For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తలకు నువ్వుల నూనె అప్లై చేస్తే ఖచ్చితంగా 11 అమేజింగ్ బెనిఫిట్స్ పొందుతారు..!!

నువ్వుల నూనెలో విటమిన్ ఇ, బి కాంప్లెక్స్, మరియు మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్పరస్, వంటి న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి. నువ్వుల నూనెలో ఉండే ప్రోటీన్స్, హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది.

|

నువ్వుల నూనె దీన్నే జింజెల్లీ ఆయిల్ అని కూడా పిలుస్తారు. నువ్వుల నూనెలో పోషకవిలువలు అత్యధికంగా ఉంటాయి. నువ్వుల నూనెలో నయం చేసే గుణాలు, లూబ్రికేటింగ్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇంకా నువ్వుల నూనెను వంటలకు ఉపయోగించడం మాత్రమే కాదు, ఇందులో బ్యూటీ బెనిఫిట్స్ కూడా అధికంగా ఉంటాయి .జుట్టుకు మంచి పోషణను అందివ్వడంతో పాటు, హెయిర్ గ్రోత్ గ్రేట్ గా పెంచుతుంది.

11 Amazing Benefits Of Sesame Oil For Hair – Must Try

నువ్వుల నూనెలో విటమిన్ ఇ, బి కాంప్లెక్స్, మరియు మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్పరస్, వంటి న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి. నువ్వుల నూనెలో ఉండే ప్రోటీన్స్, హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది, జుట్టుకు లోపలి వరకూ పోషణను అందిస్తుంది. అంతే కాదు నువ్వుల నూనె జుట్టుకు రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఆలస్యం చేయకుండా ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుని, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకుందాం..

తెల్ల జుట్టును నివారిస్తుంది:

తెల్ల జుట్టును నివారిస్తుంది:

జుట్టు రంగు మెరుగుపరుచుకోవాలన్నా, తెల్లజుట్టును నల్లగా మార్చుకోవాలన్నా, నువ్వులను నూనెను రోజూ తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇది తెల్ల జుట్టును నివారిస్తుంది. ఆల్రెడీ తెల్లగా మారిన జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

నువ్వుల నూనె తలకు మర్ధన చేయడం వల్ల తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దాంతో జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కెమికల్స్ వల్ల జుట్టు పూర్తిగా డ్యామేజ్ అయినప్పుడు, డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేసి, రీగ్రోత్ చేయడానికి నువ్వుల నూనె సహాయపడుతుంది. అందుకే పురాతన కాలం నుండి నువ్వుల నూనెను ఎక్కువగా వాడుతున్నారు.

హానికరమైన యూవిరేస్ నుండి జుట్టుకు రక్షణ కల్పిస్తుంది:

హానికరమైన యూవిరేస్ నుండి జుట్టుకు రక్షణ కల్పిస్తుంది:

నువ్వుల నూనెలో మరో ప్రయోజనం, ఇది నేచురల్ సన్ స్క్రీన్ గా పనిచే్తుంది. నువ్వుల నూనెను తలకు అప్లై చేయడం వల్ల యూవీ రేస్ వల్ల జుట్టు డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. నువ్వుల నూనె జుట్టుకు రక్షక కవచంలా పనిచేస్తుంది. హానికరమైన యూవీ రేస్ నుండి రక్షణ కల్పిస్తుంది,. కాలుష్యం వల్ల జుట్టు డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది.

 తలలో పేలను నివారిస్తుంది:

తలలో పేలను నివారిస్తుంది:

నువ్వుల నూనెతో మరో ప్రయోజనం , తలలో పేలను నివారించుకోవడానికి నువ్వుల నూనెను ఉపయోగించుకోవచ్చు. నువ్వుల నూనెను తలకు రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల పేల సమస్య ఉండదు.నువ్వుల నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలుండటం వల్ల ఇది ఫంగల్ మరియు బ్యాక్టీరియల్ ఇన్పెక్షన్స్ ను దూరం చేస్తుంది

జుట్టును స్మూత్ గా మార్చుతుంది

జుట్టును స్మూత్ గా మార్చుతుంది

నువ్వుల నూనెలో జుట్టును స్మూత్ గా మార్చడానికి సహాయపడే ట్రాక్విలైజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వేడి వల్ల హెయిర్ ఫాలీ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. నువ్వుల నూనె కూలెంట్ గా పనిచేస్తుంది, తలకు పోషణను అందిస్తుంది. జుట్టుకు కావల్సినంత మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. తలలో డ్రై నెస్ నివారిస్తుంది.

చుండ్రును నివారించడంలో నువ్వుల నూనె:

చుండ్రును నివారించడంలో నువ్వుల నూనె:

నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి, చేతి వేళ్లతో తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. రాత్రి పడుకునే ముందు అప్లై చేయడం వల్ల ఫలితం మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది. తలలో ప్రతి పార్ట్ కు నువ్వుల నూనె అప్లై చేయాలి. తర్వాత రోజు ఉదయం తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా 30 రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

డ్రై హెయిర్ ను నివారిస్తుంది:

డ్రై హెయిర్ ను నివారిస్తుంది:

ఒక టేబుల్ స్పూన్ రూట్ జ్యూస్ లో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేయాలి. దీన్ని ఫింగర్ టిప్స్ తో తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఆయిల్ ను సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. జుట్టుకు తగిన మాయిశ్చరైజర్ అందుతుంది,. దాంతో తలలో డ్రైనెస్ తగ్గుతుంది. ఈ నూనెను హెయిర్ కండీషనర్ గా ఉపయోగించుకోవచ్చు. తలకు ఆయిల్ అప్లై చేసిన తర్వాత హాట్ టవల్ ను చుట్టి, అర గంట తర్వాత తలస్నానం చేయాలి.

హెయిర్ షైనింగ్ కోసం నువ్వుల నూనె

హెయిర్ షైనింగ్ కోసం నువ్వుల నూనె

రెండు మూడు చుక్కల నువ్వుల నూనెను చేతిలో తీసుకుని, డ్రై హెయిర్ కు అప్లై చేయాలి. ఇది జుట్టుకు హెయిర్ కండీషనర్ గా పనిచేస్తుంది. జుట్టు మెరుస్తుంటుంది.

 డీప్ కండీషనింగ్

డీప్ కండీషనింగ్

ఆయిల్ ను గోరువెచ్చగా చేసి, తలకు పూర్తిగా అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల ఇది డీప్ కండీషనర్ గా పనిచేస్తుంది. రాత్రుల్లో అప్లై చేసి ఉదయం తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

డ్యామేజ్ హెయిర్ ను రిపేర్ చేస్తుంది:

డ్యామేజ్ హెయిర్ ను రిపేర్ చేస్తుంది:

ఈ నూనెకి చొచ్చుకుపోయే స్వభావం ఉండటం వల్ల, డ్యామేజ్ అయిన జుట్టుకు పునర్జీవం కల్పిస్తుంది,. జుట్టుకు పోషణను అందిస్తుంది.

స్ట్రెస్ వల్ల జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది

స్ట్రెస్ వల్ల జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది

జుట్టు రాలడానికి మరో కారణం స్ట్రెస్, నువ్వుల నూనెను తలకు అప్లై చేయడం వల్ల ఇందులో ఉండే కూలింగ్ లక్షణాలు, స్ట్రెస్ తగ్గిస్తుంది, హెయిర్ లాస్ ను అరికడుతుంది.

English summary

11 Amazing Benefits Of Sesame Oil For Hair – Must Try

Sesame oil is also known as gingelly oil. It is highly nourishing, healing and lubricating. Other than being used as a flavor enhancing cooking oil, it has many beauty benefits and works great for the scalp and hair growth. Sesame oil is enriched with Vitamin E, B complex, and minerals such as magnesium, calcium, phosphorus and protein that strengthen the hair from the roots and give deep nourishment.
Desktop Bottom Promotion