తెల్లజుట్టు సమస్యకి పర్మనెంట్ సొల్యూషన్..!

కేవలం రెండు పదార్థాలను ఉపయోగించి.. తెల్లజుట్టుని పర్మనెంట్ గా నివారించవచ్చు. కొబ్బరినూనె, నిమ్మరసం. ఈ రెండింటిలోనూ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. జుట్టుని అందంగా మారుస్తాయి. జుట్టు తెల్లబడటాన్ని అరికడతాయి.

Posted By:
Subscribe to Boldsky

20లలోనే తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బందిపడుతున్నారా ? అయితే వెంటనే మీ జుట్టుపై శ్రద్ధ తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. హానికారక కెమికల్స్ ఉండే ప్రొడక్ట్స్ ని వదిలేసి.. ఎఫెక్టివ్, హెయిర్ ఫ్రెండ్లీ హోం రెమిడీస్ వాడటం మొదలుపెట్టాలి.

జుట్టు ఆరోగ్యానికి మెలనిన్ చాలా అవసరం. మెలనిన్ యాక్టివ్ గా లేకపోవడానికి చాలా కారణాలున్నాయి. వయసు, జెనెటిక్ ప్రిడిస్ పొజిషన్, హార్మోనల్ ఫ్లక్చువేషన్, టాక్సిక్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్, యూవీ కిరణాలు, ఒత్తిడి వంటి రకరకాల కారణాల వల్ల జుట్టు తెల్లబడుతుంది.

Coconut Oil + Lemon Juice = Goodbye Gray Hair!

కేవలం రెండు పదార్థాలను ఉపయోగించి.. తెల్లజుట్టుని పర్మనెంట్ గా నివారించవచ్చు. కొబ్బరినూనె, నిమ్మరసం. ఈ రెండింటిలోనూ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. జుట్టుని అందంగా మారుస్తాయి. జుట్టు తెల్లబడటాన్ని అరికడతాయి.

కొబ్బరినూనెలో ల్యూరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది స్కాల్ప్ ని క్లెన్స్ చేసి.. రక్తప్రసరణ మెరుగ్గా సాగడానికి సహాయపడుతుంది. అలాగే కొత్త జుట్టు ఏర్పడటానికి సహాయపడుతుంది. అలాగే నిమ్మరసంలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటుంది. ఇవి జుట్టుని హైడ్రేట్ చేస్తాయి. పోషణ అందిస్తాయి.

స్టెప్ 1

2 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెను ఒక గిన్నెలో తీసుకోవాలి. ఒకవేళ మీ జుట్టు పొడవుగా, చాలా ఎక్కువగా ఉంటే.. ఎక్కువ మోతాదులో తీసుకోవచ్చు.

స్టెప్ 2

నిమ్మకాయను రెండుగా కట్ చేసి.. రసం తీసి.. కొబ్బరినూనెలో కలపాలి.

స్టెప్ 3

ఫోర్క్ ఉపయోగించి.. రెండింటినీ బాగా మిక్స్ చేయాలి. ఈ రెండూ బాగా కలిసేంతవరకు.. బాగా కలుపుతూ ఉండాలి.

స్టెప్ 4

జుట్టుని సన్నని పాయలుగా విడదీసి.. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కి, జుట్టు మొత్తానికి పట్టించాలి. చేతివేళ్లతో సున్నితంగా మసాజ్ చేయాలి.

స్టెప్ 5

ఈ మిశ్రమం జుట్టుకి గంటసేపు ఉండాలి. తర్వాత.. షాంపూ, కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. ఈ రెమెడీని కనీసం వారానికి ఒకసారి ఫాలో అయితే.. ఎఫెక్టివ్ ఫలితాలు పొందవచ్చు.

English summary

Coconut Oil + Lemon Juice = Goodbye Gray Hair!

Coconut Oil + Lemon Juice = Goodbye Gray Hair! Bid adieu to grey hair permanently with just two ingredients!
Please Wait while comments are loading...
Subscribe Newsletter