జుట్టు రాలడాన్ని నూటికి నూరుపాళ్లు కంట్రోల్ చేసే.. తులసి రెమెడీ..!

న్యాచురల్ గా ఎఫెక్టివ్ గా జుట్టు రాలడాన్ని అరికట్టే అద్భుత ఔషధం తులసి. తులసిలో దాగున్న ఔషధ గుణాలు, బ్యూటి బెన్ఫిట్స్ జుట్టు రాలడాన్ని వేగంగా తగ్గించడమే కాకుండా జుట్టు రీగ్రోత్ కి సహాయపడతాయి.

Posted By:
Subscribe to Boldsky

జుట్టు రాలడాన్ని వంద శాతం తగ్గిస్తుంది అంటే.. కాస్త ఆశ్చర్యంగా ఉంది కదూ. నిజమే.. ఈ న్యాచురల్ రెమిడీ.. మీ జుట్టు రాలడాన్ని ఎఫెక్టివ్ అరికడుతుంది. ప్రస్తుత రోజుల్లో వయసు, జెండర్ తో సంబంధం లేకుండా.. ప్రతి ఒక్కరూ హెయిర్ లాస్ సమస్యతో బాధపడుతున్నారు.

Can Tulsi Save Your Rapidly Falling Hair?

ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారం దొరికింది. అందుకోసం.. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. న్యాచురల్ గా.. చాలా ఎఫెక్టివ్ గా జుట్టు రాలడాన్ని అరికట్టే అద్భుత ఔషధం ప్రతి ఇంట్లో ఉండే తులసి. తులసిలో దాగున్న ఔషధ గుణాలు, బ్యూటి బెన్ఫిట్స్ జుట్టు రాలడాన్ని వేగంగా తగ్గించడమే కాకుండా.. జుట్టు రీగ్రోత్ కి సహాయపడతాయి.

జుట్టు రాలడాన్ని మాత్రమే కాదు.. డ్యామేజ్ అయిన జుట్టుని కూడా రిపేర్ చేయడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది తులసి. తులసిలో విటమిన్ ఏ, సి, ఈ, కె ఉంటాయి. ఇవన్నీ పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి. డ్యామేజ్ అయిన జుట్టుని రిపేర్ చేయడంతో పాటు, కుదుళ్లను బలంగా మారుస్తాయి. అలా జుట్టురాలడాన్ని అరికడతాయి.

తులసి ఆకుల్లో దాదాపు 3.15 ఏమ్ జీ ప్రొటీన్స్, 6 శాతం నియాసిన్, 40 శాతం ఐరన్ ఉంటాయి. ఇవన్నీ స్కాల్ప్ కి సరిగా బ్లడ్ ఫ్లో అందడానికి సహాయపడతాయి. అలాగే జుట్టు రెండురెట్లు వేగంగా పెరగడానికి సహాయపడతాయి. అలాగే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ చుండ్రుని నివారిస్తాయి. మరి జుట్టు రాలడాన్ని అరికట్టడానికి తులసిని ఎలా ఉపయోగించాలో చూద్దాం..

స్టెప్ 1

గుప్పెడు తులసి ఆకులు తీసుకుని శుభ్రం చేయాలి. ఎండలో బాగా ఆరబెట్టాలి. ఎండిన తర్వాత గ్రైండ్ చేసి, పొడి చేసుకోవాలి.

స్టెప్ 2

1 టేబుల్ స్పూన్ ఉసిరి పొడి, 1 టీస్పూన్ తులసి పొడి కలపాలి. ఒక కప్పు నీటిని ఇందులో మిక్స్ చేసి.. పేస్ట్ చేసుకోవాలి. రాత్రంతా నానబెట్టాలి.

స్టెప్ 3

ఉదయం ఈ పేస్ట్ ని ఫోర్క్ తో బాగా కలపాలి. సాఫ్ట్ గా మారిన తర్వాత ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్, 5 చుక్కల రోజ్ మేరీ ఆయిల్, 5 చుక్కల ఆల్మండ్ ఆయిల్ కలపాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసిన తర్వాత మెత్తటి పేస్ట్ తయారు చేసుకోవాలి.

స్టెప్ 4

ఇప్పుడు జుట్టుని చిక్కులు లేకుండా.. దువ్వుకోవాలి. చిన్న చిన్న పాయలుగా విడదీసుకోవాలి. జుట్టు చిట్లిపోకుండా.. నెమ్మదిగా చిక్కు తీసుకోవాలి.

స్టెప్ 5

ఇప్పుడు తయారు చేసుకున్న హెయిర్ ప్యాక్ ని జుట్టుకి బాగా పట్టించాలి. జుట్టు మొత్తం, స్కాల్ప్ కి ఈ మాస్క్ అందేలా బాగా పట్టించాలి.

స్టెప్ 6

స్కాల్ప్ ని 5నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి. దీనివల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఇప్పుడు జుట్టుని కట్టుకుని షవర్ క్యాప్ పెట్టుకోవాలి.

స్టెప్ 7

గంట సేపు ఈ ప్యాక్ ని అలా వదిలేసి.. గంట తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. తర్వాత కండిషనర్ చేసుకోవాలి. ఈ మాస్క్ ని నెలకు రెండుసార్లు అప్లై చేస్తే.. అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.

English summary

Can Tulsi Save Your Rapidly Falling Hair?

Can Tulsi Save Your Rapidly Falling Hair? Tulsi hair mask is probably the best thing that can happen to your hair!
Please Wait while comments are loading...
Subscribe Newsletter