జుట్టుకి పెరుగు అప్లై చేస్తున్నారా ? ఐతే ఇవి తెలుసుకోండి..!

పెరుగులో చర్మానికి, జుట్టుకి ప్రయోజనం కలిగించే అనేక బెన్ఫిట్స్ దాగున్నాయి. చాలామంది జుట్టుకి పెరుగు అప్లై చేస్తారు.

Posted By:
Subscribe to Boldsky

అన్నిరకాల పొట్ట సమస్యలకు పెరుగు చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. అలాగే దీన్ని రకరకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. కానీ పెరుగులో చర్మానికి, జుట్టుకి ప్రయోజనం కలిగించే అనేక బెన్ఫిట్స్ దాగున్నాయి. చాలామంది జుట్టుకి పెరుగు అప్లై చేస్తారు.

curd to hair

పెరుగు తినడం వల్ల జీర్ణసంబంధ సమస్యలు నివారించడానికి సహాయపడుతుంది. అలాగే పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి పెరుగు తినడం చాలా అవసరం. చర్మాన్ని మాయిశ్చరైజర్ ని అందిస్తుంది. నిగారింపు నిస్తుంది. కాబట్టి ఎలాంటి కెమికల్స్ లేకుండా పెరుగుతో గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు.

ఇప్పుడు జుట్టుకి పెరుగు అప్లై చేయడం వల్ల పొందే ప్రయోజనాలు తెలుసుకుందాం. ఇది జుట్టుకి రకరకాలుగా సహాయపడుతుంది. పెరుగుతో జుట్టుకి కలిగే ప్రయోజనాలు చూద్దాం..

కండిషనర్

పెరుగు జుట్టుకి న్యాచురల్ కండిషనర్ లా సహాయపడుతుంది. జుట్టుకి పెరుగు అప్లై చేసి.. షవర్ క్యాప్ పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

సాఫ్ట్ హెయిర్

పెరుగులో కొద్దిగా తేనె కలిపి.. జుట్టుకి అప్లై చేసి.. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే.. మీ జుట్టు చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ గా మారుతుంది.

షైనీ హెయిర్

పెరుగులో మీగడ కలిపి జుట్టుకి అప్లై చేస్తే.. జుట్టుకి మంచి షైనింగ్ వస్తుంది. అరగంట తర్వాత జుట్టుని శుభ్రం చేసుకోవాలి.

జుట్టు చివర్లు చిట్లిపోవడాన్ని

పెరుగుతో ఎలాంటి మాస్క్ అయినా.. వారానికి రెండుసార్లు అప్లై చేస్తే.. జుట్టు స్ట్రాంగ్ గా మారుతుంది. చివర్లు చిట్లిపోకుండా ఉంటుంది.

చుండ్రు

పెరుగులో నిమ్మరసం కలిపి స్కాల్ప్ కి పట్టించి.. శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ని వారానికి రెండుసార్లు అప్లై చేస్తే.. చుండ్రు తగ్గిపోతుంది.

జుట్టు రాలడం

కొన్ని కరివేపాకులను మిక్సీ పట్టి పెరుగులో కలిపి జుట్టుకి పట్టిస్తే.. జుట్టు రాలడం తగ్గుతుంది. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

జుట్టు పెరుగుదల

కొద్దిగా పెరుగు తీసుకుని, కొబ్బరినూనె, మందారం ఆకులతో కలిపి పేస్ట్ చేసుకుని జుట్టుకి పట్టించాలి. ముఖ్యంగా స్కాల్ప్ కి పట్టించాలి. గంట లేదా రెండు గంటల తర్వాత శుభ్రం చేసుకుంటే.. జుట్టు వేగంగా పెరుగుతుంది.

English summary

7 Things You Need To Know Before Using Yogurt On Your Hair

7 Things You Need To Know Before Using Yogurt On Your Hair. Yogurt is supposed to be great for all sorts of stomach problems.
Please Wait while comments are loading...
Subscribe Newsletter