For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రై హెయిర్ ను సాప్ట్ గా మార్చే కోకనట్ మిల్క్-అలోవెర జ్యూస్

|

ప్రతి మహిళకు ఆరోగ్యకరమైన నిగనిగలాడే జుట్టు ఉండాలనుకుంటారు. అది వారి డ్రీమ్ కూడా..సాధారణంగా శిరోజాల సంరక్షణకు వాడాల్సిన షాంపూ, కండీషనర్, చివర్లు చిట్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఆలోచిస్తాం. తలస్నానం చేసి, మంచి హెయిర్ కండిషనర్ ను ఉపయోగించినా కూడా ఫలితం ఉండదు. రెండు రోజులకే జుట్టు పొడిబారిపోతుంటుంది. కాస్త తడిగా ఉన్నప్పుడే జుట్టుకు కండీషనర్ రాసుకోవడం మంచిది. మీ జుట్టుకు ఈ కండీషనర్ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.

మనలో చాలా మంది దాదాపు 60శాతం మందిలో రఫ్ మరియు డ్రై హెయిర్ సమస్యతో బాధపడుతున్నారు. రఫ్ హెయిర్ ఎప్పుడు బ్రేక్ అవుతుంటుంది. కొందరికి జుట్టు పీచులా తయారయ్యి జీవం లేనట్లు నిర్జీవంగా కనపడుతుంది. జుట్టు పీచులా జీవం లేనట్టు అయ్యిందంటే వెంట్రుకలు ఎక్కువగా చిట్లిపోయి ఉన్నాయని అర్థం. ఎండలు, కాలుష్యం, షాంపూలు, బ్లో డ్రైయ్యింగ్, స్ట్రెయిటనింగ్, కలరింగ్ ... వంటివన్నీ జుట్టును దెబ్బతీసేవే! హెయిర్ స్టైలింగ్‌లోనూ, దువ్వడంలోనూ వెంట్రుకలు సులువుగా దెబ్బతింటాయి. అంతే కాదు వీటితో పాటు హానికరమైన కెమికల్స్ మరియు స్ట్రెస్ ఫుల్ లైఫ్ స్టైల్ మరియు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నావి. కాబట్టి వీటన్నింటికి దూరంగా ఉండటం మంచిది.

రఫ్ హెయిర్ ను నివారించుకోవడం కోసం కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. రఫ్ హెయిర్ ను నివారించుకోవడానికి ఈ హోం రెమెడీస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. రఫ్ హెయిర్ నివారించుకోవడానికి హోం మేడ్ రిసిపి కావల్సినవవి, తయారీ మరియు ఉపయోగించే విధానం గురించి తెలుసుకుందాం..

కావల్సిన పదార్థాలు:

కావల్సిన పదార్థాలు:

అలోవెర జెల్

కొబ్బరి నూనె

కోకనట్ మిల్క్

తయారుచేయు విధానం:

తయారుచేయు విధానం:

అలోవెర జెల్ ను ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుని అందులో కొబ్బరి నూనె మరియు కోకనట్ మిల్క్ మిక్స్ చేసి ఉండలు లేకుండా స్మూత్ గా మిక్స్ చేయాలి. కొబ్బరి నూనె జుట్టుకు మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. ఈ మిశ్రమాన్ని తలకు అప్లూ చేసి షవర్ క్యాప్ ను పెట్టుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ ను అరగంట అలాగే వదిలేసి, తర్వాత కండీషనర్ తో అప్లై చేయాలి. ఇది రఫ్ హెయిర్ కు షాంపులా పనిచేస్తుంది.

హోం మేడ్ హెయిర్ మాస్క్ రిసిపి వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు

హోం మేడ్ హెయిర్ మాస్క్ రిసిపి వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు

జుట్టు సాఫ్ట్ గా మారుతుంది: ఈ హోం మేడ్ రిసిపి వల్ల జుట్టు సాఫ్ట్ గా, న్యూరిస్అవుతుంది.

అమినో యాసిడ్స్ ఎక్కువ:

అమినో యాసిడ్స్ ఎక్కువ:

ఈ హెయిర్ మాస్క్ వల్ల అలోవెర జెల్ లోని అమినో యాసిడ్స్ మరియు ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి. ఇది జుట్టుకు మాయిశ్చరైజర్ ను అందిస్తుంది.

డీప్ గా కండీషనర్ గా పనిచేస్తుంది:

డీప్ గా కండీషనర్ గా పనిచేస్తుంది:

అలోవెర జెల్ డీప్ కండీషనర్ గా పనిచేస్తుంది. జుట్టును స్ట్రాంగ్ గా మార్చుతుంది.

విటమిన్స్ మరియు మినిరల్స్ ఎక్కువ

విటమిన్స్ మరియు మినిరల్స్ ఎక్కువ

కోకనట్ మిల్క్ లో ఉండే విటమిన్స్ మరియు మినిరల్స్ ఎక్కువ కాబట్టి, అన్ని రకాల హెయిర్ ప్రాబ్లెమ్స్ ను నివారిస్తుంది. కొబ్బని రూనె నేచురల్ కండీషనర్ గా పనిచేస్తుంది.

జుట్టు మరింత స్మూత్ గా మరియు షైనీగా మారతుుంది.

జుట్టు మరింత స్మూత్ గా మరియు షైనీగా మారతుుంది.

ఈ హెయిర్ మాస్క్ ను రెగ్యురల్ గా ఉపయోగించడం వల్ల జుట్టు మరింత స్మూత్ గా మరియు షైనీగా మారతుుంది. డ్రై హెయిర్ నివారించడానికి ఫర్ఫెక్ట్ హోం రెమెడీ.

English summary

Coconut Milk And Aloe Vera For Smooth Hair

Do you know that most of the remedies to your beauty-related problems lie in your kitchen? So, try using these all-natural ingredients to treat your rough hair. And trust us, your hair would be thanking you!
Story first published: Saturday, August 20, 2016, 11:45 [IST]
Desktop Bottom Promotion