For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరుగు, అరటిపండు హెయిర్ ప్యాక్ తో స్ట్రెయిట్ హెయిర్ మీ సొంతం..

By Super Admin
|

స్ట్రెయిట్ అండ్ స్మూత్ హెయిర్ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు . స్ట్రెయిట్ హెయిర్ ట్రెండీగా, నీట్ గా కనబడుతుంది. స్ట్రెయిట్ హెయిర్ ఈ మద్యకాలంలో బాగా ఫేమస్ అయింది . చాలా మంది అమ్మాయిలు స్ట్రెయిట్ హెయిర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే సలూన్స్ లో స్ట్రెయిట్ హెయిర్ కోసం ఉపయోగించే పదర్థాలు చాలా కఠనంగా ఉండటం వల్ల జుట్టుకు హాని కలిగిస్తాయి. జుట్టుకు పర్మనెంట్ గా డ్యామజ్ కలిగిస్తుంది. ఇలా సూన్ లో చేయించుకునే స్ట్రెయిట్ హెయిర్ శాశ్వతం కాదు , కేవలం ఒక సంవత్సరం మాత్రమే ఉంటుంది . కాబట్టి, ఇలాంటి తాత్కలికమైన మార్పును మనం ఇంట్లోనే ప్రయత్నించవచ్చు. స్ట్రెయిట్ హెయిర్ కు పెరుగు సహాయపడుతుంది.

సహజంగా ఇంట్లో స్టెయిర్ హెయిర్ పద్ధతులను ఉపయోగించేటప్పుడు, హీట్ స్టైలింగ్ టూల్స్ ఉపయోగిస్తుంటాము. అయితే బ్లో డ్రయ్యర్, లేదా స్ట్రెయినటనర్ ను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుంది.జుట్టు చిట్లడం, లేదా తెగిపోవడం జరుగుతుంది . జుట్టుకు మంచి షైనింగ్ పొందడానికి బదులు, నిర్జీవంగా తయారవుతుంది . అందువల్ల మనం ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకునే హెయిర్ ప్యాక్ తో స్ట్రెయిట్ హెయిర్ ను నేచురల్ గా పొందవచ్చు.

Natural Way To Straighten Hair Using Curd And Banana

అలాగే మార్కెట్లో వివిధ రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నవి ఖరీదైనవి, మరియు కెమికల్స్ తో తయారుచేసినవి, ఇవి జుట్టును మరింత డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి, మన ఇంట్లో సహజసిద్దంగా ఉండే పెరుగును ఉపయోగించి స్ట్రెయిట్ ఎయిర్ ను ఎందుకు ట్రై చేయకూడదు? స్ట్రెయిట్ హెయిర్ పొందడానికి ఇంట్లో తయారుచేసుకునే హోం మేడ్ హెయిర్ ప్యాక్...
Natural Way To Straighten Hair Using Curd And Banana

కావల్సినవి:

పెరుగు: 1కప్పు
అరటిపండ్లు: 2
తేనె: 2టేబుల్ స్పూన్లు

తయారుచేయు పద్ధతి
అరటిపండును మెత్తగా గుజ్జులా స్పూన్ తో కలుపుకోవాలి, అరటిపండు ఉండలు లేకుండా కలుపుకోవాలి. బాగా మగ్గిన పండు తీసుకుంటే పేస్ట్ సాప్ట్ గా ఉంటుంది. ఇప్పుడు అరటిపండు గుజ్జులో పెరుగు, తేనె మిక్స్ చేయాలి. మొత్తం మిశ్రమం బాగా కలిసేలా చేత్తో లేదా స్పూన్ తో మిక్స్ చేయాలి. అంతే స్ట్రెయిట్ హెయిర్ కోసం నేచురల్ హెయిర్ ప్యాక్ రెడీ..

Natural Way To Straighten Hair Using Curd And Banana

ఈ హెయిర్ ప్యాక్ ను తలకు , కేశాలకు పూర్తిగా అప్లై చేయాలి. తర్వాత షవర్ క్యాప్ పెట్టుకొని, ఒక గంట తర్వాత రెగ్యులర్ షాంపు మరియు కండీషనర్ తో తలస్నానం చేయాలి.

నేచురల్ గా కర్లీ హెయిర్ ఉన్నవారికి ఈ హెయిర్ ప్యాక్ పనిచేయకపోవచ్చు. ఈ హెయిర్ ప్యాక్ చిక్కుడిన జుట్టు, మాయిశ్చరైజింగ్ కోల్పోయిన జుట్టుకు మాత్రమే పనిచేస్తుంది. కర్లీహెయిర్ కు అప్లై చేసినా కూడా, జుట్టు మంచి షైనింగ్ తో హెల్తీగా కనబడుతుంది.

English summary

DIY Natural Way To Straighten Hair Using Curd And Banana

There are also several products available in the market to miraculouslystraighten the hair. While these products do work, they can be extremelyexpensive, and are full of chemicals, which would obviously damage thehair too. So, wouldn't it be amazing to know of a way to straighten hairnaturally at home using a safe ingredient like yogurt?
Story first published: Friday, August 26, 2016, 18:04 [IST]
Desktop Bottom Promotion