For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెల్లజుట్టు నివారించి, బ్లాక్ గా మార్చే ఫర్ఫెక్ట్ హెయిర్ ఆయిల్ : ఆముదం.!

|

ఆముదం, ఆముదం నూనె గురించి మీకు తెలుసా? ఈ కాలంలో చర్మంతోపాటూ జుట్టుకు సంబంధించిన రకరకాల సమస్యలు ఇబ్బంది పెడతాయి. అలాంటివన్నీ దూరమై మృదువైన శిరోజాలు సొంతం కావాలంటే... ఆముదం వల్లే సాధ్యం. భారతదేశంలో ఆముదము నూనె క్రీ.పూ. 2000 నుండి ఉపయోగంలో ఉంది. క్యాస్టోర్ ఆయిల్ (ఆముదం)ఒక నేచురల్ ప్లాంట్ ఆయిల్ ఆముదం మొక్క నుండి వచ్చిన విత్తనాల నుండి నూనెను తయారుచేస్తారు. ఇందులో రిసినోలిస్ యాసిడ్ సంవృద్ధిగా ఉంటుంది, ఇది యాంటీఇన్ఫ్లమేటరి, యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఒక అందమైన శరీరానికి దోహదం చేస్తుంది.

ఆముదం నూనెను ప్రాచీన కాలం నుండి వివిధ రకాలుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. ఈ నూనెలో ప్రయోజనాలు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ బ్యాక్టారియల్, యాంటా ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అన్ని రకాల జుట్టు సమస్యలను నివారిస్తుంది. ఆముదం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంది. అందేకు ఈ నూనె అన్ని రకాల జుట్టు సమస్యలను గ్రేట్ గా నివారిస్తుంది. చుండ్రు, డ్రై హెయిర్, జుట్టు చివరల్లు చిట్లడం మరియు బట్టతల ను కూడా నివారించడంలో ఆముదం గ్రేట్ గా సహాయపడుతుంది. ఆముదం నూనెలో ఉండే ప్రోటీన్స్, మరియు మినిరల్స్ హెల్తీ హెయిర్ పొందడానికి బూస్ట్ లా పనిచేస్తుంది.

ఆముదంలో ఉండే రిసినోలిక్ యాసిడ్ హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది. ఇది తలలో పిహెచ్ లెవల్ ను బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే తలలో నేచురల్ ఆయిల్స్ కోల్పోకుండా సహాయపడుతుంది. డల్ మరియు డ్యామేజ్ హెయిర్ ను నివారించడంలో ఇది ఒక బెస్ట్ ఆయిల్. ఆముదం నూనెలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ జుట్టుకు నేచురల్ షైనింగ్ మరియు స్ట్రాంగ్ నెస్ ను అందిస్తుంది. అందువల్లే, ఆముదం నూనె అనేక జుట్టు సమస్యలను ఎదుర్కోగలుగుతుంది. ఇలాంటి ఆముదంను రెగ్యులర్ గా తలకు అప్లై చేయడం వల్ల పొందే అనేక ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

1. తెల్ల జుట్టు నివారిస్తుంది:

1. తెల్ల జుట్టు నివారిస్తుంది:

తెల్ల జుట్టు నివారించుకోవడానికి ఆముదం గ్రేట్ గా సహాయపడుతుంది. ఆముదంను రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే తెల్ల జుట్టును నివారిస్తుంది, ఇక ముందు జుట్టు తెల్లగా మార్చకుండా చేస్తుంది. జుట్టును బ్లాక్ గా మార్చుతుంది.

2.జుట్టు రాలడం అరికడుతుంది:

2.జుట్టు రాలడం అరికడుతుంది:

ఆముదం నూనె జుట్టు రాలడాన్ని అరికట్టి మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో బెస్ట్ హోం రెమెడీ . ఉత్తమ ఫలితాలను పొందడానికి వారానికొకసారి ఆముదంను తలకు పట్టించాలి.జుట్టు బాగా రాలుతున్నప్పుడు ఇలా చేయొచ్చు... నాలుగు చెంచాల చొప్పున కొబ్బరినూనె, ఆముదం సమపాళ్లలో తీసుకుని అందులో నాలుగు చుక్కల నిమ్మరసం, గుడ్డులోని తెల్ల సొన కలిపి... తలకు పూతలా వేసుకోవాలి. ఓ గంటయ్యాక గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేస్తే....జుట్టు రాలకుండా ఉంటుంది.

3. జుట్టు బ్రేక్ కాకుండా చేస్తుంది:

3. జుట్టు బ్రేక్ కాకుండా చేస్తుంది:

బ్రిటిల్ హెయిర్ చూడటానికి అందంగా కనబడదు, తెగిన జుట్టు ఉన్న అందాన్ని కూడా పాడుచేస్తుంది. కాబట్టి, ఆముదం నూనెను తలకు మొత్తానికి అప్లై చేస్తుంటే జుట్టు స్ట్రాంగ్ గా మార్చుతుంది.

4.జుట్టు చిట్లకుండా చేస్తుంది:

4.జుట్టు చిట్లకుండా చేస్తుంది:

ఆముదం నూనె జుట్టు చిట్లకుండా చేస్తుంది. తలకు ఆముదం నూనెను అప్లై చేసినప్పుడు ఇది హెయిర్ క్యూటికల్స్ వరకూ చేరి, తలకు డీప్ కండీషర్ గా మరియు జుట్టును సాఫ్ట్ అండ్ షైనీగా మార్చుతుంది. తలకు ఈ నూనె అప్లై చేయడానికి ముందు గోరువెచ్చగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

5. చుండ్రు నివారిస్తుంది:

5. చుండ్రు నివారిస్తుంది:

ఆముదంనూనెలో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అంతే కాదు ఆముదం నూనెను రెగ్యులర్ గా తలకు పట్టించడం వల్ల తలలో దురద, బట్టతలను నివారిస్తుంది. చుండ్రు నివారించడంలో ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ...

6. తలలో ఇన్ఫెక్షన్ నివారిస్తుంది:

6. తలలో ఇన్ఫెక్షన్ నివారిస్తుంది:

తలలో ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ నివారించడంలో ఆముదం నూనె గ్రేట్ గా సహాయపడుతుంది . ఆముదం నూనెను రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే ఇన్ఫెక్షన్స్ నివారించబడుతాయి.

7. డల్ హెయిర్ ను హెల్తీగా..షైనీగా మార్చుతుంది:

7. డల్ హెయిర్ ను హెల్తీగా..షైనీగా మార్చుతుంది:

పొడవుగా ఉండే జుట్టు చూడటానికి కొద్దిగా డల్ గానే కనిపిస్తుంది, పొడవు జుట్టుకు ఆముదం నూనెను అప్లై చేయడం వల్ల ఇందులో ఉండే న్యూట్రీషియన్స్ జుట్టును స్మూత్ గా మరియు షైనీగా మార్చుతుంది. ఈ నూనెను తలస్నానానికి ముందు ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆముదం ఉపయోగించిన తర్వాత హెయిర్ సెరమ్ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.

8. డ్రై హెయిర్ నివారిస్తుంది:

8. డ్రై హెయిర్ నివారిస్తుంది:

డ్రై హెయిర్ చూడటానికి చాలా అద్వాన్నంగా కనిపిస్తుంది, కాబట్టి, జుట్టుకు మాయిశ్చరైజర్ అవసరమవుతుంది. ఆముదం నూనెలో ఉండే పోషకాంశాలు జుట్టుకు మంచి కండీషనర్ ను అందిస్తుంది. తిరిగి డ్రైనెస్ పెరగకుండా నివారిస్తుంది.

9. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

9. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

ఆముదం నూనెలో రిసినోలిక్ యాసిడ్ మరియు ఓమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ తలలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది . దాంతో జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది జుట్టుకు పోషణను మరియు హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మార్చడంలో గ్రేట్ గా సహాయడపుతుంది. అందుకు కొబ్బరి నూనె మరియు ఆముదం నూనెను సమయంగా తీసుకొని, గోరువెచ్చగా చేసి తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

10. జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది:

10. జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది:

ఆముదం నూనెలో ఓమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఓమేగా 9 ఫ్యాటీయాసిడ్స్ ఉండటం వల్ల, ఈ రెండా హెల్త్ హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది. రెగ్యులర్ గా దీన్ని ఉపయోగించడం వల్ల ఆముదం నూనె కొత్తగా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరగడంతో పాటు, బ్యూటీఫుల్ గా మరియు షైనీగా ఉంటుంది.

English summary

Castor Oil Can Make Your Hair Perfect! Find Out How!

Taking care of your hair has never been more difficult, especially these days when all of us are so busy. But, you just need one ingredient, and that is castor oil, to be able to solve all of your hair dilemmas.
Story first published:Saturday, October 22, 2016, 12:42 [IST]
Desktop Bottom Promotion