తెల్లజుట్టుని నిమిషాల్లో నల్లగా మార్చే అమేజింగ్ సొల్యూషన్..!

తెల్లజుట్టుని నివారించుకోవడానికి.. చాలా రెమిడీస్ ఫాలో అయి ఉంటారు. కానీ.. సరైన సొల్యూషన్ ఇప్పటివరకు పొందలేకపోయారు అంటే.. ఇప్పుడు మీకు చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రెమిడీ అందుబాటులో ఉంది.

Posted By:
Subscribe to Boldsky

20లలో ఉన్నా, 50లలో ఉన్నా జుట్టు తెల్లగా మారిందంటే.. చాలా ఇబ్బందిగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ జుట్టు తెల్లబడటం కామన్. కానీ.. ఈ సమస్య నుంచి త్వరగా బయటపడటం కూడా.. చాలా ముఖ్యం.

grey hair

తెల్లజుట్టుని నివారించుకోవడానికి.. చాలా రెమిడీస్ ఫాలో అయి ఉంటారు. కానీ.. సరైన సొల్యూషన్ ఇప్పటివరకు పొందలేకపోయారు అంటే.. ఇప్పుడు మీకు చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రెమిడీ అందుబాటులో ఉంది.

పొటాటో స్కిన్ లేదా పీల్ లో విటమిన్ ఏ, బి, సి ఉంటాయి. ఇవి.. తలలో చుండ్రుని నివారించడమే కాకుండా.. కొత్త జుట్టు ఏర్పడటానికి సహాయపడుతుంది. ఆలూలో ఐరన్, జింక్, పొటాషియం, క్యాల్షియం కూడా పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంద.ి అలాగే బంగాళదుంపలు న్యాచురల్ గా జుట్టుకి కలర్ ని అందిస్తాయి. తెల్లజుట్టుని నివారించి.. నల్లగా మారుస్తుంది. మరి బంగాళదుంప తొక్కను ఉపయోగించి.. తెల్లజుట్టుని నల్లగా మార్చే సింపుల్ స్టెప్స్.

స్టెప్ 1

6 బంగాళాదుంపలు తీసుకోవాలి. వాటిని శుభ్రం చేసుకుని పొట్టు తీసి.. పక్కన పెట్టుకోవాలి.

స్టెప్ 2

ఒక లీటర్ నీటిని ఒక గిన్నెలో పోసి వేడి చేయాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు.. రెండు కప్పుల శుద్ధమైన నీటిని కలపాలి.

స్టెప్ 3

నీళ్లు బాగా మరిగేటప్పుడు బంగాళాదుంపల తొక్కను కలపాలి. 15 నుంచి 20 నిమిషాలు సన్నని మంటపై ఉడికించాలి.

స్టెప్ 4

ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి.. 15నిమిషాలు అలానే వదిలేయాలి. చల్లారనివ్వాలి. ఇప్పుడు దీనివాసన బాగుండదు. కాబట్టి.. కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ కలిపి.. ఫోర్క్ తో బాగా మిక్స్ చేయాలి.

స్టెప్ 5

జుట్టుకి మామూలుగా చేసుకున్నట్టే షాంపూ, కండిషన్ చేసుకోవాలి. అదనపు నీళ్లన్నీ జుట్టు నుంచి కోల్పోయేలా చేయాలి. టవల్ తో జుట్టుని కట్టుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెన తీసుకుని చిక్కులు లేకుండా దువ్వుకోవాలి.

స్టెప్ 6

బంగాళదుంప తొక్క మిశ్రమాన్ని స్ప్రే బాటిలో తీసుకోవాలి. జుట్టుని చిన్న చిన్న పాయలుగా విడదీసి.. ఆ మిశ్రమాన్ని స్ప్రే చేయాలి. కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి.

స్టెప్ 7

స్కాల్ప్ ని 5 నిమిషాలపాటు మసాజ్ చేయాలి. మరో 10 నిమిషాలు అలానే వదిలేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ న్యాచురల్ రెమెడీని వారానికి రెండు మూడు సార్లు అప్లై చేస్తే.. తెల్లజుట్టు నల్లగా మారుతుంది.

English summary

Leave This Solution On Hair For Five Minutes & Watch How It Turns Your Grey Hair!

Leave This Solution On Hair For Five Minutes & Watch How It Turns Your Grey Hair! So, here is how to remove grey hair naturally with this herbal remedy for grey hair.
Please Wait while comments are loading...
Subscribe Newsletter