For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బట్టతలను నివారించే హెయిర్ రీగ్రోత్ అయ్యేలా చేసే ఆయుర్వేదిక్ రెమెడీస్

|

అక్యూట్ హెయిర్ ఫాల్ అంటే దీర్ఘకాలిక సమస్య, ఈ సమస్య వల్ల తరచూ జుట్టు రాలడం బట్టతల ఏర్పడుతుంది! అందమైన బాడీ షేప్, బ్యూటిఫుల్ స్కిన్ స్ట్రక్చర్ మరియు కలర్ ఫుల్ డ్రెస్ ఇవన్నీ చాలా ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయి. అదే విధంగా అందమైన జుట్టు కూడా.. ఎంత అందంగా అలకరించుకొన్నాఅందమైన జుట్టు లేకపోతే, బట్టతల కనబడుతుంటే, ఏదో తెలియని వెలితి, బాధ, నలుగురిలో ఇబ్బందిగా ఫీలవుతుంటారు. రుషులు మాత్రమే కాదు, స్త్రీలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.

పురుషులో జుట్టురాలడం అరికట్టేందుకు పరిష్కారం..!

బట్టతలకు అసలు కారణాలేంటి? ఎక్కువ స్ట్రెస్ కు గురి అవ్వడం, హెరిడిటి, విటమిన్ బి 6 మరియు ఫోలిక్ యాసిడ్ లోపం, తలలో దురద, రాషెస్, క్రోనిక్ డిసీసెస్ .

బట్టతలను కప్పిపుచ్చుకోవడానికి లేదా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తుంటారు. టాక్సిక్ కెమికల్స్ ఉపయోగించడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. కాబట్టి, కెమికల్స్ ప్రొడక్ట్స్ కంటే నేచురల్ గా హేర్బల్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం మంచిది.అందులోనూ ఆయుర్వేదిక్ రెమెడీస్ మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

మెంతులు:

మెంతులు:

మెంతుల్లో విటమిన్ బి6, మినిరల్స్, ఐరన్, క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల ఇవి హెయిర్ ఫాలీ సెల్స్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. దాంతో జుట్టు రాలడం తగ్గుతుంది, జుట్టు రీగ్రోత్ అవుతుంది. మెంతులు రాత్రి నీళ్ళల్లో నానబెట్టి, ఉదయం పేస్ట్ చేసి, బట్టతలకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఈ పద్దతిని వారంలో రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

థైమ్ ఆయిల్ :

థైమ్ ఆయిల్ :

థైమ్ ఆయిల్లో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి తలలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది , జుట్టు పెరేందుకు సహాయపడుతుంది. చుండ్రు నివారిస్తుంది. కొన్ని చుక్కల థైమ్ ఆయిల్ తీసుకుని వేడి చేసి, తలకు అప్లైచేసి మసాజ్ చేయాలి. ముఖ్యంగా బట్టతల మీద ఎక్కువగా అప్లై చేయాలి. బ్రిస్టల్ బ్రెష్ ఉపయోగించి 5నిముషాలు దువ్వాలి.

కుంకుమ పువ్వు:

కుంకుమ పువ్వు:

కుంకుమ పువ్వులో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇది హెయిర్ ఫోలి సెల్స్ ను రిపేర్ చేస్తుంది. హెయిర్ గ్రోత్ ను పెంచుతుంది. ఒక చిటికెడు కుంకుమపువ్వును ఒక టీస్పూన్ పాలలో మిక్స్ చేసి , ఒక టీస్పూన్ లికోరైస్ మిక్స్ చేయాలి.మొత్తం మిశ్రమాన్ని పేస్ట్ లా చేసి తలకు అప్లై చేయాలి, రాత్రంతా అలాగే ఉంచాలి. తర్వాతి రోజు ఉదయం శుభ్రం చేసుకోవాలి.

రాడిష్ జ్యూస్:

రాడిష్ జ్యూస్:

రాడిష్ జ్యూస్ లో విటమిన్ ఎ, సి, మరియు కె లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ లా పనిచేస్తాయి . హెయిర్ రూట్స్ ను బలోపేతం చేస్తాయి హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తాయి. బ్లాక్ రాడిష్ నుండి జ్యూస్ తీసి బట్టతలకు అప్లై చేయాలి. మసాజ్ చేయాలి. స్కిన్ లైట్ గా వార్మ్ గా మారుతుంది.

కర్పూరం ఆయిల్ :

కర్పూరం ఆయిల్ :

కర్పూరం ఆయిల్లో యాంటీ సెప్టిక్ మరియుయాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి, ఇవి హెల్తీ స్కాల్ఫ్ ను ప్రోత్సహిస్తాయి, హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తాయి.ప్రతి రోజూ నిద్రించడానికి ముందు కర్పూరం ఆయిల్ ను అప్లై చేసి ఫలితం మీరే చూడండి.

మందారం:

మందారం:

మందారంలో వివిధ రకాల ప్రోటీన్స్ ఉంటాయిజ డ్యామేజ్ అయిన హెయిర్ ఫాలీసెల్స్ ను తిరిగి తీసుకొస్తాయి. హైబిస్కస్ ఫ్లవర్స్ ను మెత్తగా పేస్ట్ చేసి ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తలకు , ముఖ్యంగా బట్టతల ఏరియాలో అప్లై చేసి, 15 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

English summary

6 Ayurvedic Remedies To Fill In The Bald Spot!

You know what is worse than acute hair fall, bald patch! Sample this - You are all decked up for the big meet, your clothes are tailored to perfection, your speech is eloquent, your hair is perfectly in place, except, wait, what? There is a dime-sized round patch peeking out from your rapidly thinning scalp.
Story first published: Friday, August 19, 2016, 8:04 [IST]
Desktop Bottom Promotion