For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉప్పుతో తలలో చుండ్రు మాయం..!

|

తల (మాడు) నుంచి చాలా సందర్భాల్లో తెల్లరంగులోనూ, కొందరిలో ఒకింత పసుపురంగులోనూ రాలే పొలుసులను చుండ్రు అంటారు. దీని బాధను అనుభవించేవారికీ, చూసేవారికి కూడా ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య. సామాజికంగా ఇబ్బందికరమైన ఈ సమస్యనుంచి విముక్తి పొందడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు కాబట్టే చుండ్రును అరికడతాయని చెప్పే అనేక ఉత్పాదనలు, షాంపూలు దొరుకుతున్నాయి.

చుండ్రు ఎందుకు వస్తుంది? తల (మాడు) పైన ఉండే చర్మం అనుక్షణం పాత కణాలను వదిలించుకొని కొత్త కణాలను పొందుతుంటుంది. ఈ క్రమంలో పొలుసులు, పొలుసులుగా చర్మకణాలు తెల్లగా పొట్టులాగా రాలిపోతూ ఉంటాయి. ఇక కొందరిలో యుక్తవయసుకు వచ్చే సమయంలో హార్మోన్లలో వచ్చే మార్పుల వల్ల చర్మంపై తేమను కలిగించేందుకు నూనె వంటి ద్రవాన్ని స్రవించే సెబేషియస్ గ్రంధుల నుంచి స్రావాలు ఎక్కువగా వస్తుంటాయి. దాంతో అక్కడి వాతావరణం కాస్త జిడ్డుగా మారిపోతుంది.

DIY Salt Scrub For Dandruff

ఇలాంటి సందర్భాల్లో అక్కడ మలసేజియా ఫర్‌ఫర్ అనే ఫంగస్ అభివృద్ధి చెందుతుంది. మాడుపై జిడ్డుజిడ్డుగా ఉండే వాతావరణం దాని పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. దాంతో చుండ్రు వీళ్లలో గ్రీజ్‌లా గోళ్లలోకి వస్తుంటుంది. కొందరిలో ఇది తెల్లగా కాకుండా ఒకింత పసుపు రంగులోనూ ఉండవచ్చు. ఇక కొందరు తలను అంత పరిశుభ్రంగా ఉంచుకోరు. చాలారోజులకొక సారి తలస్నానం చేస్తుంటారు. ఇక కొందరు ఎక్కువగా ఆటలాడుతూ, వ్యాయామం చేస్తూ ఉండి కూడా తల నుంచి ఎక్కువగా చెమట కారుతున్నా తలస్నానం చేయరు.

ఒకటికి రెండు సార్లు తలస్నానం చేస్తే చుండ్రును తగ్గిపోతుందని చాలా మంది భావిస్తారు. కానీ, అలా చేయడం వల్ల జుట్టు మరింత డ్రైగా మారి, చుండ్రు తీవ్రమవుతుంది. కాబట్టి సాల్ట్ స్ర్కబ్ ను ఉపయోగించి చుండ్రును తొలగించుకోవచ్చు. అయితే దానికంటే ముందుగా మీ తలలోని స్కిన్ డ్రైస్కిన్నా...ఆయిల్ స్కిన్నా అని తెలుసుకోవాలి. చర్మ తత్వాన్ని బట్టి కూడా చుండ్రు ఏర్పడుతుంది. సాధారణంగా డ్రై స్కిన్ ఉన్న వారిలో చుండ్రు ఏర్పడుతుందని భావిస్తుంటారు, కానీ ఇది నిజం కాదు, డ్రై డాండ్రఫ్ ను నివారించుకోవడం సులభం, అయితే ఆయిల్ డాండ్రఫ్ తలలో ఎక్కువగా సెబమ్ ఉత్పత్తి కావడం వల్ల ఏర్పడుతుంది.

DIY Salt Scrub For Dandruff

ఆయిల్ స్కిన్ వల్ల ఏర్పడే డాండ్రఫ్ , డ్రెస్ మీద రాలకుండా ఉంటుంది. అదే డ్రై స్కిన్ వల్ల వచ్చే చుండ్రు మీద రాలుదుంది. చుండ్రును నివారించుకోవడానికి సాల్ట్ స్ర్కబ్ గ్రేట్ గా సహాయపడుతుంది. మార్కెట్లో అందుబాటులో ఉండే వివిధ రకాల షాంపులు కెమికల్స్ తో తయారుచేయబడి ఉంటాయి. ఇలాంటి సాంపులు ఉపయోగించిన తర్వాత కూడా ఎలాంటి ప్రయోజనం కనబడదు. తలలో మెండిగా మారిన చుండ్రును నివారించుకోవడానికి కేవలం మార్కెట్లో లభించే షాంపులతో తలన్నానం చేస్తే సరిపోదు. తలస్నానికి ముందు స్ర్కబ్బింగ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతుంది. దాంతో చుండ్రు సులభంగా నివారించబడతుంది. చుండ్రును నివారణకు సాల్ట్ స్ర్కబ్ గ్రేట్ గా సహాయపడుతుంది.

కావల్సిన పదార్థాలు:
టేబుల్ సాల్ట్ కొద్దింగా
రెగ్యులర్ షాంపు

DIY Salt Scrub For Dandruff

అప్లై చేసే విధానం:
కొద్దిగా షాంపును చేతిలోకి తీసుకుని, షాంపుమీద కొద్దిగా సాల్ట్ ను చిలకరించాలి. ఎక్కువగా ఉంటే సాల్ట్ ఎక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమం తలకు అప్లై చేయాలి. జుట్టు పొడవునా అప్లై చేయాల్సినవసరం లేదు, కేవలం తలకు మాడకు పట్టిస్తే సరిపోతుంది. తర్వాత తలలో స్క్రబ్ చేయాలి. షాంపు విత్ సాల్ట్ సున్నితంగా స్ర్కబ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతుంది. చుండ్రు సమస్య నివారించుకోవచ్చు.

5 నుండి 10 నిముషాలు స్క్రబ్ చేసిన తర్వాత రెగ్యులర్ షాంపు మరియు కండీషనర్ తో తలస్నానం చేయాలి. ఇలా చుండ్రు వదిలే వరకూ వారానికొకసారి క్రమం తప్పకుండా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

English summary

DIY Salt Scrub For Dandruff

Now, dandruff is not a serious health problem nor does it signal poor hygiene, although most people seem to associate having dandruff with poor hygiene. There are scrubs that you could prepare with the use of salt to treat dandruff.
Story first published:Friday, August 26, 2016, 10:52 [IST]
Desktop Bottom Promotion