్రొడక్ట్స్ ఉపయోగించకూడదు:

జుట్టు స్టైలింగ్, లేదా జుట్టు తడి ఆర్పుకోవడానికి హెయిర్ డ్రయ్యర్స్, రోలర్స్, కర్లింగ్ ప్రొడక్టస్ వంటి హీట్ కలిగించే ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించకపోవడం మంచిది.

కెమికల్స్ ప్రొడక్ట్స్ కు దూరంగా:

కెమికల్ ప్రొడక్ట్స్ జుట్టుకు మరింత హాని కలిగిస్తుంది. ముఖ్యంగా పెరాక్సైడ్స్ వంటివి జుట్టుకు మరింత ఎక్కువ హాని కలిగిస్తుంది. వింటర్లో డ్రైహెయిర్ నివారించడం కోసం, చాలాజాగ్రత్తలు తీసుకోవాలి.

తలస్నానానికి వేడినీళ్ళు ఉపయోగించకూడుదు:

తలకు హాట్ వాటర్ తో స్నానం చేయకూడదు. హాట్ వాటర్ తో తలస్నానం వల్ల జుట్టు మరింత ఎక్కువ డ్రై అవుట్ చేస్తుంది. హెయిర్ క్యూటికల్స్ ను డ్యామేజ్ చే్తుంది. హెయిర్ బ్రేకేజ్ కు దారితీస్తుంది. కాబట్టి ఎప్పుడూ గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల డ్రైనెస్ తగ్గుతుంది. మాయిశ్చరైజర్ పెరుగుతుంది.

హెయిర్ కట్స్ అవాయిడ్ చేయకూడదు:

రెగ్యులర్ గా హెయిర్ ను ట్రిమ్ చేస్తుండాలి.ఆరు, ఎనిమిది రోజులకు ఒకసారి ట్రిమ్ చేసుకోవాలి. రెగ్యులర్ గా హెయిర్ ట్రిమ్ చేసుకుంటే, డ్రైనెస్ పోవడమే కాదు, జుట్టు పెరుగుదల కూడా మెరుగుపడుతుంది.

English summary

10 Things You Should Never Do To Your Hair In Winter!

Winter brings a lot of good as well as bad impressions such as the snow, the cold winds and the gleeful holidays. Among the various bad aspects of winter, the worst is the damage caused to your hair, which is why you must have a look at these winter hair care tips to help you better
Please Wait while comments are loading...
Subscribe Newsletter