For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగవారిలో బట్టతలకు కారణాలు, లక్షణాలు, నివారణ మార్గాలు...!!

|

ఈ మోడ్రన్ ప్రపంచంలో , మోడ్రన్ లైఫ్ స్టైల్, ఫుడ్స్ హ్యాబిట్స్ వల్ల స్త్రీలలోనే కాదు, పురుషుల్లో కూడా జుట్టు సమస్యలు అధికమౌతున్నాయి. ముఖ్యంగా పురుషులు బట్టతలను ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. ఫుడ్ హ్యాబిట్స్, జుట్టుకు సరైన కేర్ తీసుకోకపోవడం వల్ల చిన్న వయస్సులో బట్టతలకు దారితీస్తున్నది. పురుషులు ఎదుర్కుంటున్న హెయిర్ ప్రాబ్లెమ్స్ లో బట్టతల సమస్య ఒకటి. బట్టతల కారణమైనప్పుడు తలలో పూర్గిగా వెంట్రుకలు లేకపోవడం లేదా జుట్టు పల్చబడటం జరుగుతుంది. ఇలాంటి సమస్యను అలోపిషియా అని పిలుస్తారు. అలోపిషియాకు గురైన వ్యక్తుల్లో జుట్టు పూర్తిగా రాలిపోతుంది . సాధారణంగా దీన్ని హెయిర్ లాస్ గా కూడా సూచిస్తారు. రెగ్యులర్ గా తలస్నానం చేసినప్పుడు 250పైవరకూ వెంట్రుకలు రాలిపోవడాన్ని అలోపిషియాగా గుర్తిస్తారు.

బట్టతలకు ముఖ్యకారణాలు: హెయిర్ ఫాలిసెల్స్ మూసుకుపోవడం వల్ల జుట్టు రాలడం అధికమౌతుంది. పురుషుల్లో ఎక్కువగా గుర్గించాల్సిన విషయం . అందుకు వివిధ కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్నిపురుషుల్లో కూడా హార్మోనుల్లో మార్పులు, ఏజింగ్, హెరిడిటి, ఐరన్ మరియు ప్రోటీన్ లోపాలు, అనుకోకుండా బరువు తగ్గడం, విటమిన్ ఎ అధికంగా తీసుకోవడం, తలలో ఇన్ఫెక్షన్స్, ట్రూమా, డ్రగ్స్ తీసుకోవడం, మెడికల్ కండీషన్, అనీమియా, డైట్ లో మార్పులు, బర్త్ కంట్రోల్ ఓరల్ కాంట్రాసెప్టివ్స్ తీసుకోవడం, స్ట్రెస్, మోనోపాజ్, థైరాయిడ్ సమస్యల వల్ల జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది.

లక్షణాలు: అతి తక్కువ సమయంలో ఎక్కువ జుట్టు రాలిపోవడం, హెయిర్ లాస్ వల్ల తలలో అక్కడక్కడ ప్యాచెస్ గా ఏర్పడటం. తలకు బాల్డ్ గా కనిపిస్తుంది. హెయిర్ లైన్ తగ్గడం, జుట్టు పల్చబడటం, గుండ్రటి ప్యాచ్ లు, స్ట్రెస్, రాపిడ్ వెయిట్ లాస్, నెయిల్ సమస్యలు, వైట్ స్పాట్స్.

హోం రెమెడీస్ : బట్టతలకు గురిచేసే హెయిర్ లాస్ ను నివారించడం ఎలా? బట్టతలను నివారించుకోవడానికి వివిధరకా సర్జీలు చేయించుకుంటారు . సర్జరీలు, హెయిర్ ట్రీట్మెంట్స్ చాలా ఖరీదైనవి, . వీటికోసం ఎక్కువ డబ్బు ఖర్చుచేయడం కంటే, సింపుల్ గా హోం రెమెడీస్ ను ఫాలో అవ్వడం మంచిది. పురుషుల్లో బట్టతలను నివారించే సింపుల్ హోం రెమెడీస్..

ఆముదం:

ఆముదం:

ఆముదం జుట్టు పెరుదలను మెరుగ్గా ప్రోత్సహిస్తుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా, ఆముదం రెండు చేతుల్లో వేసుకుని తలకు పట్టించి సున్నితంగా మాసాజ్ చేసి ఒకటి రెండు గంటల తర్వాత తలస్నానం చేయాలి.

రెడ్ గ్రామ్ మరియు పీజియన్ పీ:

రెడ్ గ్రామ్ మరియు పీజియన్ పీ:

రెడ్ గ్రామ్ కు పీజియన్ పీ జోడిస్తే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది పురుషుల్లో బట్టతల నివారిస్తుంది, ఈ రెండు పదార్థాలను పేస్ట్ చేసి , దీన్ని ఎఫెక్టెడ్ ఏరియాలో అప్లై చేయాలి.

అలోవెర జెల్:

అలోవెర జెల్:

కలబంద రసం వివిధ రకాల హెయిర్ సమస్యలను నివారిస్తుంది. జుట్టు పెరుగుదలను నేచురల్ గా ప్రోత్సహిస్తుంది. బట్టతలను నివారిస్తుంది. అలోవెర జెల్ ను తలకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. అలోవెరలో ఉండే ఎంజైమ్స్ హెయిర్ ఫోలిసెల్స్ ఓపెన్ అయ్యేలా చేసి, హెయిర్ లాస్ ను నివారిస్తుంది.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె ఒక నేచురల్ హోం రెమెడీ. బట్టతలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కొద్దిగా కొబ్బరి నూనెను తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. కొబ్బరి నూనె హెయిర్ ఫోలీసెల్స్ ను క్రమబద్దం చేస్తుంది. కొబ్బరినూనె రాత్రంతా పెట్టుకుని ఉదయం తలస్నానం చేయాలి.

బ్లాక్ పెప్పర్ :

బ్లాక్ పెప్పర్ :

బట్టతలను నివారించడంలో బ్లాక్ పెప్పర్ గ్రేట్ హోం రెమెడీ. ఇది మ్యాజికల్ బెనిఫిట్స్ ను అందిస్తుంది. మెత్తగా పేస్ట్ చేసి తలకు అప్లై చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

మెంతులు:

మెంతులు:

మెంతులు:

నిమ్మరసం:

నిమ్మరసం:

వివిధ రకాల జుట్టు సమస్యలను నివారించడంలో గ్రేట్ హోం రెమెడీ నిమ్మరసం. చుండ్రు, డ్రై హెయిర్, బట్టతల, హెడ్ ఇన్ఫెక్షన్ సమస్యలను నివారించడంలో గ్రేట్ రెమెడీ . రెండు చెంచాల నిమ్మరసంను, ఆలివ్ ఆయిల్ తో మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. ఇది జుట్టు రాలడం అరికట్టి, పెరుగుదలను ప్రోత్సహిస్తుంది,

బీట్ రూట్ ఆకులు:

బీట్ రూట్ ఆకులు:

వీట్ రూట్ లీవ్ వండర్ ఫుల్ హోం రెమెడీ. బట్టతలను నివారించడంలో బీట్ రూట్ లీవ్స్ ను నీటిలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఇది మెత్తగా సాప్ట్ గా తయారవుతుంది. ఈ పేస్ట్ ను తలకు అప్లై చేసి గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.

ఉల్లిపాయ:

ఉల్లిపాయ:

ఉల్లిపాయ రసంలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఇది తలలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. బట్టతలను నివారించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. సింపుల్ గా ఉల్లిపాయ నుండి రసం తీసి తలకు అప్లై చేయాలి. కొద్దిగా తేనె మిక్స్ చేస్తే మరింత ఎఫెక్టివ్ గా పినచేస్తుంది. తలలో హానికరమైన బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ నివారిస్తుంది.

పెరుగు:

పెరుగు:

పెరుగు నేచురల్ కండీషనర్. హెయిర్ ఫాల్ తగ్గించి, బట్టతలను నివారించే గుణాలు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్ , ఇది హెయిర్ ఫాల్ ను నివారిస్తుంది,. దీన్ని హెయిర్ మాస్క్ గా వేసుకుని 15నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

తేనె:

తేనె:

తేనె నేచురల్ హోం రెమెడీ. వివిధ రకాల హెయిర్ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. హెయిర్ ఫాల్, డ్రై హెయిర్, బట్టతల మొదలగునవి నివారిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ లోతేనె మిక్స్ చేయాలి, అందులోనే ఆలివ్ ఆయిల్ మిక్స్ తలకు అప్లై చేసి 20 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

కొత్తిమీర:

కొత్తిమీర:

కొత్తి మీర , ఇది నేచురల్ హెర్బ్ . హెయిర్ ట్రీట్మ్ంట్ లో ఇది కూడా ఒకటి. కొద్దిగా కొత్తిమీర తీసుకుని , మెత్తగా పేస్ట్ చేసిన తలకు పట్టించాలి. తడి ఆరిన తర్వాత తలస్నానం చేయాలి.

ఆమ్లా:

ఆమ్లా:

ఆమ్లా(ఉసిరికాయ)జ్యూస్ జుట్టు సమస్యలను నివారించడంలో గ్రేట్ రెమెడీ. నిమ్మరసం, ఆమ్లా జ్యూస్ ఈక్వెల్ గా తీసుకుని తలకు అప్లై చేయాలి. అలాగే కొన్ని ఆమ్లా ముక్కలను కొబ్బరినూనెలో వేసి మరిగించి తలకు అప్లై చేయడం వల్ల కూడా జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

ఆవ నూనె:

ఆవ నూనె:

బట్టతల నివారించడంలో ఆవనూనె కూడా గ్రేట్ గా సహాయపడుతుంది, ఒక టేబుల్ స్పూన్ హెన్నా లీవ్స్ ను ఆవనూనెలో వేసి మరిగించి తలకు మసాజ్ చేయాలి. ఇలా చేస్తుంటే బట్టతల సమస్య నివారించబడుతుంది.జ

రెడ్ హెన్నా:

రెడ్ హెన్నా:

హెయిర్ లాస్ ట్రీట్మెంట్ లో గ్రేట్ రెమెడీ. ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. హెన్నా పౌడర్ లో నిమ్మరసం, పెరుగు మిక్స్ చేసి లకు అప్లై చేయాలి. 15రోజులకొకసారి అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

బాదం ఆయిల్:

బాదం ఆయిల్:

బాదం ఆయిల్ జుట్టు రాలడం నివారించడంలో గ్రేట్ హోం రెమెడీ. కొద్దిగా బాదం ఆయిల్ ను ఆముదం నూనెతో మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. బాదం ఆయిల్ ను నేరుగా తలకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

గుడ్డులో పచ్చసొన:

గుడ్డులో పచ్చసొన:

గుడ్డులోని పచ్చసొనకు కొద్దిగా తేనె మిక్స్ చేసి , జుట్టుకు అప్లై చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టును బలోపేతం చేస్తుంది. లేదా నేరుగా పచ్చసొన జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం అరికడుతుంది , దీన్ని తలకు అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

కరివేపాకు:

కరివేపాకు:

కరివేపాకు బట్టతలకు వ్యతిరేఖంగా పనిచేస్తుంది. కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి బాగా మరిగించాలి. ఇది బ్లాక్ కలర్ లో అయ్యే వరకూ మరిగించిన తర్వాత కరివేపాకును ఫిల్టర్ చేసి, ఈ నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు మసాజ్ చేయాలి. ఈ నూనె హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది.

పొట్లకాయ:

పొట్లకాయ:

పొట్లకాయలో నేచురల్ యాంటీబయోటిక్ గా పనిచేస్తుంది, బట్టతలను నివారించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందు నుండి జ్యూస్ తీసి తలకు నేరుగా అప్లై చేయాలి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్ ను బట్టతలను నివారించడంలో గ్రేట్ రెమెడీ. ఆపిల్ సైడర్ వెనిగర్ తో తలను శుభ్రం చేసుకోవాలి. ఇది నేచురల్ కండీషనర్ గా పనిచేస్తుంది, హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. రాత్రుల్లోనే ఆపిల్ సైడర్ వెనిగర్ ను తలకు అప్లై చేసి, ఉదయాన్నే శుభ్రం చేసుకోవచ్చు. ఇది మూసుకుపోయిన చర్మ రంద్రాలను శుభ్రం చేసి హెయిర్ రూట్స్ కు బలాన్నిస్తుంది.

English summary

20 Natural Home Remedies for Baldness...!

Baldness is one of the most common hair problems faced by men. It is actually a condition, in which a person has no or very less hair on the head. Its technical name is alopecia. The extreme form of alopecia or baldness is alopecia totalis, in which, man tends to lose overall head hair. In general terms, it is referred as hair loss. It is believed that human loses almost 250 strands while washing them.
Desktop Bottom Promotion