For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సర్ ప్రైజ్ : ఒక్క టీస్పూన్ నిమ్మరసంలో అమేజింగ్ హెయిర్ బెనిఫిట్స్

జుట్టు సమస్యలను నివారించడం కోసం హెయిట్ ట్రీట్మెంట్ లో నిమ్మరసాన్ని ఉపయోగించి అనేక హెయిర్ ప్యాక్ లు ఉన్నాయి. కాబట్టి, మీరు కూడా నిమ్మ రసాన్ని జుట్టుకు ఒక బ్లీచింగ్ ఏజెంట్ గా ఉపయోగించుకోవచ్చు. అందుకు, న

|

నిమ్మరసాన్ని జుట్టుకు ఉపయోగించడం శతాబ్దాల కాలం నుండి ఉంది. నిమ్మరసం, చర్మానికి మాత్రమే ఆరోగ్యకరం అనుకొంటున్నారా?అయితే మీరు ఆలోచన తప్పు. నిమ్మకాయ ఉపయోగాలు అనేకం ఉన్నాయి మరియు మారుతుంటాయి కూడా. మరి మీ జుట్టు విషయంలో కూడా, నిమ్మలో అనేక ఉపయోగాలున్నాయి. అయితే మీకు నిమ్మరసాన్ని జుట్టు ఉపయోగించే విధానం మరియు మీ జుట్టుకు సరిపడా తీసుకొనే సరైన నిష్పత్తి ఖచ్చితంగా తెలిసి ఉండాలి.

జుట్టు సమస్యలను నివారించడం కోసం హెయిట్ ట్రీట్మెంట్ లో నిమ్మరసాన్ని ఉపయోగించి అనేక హెయిర్ ప్యాక్ లు ఉన్నాయి. కాబట్టి, మీరు కూడా నిమ్మ రసాన్ని జుట్టుకు ఒక బ్లీచింగ్ ఏజెంట్ గా ఉపయోగించుకోవచ్చు. అందుకు, నిమ్మరసాన్ని ఉపయోగించే విధానాన్ని ఇక్కడ మీకోసం కొన్ని సులభమైన పద్ధతులను అంధిస్తున్నాం. పరిశీలించండి.

చుండ్రునివారణకు- నిమ్మ మరియు ఉప్పు:

చుండ్రునివారణకు- నిమ్మ మరియు ఉప్పు:

ఒక నిమ్మ తొక్కను తీసుకొని సాల్ట్ లో డిప్ చేయాలి. ఈ ఉప్పులో డిప్ చేసిన నిమ్మ తొక్కను తలకు స్ర్కబ్ చేయాలి. డాండ్రఫ్ ను తొలగించడంలో నిమ్మ చాలా ప్రభావంతంగా పనిచేసే ఉత్తమమైన పరిష్కారం. ఇది నేచురల్ గా లభించేటటువంటి పదార్థం కాబట్టి, జుట్టుకు కానీ లేదా తలకు కానీ, కేశాలకు కానీ ఎటువంటి హాని, చీకాకును కలిగించదు. ఒక వేళ మీకు నిరంతరం జిడ్డుగల చుండ్రు ఉంటే, అప్పుడు, మీరు మీ జుట్టుకు నిమ్మ రసాన్ని ఉపయోగించడానికి ఈ పద్దతిని ప్రయత్నించవచ్చు.

జుట్టు రాలడం నివారిచడానికి -నిమ్మ మరియు కొబ్బరి నీళ్ళు:

జుట్టు రాలడం నివారిచడానికి -నిమ్మ మరియు కొబ్బరి నీళ్ళు:

ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నిమ్మ మరియు కొబ్బరి నీళ్ళు తీసుకోవాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి, ఈ నీటి మిశ్రమాన్ని మీ కేశాలకు మరియు తలకు బాగా పట్టించాలి. ఈ నేచురల్ పద్దతి వల్ల జుట్టురాలే సమస్యలు తగ్గుతాయి. నిమ్మ మరియు కొబ్బరి నీళ్ళు మీ కేశాలకు మరియు కేశకణాలకు తగినంత పోషణను అందిస్తాయి.

జిడ్డు జుట్టు నివారణకు :

జిడ్డు జుట్టు నివారణకు :

జుట్టులో జిడ్డును నివారించడానికి నిమ్మరసం గ్రేట్ గా సహాయపడుతుంది. తలలో ఎక్సెస్ ఆయిల్ సమస్యతో బాధపడే వారు కొద్ది నిమ్మరసంను నీళ్ళలో లేదా కొబ్బరి నూనెలో మిక్స్ చేసి కలిపి, తలకు అప్లై చేసిన అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేడయం వల్ల జిడ్డు వదిలిపోతుంది.

షైనీ హెయిర్ కోసం :

షైనీ హెయిర్ కోసం :

ఒక నిమ్మకాయ రసంలో రెండు టేబుల్ స్పూన్ల తేనె మిక్స్ చేసి తలకు అప్లై చేసి, అరగంట తర్వాత తలస్నానం చేయడం వల్ల జుట్టు మెరిసిపోతుంది. తర్వాత తలకు ఏదీ అప్లై చేయకూడదు.

జుట్టు పెరుగుదలకు :

జుట్టు పెరుగుదలకు :

నిమ్మరసంలో కొద్దిగా కొబ్బరి నూనె మిక్స్ చేసి, తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

కేశాలకు నిమ్మ డియోడరెంట్ గా పనిచేస్తుంది:

కేశాలకు నిమ్మ డియోడరెంట్ గా పనిచేస్తుంది:

కొన్ని సార్లు, కొన్ని హెయిర్ ట్రీట్మెంట్స్ తీసుకొన్న తర్వాత కేశాలను నిజంగా కొన్ని కఠినమై చిక్కుముడులు కలిగి ఉంటుంది. ఉదాహరణకు మీరు గుడ్డుతో హెయిర్ ప్యాక్ అప్లై చేస్తే, మీరు అప్పుడు మంచి షాంపూతో తలస్నానం చేసినా కూడా ఆ వాసన మళ్లీ మీరు ఇంకొకసారి తలస్నానం చేసే వరకూ అలాగే ఉంటుంది. కొంత మంది జుట్టు మూలాల్లో చెమట వల్ల కూడా అటువంటి వాసన వస్తుంటుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, నిమ్మ వంటి నేచురల్ డియోడరెంట్ (దుర్గంధనాశని)ను ఉపయోగించాలి.

హెయిర్ రిఫ్రెషనర్ గా :

హెయిర్ రిఫ్రెషనర్ గా :

సైజును బట్టి నిమ్మకాయను లేదా నిమ్మ తొక్కను, ఒక లీటర్ నీటిలో వేసి, బాగా కరిగిపోయే వరకూ పూర్తిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గాలి చొరబడని బాటిల్లో పోసి ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవాలి. మీరు బయటకు వెళ్ళే ప్రతి సారి లేదా మీ కేశాలు అతి దుర్వాసన వస్తున్నప్పుడు ఈ నీటిని మీ కేశాలకు స్ప్రే చేసుకోండి.

నిమ్మ ఒక బ్లీచింగ్ ఏజెంట్:

నిమ్మ ఒక బ్లీచింగ్ ఏజెంట్:

ఒక బౌల్లో నాలుగు నిమ్మకాయల రసాన్ని పిండి. ఈ రసాన్ని మీ కేశాలకు అప్లై చేయాలి. దాని మీద ఏదైనా మాయిశ్చరైజర్ రాయాలి. తర్వాత బయట సూర్య రశ్మిలోనికి వెళ్ళి సూర్య కిరణాలు కేశాలకు తగిలేలా నిలబడాలి. ఒక్క పదిహేను నిముషాలు ఎండలో కూర్చోవడం వల్ల మీ కేశాల రంగు గణనీయంగా కాంతివంతంగా మారడాన్ని గమనించవచ్చు. నిమ్మ మీ కేశాలకు బెస్ట్ నేచురల్ ఏజెంట్ గా ఎల్లప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి నిమ్మకాను ఉపయోగించడం తెలుసుకొని మీ కేశ సౌందర్యాన్ని కాపాడుకోండి...

English summary

How To Use Lemon On Your Hair?

It is surprising just how many things you can find in the kitchen that would somehow solve most of your skin and hair problems. That's how some of the easily available ingredients like lemons can be used to solve your beauty issues. You can use lemons for your hair and find so many benefits from it.
Story first published: Saturday, December 3, 2016, 15:59 [IST]
Desktop Bottom Promotion