చిట్లిన, పొడిబారిన జుట్టు నివారించే హనీ హెయిర్ ప్యాక్స్

తేనెని ఔషధ గుణాలున్న పదార్ధాలటో కలిపి వాడితే ఫలితం కనిపిస్తుంది.అసలు తేనెని ఏ పదార్ధాలతో కలిపి వాడితే ఎలాంటి ఫలితం వస్తుంది, మీకున్న సమస్యలకి తేనేని ఎలా వాడాలి ? అనేది తెలుసుకుందాం..

Subscribe to Boldsky

ఒకసారి మీజుట్టుని పట్టుకుని చూసుకోండి. చివర్లు రఫ్‌గా తగులుతున్నాయా?? లేదా బాగా ఎండిపోయి జీవం లేనట్లుగా ఉన్నయా ? అయితే మీ జుట్టు చివర్లు చిట్లిపోయి, జుట్టంతా పొడిబారిపోయింది అని సంకేతం.

సహజంగా జుట్టులో తేమని నిలిపి ఉంచే గుణం తేనెకి ఉంది. ఇది జుట్టుని షైనీగా మార్చి మెరిసేటట్టు చేస్తుంది. జుట్టుకి తేనే ప్యాక్స్ ఎందుకు మంచివంటే తేనెలో ఫ్రక్టోస్, గ్లూకోస్ ఉంటాయి. ఇవి కుదుళ్లని బలపరచి చిట్లడాన్ని అరికడతాయి.

తేనెలో ఉన్న యాంటీ బాక్టీరియల్ గుణాలు తలలో నూనె పేరుకోకుండా చూడటమే కాకుండా చుండ్రుని తొలగించి, తలలో పీహెచ్ సమతుల్యతని కాపాడుతుంది. అలా అని తలకి డైరెక్టుగా తేనెని పట్టించడం మంచిది కాదు.ఇలా చేస్తే జుట్టు అంతా చిందరవందర అయిపోతుంది పైగా తేనెలో ఉన్న జిగురు గుణం వల్ల దానిని తలకి పట్టించేటప్పుడు గట్టిగా రుద్దడం వల్ల జుట్టు చిట్లే ప్రమాదం ఉంది.

తేనెని ఔషధ గుణాలున్న పదార్ధాలటో కలిపి వాడితే ఫలితం కనిపిస్తుంది.అసలు తేనెని ఏ పదార్ధాలతో కలిపి వాడితే ఎలాంటి ఫలితం వస్తుంది, మీకున్న సమస్యలకి తేనేని ఎలా వాడాలి ? అనేది తెలుసుకుందాం..

1. స్ప్లిట్ ఎండ్ మాస్క్:

ఒక టేబుల్ స్పూన్ తేనె, రెండు టబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ గ్రుడ్డు సొన తీసుకోవాలి. గుడ్డు సొనని బాగా నురగ వచ్చేవరకూ గిలక్కొట్టి దానిలో తేనె, ఆలివ్ ఆయిల్ కలిపి మాస్క్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు మీ జుట్టుని కాస్త తడిపి జుట్టుని పాయలుగా విడదీసి శుభ్రమైన వేళ్లతో ఈ మాస్కుని కుదుళ్లకి పట్టించి జుట్టు ముడి వేసి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. మూడు నిమిషాల తర్వాత గాఢత తక్కువ ఉన్న షాంపూతో జుట్టుని శుభ్రపరచుకోవాలి.

2.డ్యామేజ్డ్ హెయిర్ మాస్క్:

ఒక టేబుల్ స్పూన్ తేనెని 2 టేబుల్ స్పూన్ల జోజోబా ఆయిల్‌తో కలిపి సన్నని మంట మీద 2 నిమిషాలు వేడి చెయ్యాలి. ఈ మిశ్రమాన్ని చల్లారనిచ్చి తలకి పట్టించి మెల్లిగా మసాజ్ చెయ్యాలి. మాస్కుని ఒక గంట పాటు ఉండనిచ్చి గాఢత తక్కువ ఉన్న షాంపూతో జుట్టుని శుభ్రపరచుకోవాలి.

3.డీప్ కండీషనింగ్ మాస్క్:

ఒక గిన్నె తీసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, ఒక టేబుల్ స్పూన్ ఆర్గానిక్ తేనే తీసుకోండి. ఒక ఫోర్కుతో ఈ మిశ్రమాన్ని బాగా వేగంగా అన్ని పదార్ధాలు కలిసేటట్లు కలపండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టు చివర్ల వరకూ, తలలోనూ పట్టించి అరగంట ఉండనిచ్చి జుట్టు శుభ్రపరచుకోండి.

4.సిల్కీ హెయిర్ మాస్క్:

బాగా ముగ్గిన అరటిపండు తీసుకుని మెత్తగా గిలక్కొట్టండి. దానిలో ఒక తేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఇప్పుడు మీ జుట్టునిపాయలుగా విడదీసి ఒక బ్రష్షుతో ఈ మాస్కుని పట్టించి 20 నిమిషాల తరువాత జుట్టుని మంచి నీటితో శుభ్రపరచుకోవాలి.తలలో అరటిపండు గుజ్జు అదీ లేకుండా నీళ్ళతో బాగా కడిగిన తరువాతే షాంపూ ఉపయోగించండి.

5.హెయిర్ రిపేరింగ్ మాస్క్:

2 గ్రుడ్ల తెల్లసొన, 5 చుక్కల రోజ్‌మేరీ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకుని నురగ వచ్చేవరకూ ఫోర్కుతో బాగా గిలక్కొట్టండి.ఇప్పుడు మీ జుట్టుని కాస్త తడిపి మీ మాస్క్ జుట్టంతా పట్టించి బాగా ఆరనివ్వండి.గాఢత తక్కువ ఉన్న షాంపూతో శుభ్రపరచుకుని కండీషనర్ కూడా పట్టించి మరలా కడిగితే మీ జుట్టులో మార్పు మీరే చూస్తారు.

6.యాంటీ ఫ్రిజ్ మాస్క్:

బాగా ముగ్గిన అవకాడొ గుజ్జు, ఒక టేబుల్ స్పూన్ తేనె, 5 చుక్కల బాదం నూనె, 5 చుక్కల నిమ్మరసం తీసుకుని అన్నింటినీ మెత్తని పేస్టు అయ్యేవరకూ కలిపి మీ జుట్టు అంతా పట్టించి అరగంట ఆరనిచ్చి గాఢత తక్కువ ఉన్న షాంపూతో జుట్టుని శుభ్రపరచుకోండి.

7.హెయిర్ గ్రోత్ మాస్క్:

పొడి బారిన జుట్టుకి వాడే మాస్కుల్లో అతి సులభమైనది ఇది. 2 టేబుల్ స్పూన్ల ఆర్గానిక్ తేనెని మీరు రోజూ వాడే షాంపూ సీసాలో వేసి బాగా కలపాలి.మీరు తలస్నానం చేసే ప్రతీ సారీ ఈ తేనె కలిపిన షాంపూని వాడితే తేనెలోని సుగుణాలు మీ జుట్టుకి మేలు చేస్తాయి.

English summary

7 Incredible Honey Treatments For Dry & Brittle Hair

7 Incredible Honey Treatments For Dry & Brittle Hair. If you are looking to spell life back into your dry and brittle hair, you have to try these herbal honey hair masks.
Please Wait while comments are loading...
Subscribe Newsletter