జుట్టు వేగంగా..పొడవుగా..ఒత్తుగా పెరగడానికి క్యారెట్ హెయిర్ మాస్క్ ..!

క్యారెట్ లో విటమిన్ ఇ, పొటాషియం, ఫాస్పరస్ లు కూడా అధికంగా ఉన్నాయి. ఇది ఫ్రీరాడికల్స్ డ్యామేజ్ ను నివారిస్తుంది. ఆక్సిజన్ సప్లై ను పెంచుతుంది. దాంతో జుట్టుకు సరిపడా పోషకాలు అందడంతో జుట్టు స్ట్రాంగ్ గా

Posted By:
Subscribe to Boldsky

క్యారెట్ తింటే ఆరోగ్యానికి మంచిదని చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల పిల్లలకు క్యారెట్ తినడం అలవాటు చేస్తుంటారు. క్యారెట్లో విటమిన్ ఎ, కెరోటిన్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి, ఇవి కంటి చూపును మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. ఒక్క హెల్త్ కు మాత్రమే కాదు, బ్యూటీకి కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. క్యారెట్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అందుకోసం ఎక్సపర్ట్, బ్యూటీ ప్యార్లర్ల వరకూ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే స్వయంగా మీరే తయారుచేసుకోవచ్చు. మొదట క్యారెట్ లో ఉన్న లక్షణాలు, గుణగణాల గురించి తెలుసుకుందాం... ఇది జుట్టుకు ఏవిధంగా పనిచేసుకుందామో తెలుసుకుందాం..

క్యారెట్ లో పవర్ ఫుల్ పంచ్ విటమిన్ ఎ, కె, మరియు సిలు అత్యధికంగా ఉన్నాయి. ఇది డ్యామేజ్ అయిన హెయిర్ ఫాలీసెల్స్ ను రిపేర్ చేస్తుంది. కొత్తగా హెయిర్ ఫాలీసెల్స్ ను ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.

ఇందులో విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ బి1 , బి2, బి3 మరియు బి6లు అత్యధికంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా జుట్టుకు మాయిశ్చరైజింగ్ ను అందిస్తాయి, చిక్కును విడిపిస్తుంది, జుట్టుకు తేమను, షైనింగ్ ను అందిస్తుంది.

DIY Carrot Hair Mask For Faster Hair Growth!

ఇంకా , ఇందులో బీటాకెరోటిన్ , విటమిన్ సి లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది. క్యూటికల్స్ ను సీల్ చేస్తుంది. ఇక ముందు జుట్టు బ్రేక్ అవ్వకుండా నివారిస్తుంది.

క్యారెట్ లో విటమిన్ ఇ, పొటాషియం, ఫాస్పరస్ లు కూడా అధికంగా ఉన్నాయి. ఇది ఫ్రీరాడికల్స్ డ్యామేజ్ ను నివారిస్తుంది. ఆక్సిజన్ సప్లై ను పెంచుతుంది. దాంతో జుట్టుకు సరిపడా పోషకాలు అందడంతో జుట్టు స్ట్రాంగ్ గా పెరుగుతుంది.

ఇన్ని సుగుణాలున్న క్యారెట్ ను సింపుల్ గా జుట్టు సంరక్షణకు, పెరుగుదలకు ఏవిధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం...

స్టెప్ 1 :

అరటిపండు తీసుకుని స్మూత్ గా పేస్ట్ లా చేసుకోవాలి. అరటి పండులో జుట్టుకు సహాయపడే పోషకాలు అధికంగా ఉన్నాయి. ఇవి జుట్టుకు కొన్ని అద్భుతమైన మార్పులను తీసుకొస్తుంది.

స్టెప్ 2 :

ఒక క్యారెట్ తీసుకుని తొక్క తొలగించి, జుట్టు పొడవు , మందాన్ని బట్టి తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

స్టెప్ 3 :

ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా క్యారెట్ జ్యూస్, అరటిపండు పేస్ట్ , ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, పెరుగు, వేసి మొత్తం కలిసేలా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ మరీ చిక్కగా లేదా మరీ పల్చగా లేకుండా చూసుకోవాలి. మీడియంగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే తలకు అప్లై చేసి, తొలగించడానికి సులభమవుతుంది.

స్టెప్ 4 :

ఎక్స్ ట్రా పోషణ కోసం, కొన్ని చుక్కల రోజ్మెర్రీ ఆయిల్ ను మిక్స్ చేయాలి. రోజ్మెర్రీ ఆయిల్లో ఉండే గుణాలు, జుట్టుకు మంచి కండీషనర్ గా పనిచేస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

స్టెప్ 5 :

తర్వాత జుట్టును చిక్కులేకుండా దువ్వి, ఈ పేస్ట్ ను తలకు , జుట్టు పొడవునా అప్లై చేయాలి. ఇలా చేయడ వల్ల జుట్టు మరింత డ్యామేజ్ కాకుండా ఉంటుంది.

స్టెప్ 6 :

ఈ పేస్ట్ ను అప్లై చేయడానికి బ్రష్ ఉపయోగిస్తే జుట్టుకు మొత్తానికి సమంగా అంటుతుంది. దీన్ని సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేయాలి.

స్టెప్ 7 :

హెయిర్ మాస్క్ వేసుకున్న ఒక గంట తర్వాత మన్నికైన రెగ్యులర్ గా వాడే షాంపుతో తలస్నానం చేసుకోవచ్చు. కండీషనర్ కూడా ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల జుట్టు వేగంగా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.

English summary

DIY Carrot Hair Mask For Faster Hair Growth!

Carrot does not just improve your eyesight, but also your hair growth. We don't say it, experts do. Before you rush to the kitchen concocting your own carrot hair mask, let us take some time and first understand the properties of carrot and how it works on our hair.
Please Wait while comments are loading...
Subscribe Newsletter