For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చుండ్రును పూర్తిగా మాయం చేసే ఆయర్వేదిక్ రెమెడీస్

By Super
|

మీకు ఒక బ్యూటిఫుల్ బ్లాక్ టీషర్ట్ మరియు బ్లాక్ డ్రెస్ వేసుకోడానికి ఇష్టపడుతారు. కానీ ఏం ప్రయోజనం మనస్సులో ఎక్కడో ఒక దిగులు. ఎందుకంటే తలలో చుండ్రు సమస్య..!బ్లాక్ డ్రెస్సు లేదా ముదురురంగు డ్రెస్సులేసుకొన్నప్పుడు చుండ్రురాలితే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని టెన్షన్.

మరి ఇలా మీకు ఇష్టమైన దుస్తులు ధరించాలంటే ముందుగా చుండ్రును నివారించుకోవాలి. తలలో డెడ్ స్కిన్ సెల్స్ ఎక్కువ సెబమ్, ఫంగల్ పెరగడం వల్ల చుండ్రుకు దారితీస్తుంది. ఇలాంటి సమస్యతో పది మందిలోకి వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సమస్యను నివారించుకోవడానికి మెడికేటెడ్ షాంపు, లోషన్స్, యాంటీబయోటిక్ వంటివి వాడినప్పుడు సమస్య మరింత ఎక్కువ అవుతుంది.

అయితే ఇలాంటి వైద్యపరమైన ఔషధాలు సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తాయని మీరు బయపడినట్లైతే నేచురల్ పద్దతులను అనుసరించడం మంచిది. చుండ్రును నివారించే ఆయుర్వేదిక్ చిట్కాలైతే.. చుండ్రుని శాశ్వతంగా నివారిస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Ayurvedic Remedies To Cure Dandruff Completely

1. రెమెడీస్ 1: కొబ్బరి నూనె, నిమ్మ: నిమ్మరసం ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది బ్యాక్టీరియా సంబంధించిన మైక్రోబ్స్ ను నాశనం చేస్తుంది. కొబ్బరి నూనె తలకు తేమను అందిస్తుంది. తలలో డ్రైనెస్, సెబమ్ ను నివారిస్తుంది.

పద్దతి: కొన్ని చుక్కల నిమ్మరసంను 2టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి మసాజ్ చేయాలి. 30నిముషాల తర్వాత మైల్డ్ షాంపుతో తలస్నానం చేయాలి.

Ayurvedic Remedies To Cure Dandruff Completely

2. రెమెడీ2: కావల్సినవి: కొబ్బరి నూనె, కర్పూరం
ఈ కాంబినేషన్ తలకు మంచి మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. తలలో డ్రై నెస్ ను నివారిస్తుంది. అలాగే కొబ్బరి నూనెలో ఉండే ఈ మాయిశ్చరైజర్ గుణాలు అద్భుతాలు చేస్తుంది. అలాగే కర్పూరంలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చుండ్రుకు కారణం అయ్యే మైక్రోబ్స్ ను నివారిస్తుంది.

పద్దతి: కర్పూరంను కొద్దిగా పొడి చేసి కొబ్బరినూనెను మిక్స్ చేయాలి. దీన్ని బాటిల్లో నిల్వచేసుకొని తలకు పట్టించి మసాజ్ చేస్తుండాలి. దీన్ని రాత్రుల్లో కూడా అప్లై చేయవచ్చు. తర్వాత మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఈ పద్దతిని రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

Ayurvedic Remedies To Cure Dandruff Completely

3. రెమెడీ3: వెనిగర్ మన వంటగదిలో ఉండే నిత్యవసర వస్తువు. ఇది తలలో చుండ్రును నివారించడంతో పాటు తలకు తగిన తేమను అందిస్తుంది. తలలో సెబమ్, డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.

పద్దతి: ఒక కప్పులో కొద్దిగా వెనిగర్ తీసుకొని కాటన్ బాల్ ను వెనిగర్ లో డిప్ చేసి తలకు పట్టించి మసాజ్ చేయాలి. అరగంట తర్వత మైల్డ్ షాంపుతో తలస్నానం చేసుకోవాలి.

4. రెమెడీ 4: పదార్థాలు: మెంతులు
ఆయుర్వేదిక్ నిపుణుల ప్రకారం మెంతులు హెయిర్ ఫోలిసెల్స్ ను బలంగా మార్చుతుంది. జుట్టుకు తగిన పోషణను అందిస్తుంది. అలాగే మెంతి పేస్ట్ ను హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు రాలడం నివారిస్తుంది.

పద్దతి: కొన్ని మెంతులను నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం వాటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి తలకు పట్టించి 1గంట తర్వాత తలస్నానం చేసుకుంటే చుండ్రు నివారించడంతో పాటు, తలకు తగిన పోషణ అందిస్తుంది.

Ayurvedic Remedies To Cure Dandruff Completely

5. రెమెడీ 5: పదార్థాలు: బ్లాక్ పెప్పర్ పౌడర్
బ్లాక్ పెప్పర్ పౌడర్ లో మైక్రోబ్స్ ను, ఫంగస్ ను నాశనం చేసే లక్షణాలు ఉంటాయి. ఇది చుండ్రును, తలలో మొటిమలను నివారించే గుణాలు కలిగి ఉంటుంది.

పద్దతి: బ్లాక్ పెప్పర్ ను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత ఈ పౌడర్ లో కొద్దిగా నీళ్లు మిక్స్ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. మంచి షాంపుతో తలస్నానం చేసుకోవాలి.
ఉత్తమ ఫలితం కోసం పెప్పర్ పౌడర్ కు నిమ్మరసం, పెరుగు జోడించి అప్లై చేసుకోవచ్చు.

English summary

5 Ayurvedic Remedies To Cure Dandruff Completely

5 Ayurvedic Remedies To Cure Dandruff Completely. The ancient medicine system of Ayurveda has some potent herbal remedies to help you get rid of dandruff completely.
Story first published: Wednesday, May 4, 2016, 17:36 [IST]
Desktop Bottom Promotion