జుట్టు రాలడం, తెల్ల జుట్టు.. రెండింటినీ తగ్గించే పర్ఫెక్ట్ సొల్యూషన్..!

ఈ మ్యాజికల్ సొల్యూషన్ ఉపయోగిస్తే.. రాత్రికిరాత్రే.. ఫలితాలను చూడవచ్చు. జుట్టు రాలడాన్ని అరికట్టడంలో ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని ప్రూవ్ కూడా అయింది. అలాగే జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.

Posted By:
Subscribe to Boldsky

మీ బెడ్, పిల్లో పై కుచ్చులు కుచ్చులుగా జుట్టు రాలడం గమనిస్తున్నారా ? నిద్రలేవగానే ఇలా జుట్టు రాలడం చూసి టెన్షన్ పడుతున్నారా ? మీ స్కాల్ప్ పై కంటే.. దువ్వెనపైనే ఎక్కువ హెయిర్ ఉందనిపిస్తోందా ? రాలిపోతున్న జుట్టు 100కంటే ఎక్కువగా ఉంటున్నాయా ? ఐతే మీరు.. హెర్బల్ ఆయిల్ థెరపీ చేసుకోవాల్సిందే..!

హెర్బల్ ఆయిల్ థెరపీ అంటే.. పార్లర్ కి వెళ్లాలా అని ఆలోచిస్తున్నారేమో. అవసరం లేదు. ఇంట్లోనే మీరే తయారు చేసుకోవచ్చు. ఈ మ్యాజికల్ సొల్యూషన్ ఉపయోగిస్తే.. రాత్రికిరాత్రే.. ఫలితాలను చూడవచ్చు. జుట్టు రాలడాన్ని అరికట్టడంలో ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని ప్రూవ్ కూడా అయింది. అలాగే జుట్టు పెరుగుదలను కూడా మెరుగుపరుస్తుంది.

hair fall

ఇందులో ఉపయోగించే పదార్థాలు చాలా అద్భుత ఫలితాలను అందిస్తాయి. రక్త ప్రసరణ మెరుగ్గా జరిగి.. కొత్త జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఉల్లి, కరివేపాకు, ఆలివ్ ఆయిల్ ముఖ్యమైనపదార్థాలు. వీటిల్లో సల్ఫర్, ఎమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల జుట్టు తెల్లబడటాన్ని, జుట్టు రాలడాన్ని అరికడుతుంది.

కావాల్సిన పదార్థాలు
2 నుంచి 3 మందారం పువ్వులు
1టేబుల్ స్పూన్ కరివేపాకు
1 ఉల్లిపాయ
2 టేబుల్ స్పూన్ కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్
1 టీ స్పూన్ ఆల్మండ్ ఆయిల్
1 టేబుల్ స్పూన్ మెంతులు
2 విటమిన్ ఈ ట్యాబ్లెట్స్
10 చుక్కల లావెండర్ ఆయిల్

స్టెప్ 1

ఉల్లిపాయను పొట్టు తీసి, కట్ చేసి జ్యూస్ తీయాలి. కరివేపాకులను దంచాలి, తులసి ఆకులు, మందారపువ్వులను అన్నీ కలిపి పేస్ట్ చేసుకోవాలి.

స్టెప్ 2

లావెండర్ ఆయిల్ కాకుండా మిగిలిన ఆయిల్స్ అన్నింటినీ మిక్స్ చేసి సన్నని మంటపై వేడి చేయాలి. 30 సెకన్ల తర్వాత ఉల్లిపాయ రసం కలిపి.. కలుపుతూ ఉండాలి.

స్టెప్ 3

అందులోకి ఇప్పుడు కరివేపాకు, మందారపువ్వుల పేస్ట్ కలపాలి. విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ కట్ చేసి.. జెల్ కలపాలి. 5నిమిషాలు సన్నని మంటపై వేడి చేయాలి.

స్టెప్ 4

ఇప్పుడు మెంతులను అందులో కలపాలి. ఎప్పుడైతే మెంతులు కలర్ మారుతాయో అప్పుడు.. స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లారనివ్వాలి.

స్టెప్ 5

ఇప్పుడు ఈ మిశ్రమంలోకి లావెండర్ ఆయిల్ కలపాలి. వడకట్టి.. ఎయిర్ టైట్ కంటెయినర్ లో నిల్వ ఉంచుకోవాలి.

స్టెప్ 6

జుట్టుని చిన్న చిన్న పాయలుగా విడదీసుకోవాలి. జుట్టు మొత్తానికి, స్కాల్ప్ కి ఇప్పుడు తయారు చేసుకున్న ఆయిల్ అప్లై చేయాలి. 10 నిమిషాలపాటు చేతివేళ్లతో మసాజ్ చేయాలి. గంట తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి.

స్టెప్ 7

ఈ ఆయిల్ థెరపీ ట్రీట్మెంట్ ని.. వారానికి ఒకసారి ఖచ్చితంగా చేయడం వల్ల.. మీకు జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు వేగంగా పెరగడం గమనిస్తారు.

English summary

Can This Herb-infused Hair Oil Reduce Hair Fall In First Use?

Can This Herb-infused Hair Oil Reduce Hair Fall In First Use? For two times thicker, longer and glossier hair, give this herb-infused hair oil a definite try! Try it to believe it!
Please Wait while comments are loading...
Subscribe Newsletter