బట్టతలను ఎఫెక్టివ్ గా నివారించే కర్పూరం హెయిర్ ప్యాక్..!

కర్పూరంలో పునరుత్పత్తి గుణాలు ఉండటం వల్ల.. జుట్టు పెరుగుతదలకు సహాయపడుతుంది. కర్పూరంలో 40ప్రయోజనాలున్నాయి. ఇవి రాత్రికి రాత్రే.. మెరుగైన ఫలితాలను అందిస్తాయి.

Posted By:
Subscribe to Boldsky

జుట్టు రాలడం అనేది.. ఎమోషనల్ గా ఇబ్బందిపెట్టే సమస్య. బట్టతల సమస్య ఉందంటే.. ఆ వ్యక్తి ఆత్మగౌరవాన్ని కూడా కోల్పోయే పరిస్థితికి తీసుకెళ్తోంది. ఎందుకంటే.. బట్టతల లేకుండా.. జుట్టు ఉండటం అనేది అబ్బాయిలకు ఒక క్వాలిఫికేషన్ లా మారిపోయింది.

bald patch

జుట్టు ఎక్కువగా రాలడం మొదలైంది అంటే.. బట్టతల సమస్య దగ్గరపడుతోందని సంకేతం. కాబట్టి బట్టతల నివారించుకునే ఎఫెక్టివ్ రెమిడీస్ ని ఫాలో అవ్వాలి. అందుకోసం.. కర్పూరం హెయిర్ మాస్క్ మెరుగైన ఫలితాలను ఇస్తుందని నిపుణులు సూచిస్తారు.

జుట్టు రాలడాన్ని నివారించడంలో కర్పూరం హెయిర్ ప్యాక్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండటం వల్ల.. ఇది హెల్తీ స్కాల్ప్ కి సహాయపడుతుంది. ఇది కొల్లాజెన్ ఫైబర్స్ ఉత్పత్తిని మెరుగుపరిచి, ఎలాస్టిసిటిని పెంచి.. జుట్టు కుదుళ్లు బలంగా మారడానికి సహాయపడుతుంది.

కర్పూరంలో పునరుత్పత్తి గుణాలు ఉండటం వల్ల.. జుట్టు పెరుగుతదలకు సహాయపడుతుంది. కర్పూరంలో 40ప్రయోజనాలున్నాయి. ఇవి రాత్రికి రాత్రే.. మెరుగైన ఫలితాలను అందిస్తాయి. మరి.. కర్పూరం హెయిర్ ప్యాక్ ఉపయోగించి.. బట్టతలను ఎలా నివారించాలో చూద్దాం..

స్టెప్ 1

రెండు కర్పూరం బిల్లలు తీసుకుని.. రాతితో దంచుతూ మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఎప్పటికీ.. కర్పూరంను డైరెక్ట్ గా తలపై రాసుకోకూడదు. కొద్దిగా ఆయిల్ లేదా మరేదైనా వస్తువుతో కలిపి మాత్రమే ఉపయోగించాలి.

స్టెప్ 2

సన్నని మంటపై 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ కొబ్బరినూనె కలిపి వేడి చేయాలి. ఒక నిమిషం వేడి అయిన తర్వాత.. స్టవ్ ఆఫ్ చేసి.. ఆయిల్ చల్లారనివ్వాలి.

స్టెప్ 3

ఒక గుడ్డులోని తెల్లసొనను ఒక గిన్నెలో తీసుకోవాలి. బాగా కలబెట్టాలి. ఇప్పుడు అందులోకి ఆయిల్, టీస్పూన్ నిమ్మరసం, కర్పూరం పొడి కలపాలి. మంచి సువాసన రావడానికి కొన్ని చుక్కల గ్రేప్ సీడ్ ఆయిల్ మిక్స్ చేయాలి.

స్టెప్ 4

ఫోర్క్ ఉపయోగించి.. అన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. ముందు జుట్టు చిక్కులు లేకుండా.. దువ్వుకోవాలి.

స్టెప్ 5

ఇప్పుడు జుట్టుని చిన్న చిన్న పాయలుగా విడదీసి.. ఈ మాస్క్ ని బ్రష్ ఉపయోగించి అప్లై చేయాలి. జుట్టు అంతటికీ, స్కాల్ప్ కి.. పట్టించాలి.

స్టెప్ 6

ఈ మిశ్రమంతో.. స్కాల్ప్ పై చేతివేళ్లతో 5నిమిషాలు.. సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత జుట్టుని పైకి కట్టుకుని.. షవర్ క్యాప్ పెట్టుకోవాలి. గంటసేపు ఈ మాస్క్ తలపై ఉండాలి.

స్టెప్ 7

గంట తర్వాత.. జుట్టుని రెగ్యులర్ షాంపూ ఉపయోగించి, కండిషనర్ ఉపయోగించి.. శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ అప్లై చేయడానికి ముందు మీ చర్మంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కొద్దిగా టెస్ట్ చేసుకోవడం మంచిది.

English summary

Camphor Hair Mask Recipe To Treat Bald Patch!

Camphor Hair Mask Recipe To Treat Bald Patch! Give new lease to receding hair line with this camphor hair mask recipe!
Please Wait while comments are loading...
Subscribe Newsletter