For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాత్రంతా జుట్టుకి ఆయిల్ ఉంటే.. జుట్టు పెరుగుతుందా ? రాలుతుందా ?

By Swathi
|

మీరు స్కూల్ కి వెళ్లేటప్పుడు మీ మమ్మీ ఒక కప్పు నిండా ఆయిల్ జుట్టుకి రాసేదని గుర్తుందా ? అంతేకాదు.. ఆ ఆయిల్ దాదాపు వారంపాటు జుట్టుకే ఉండేది. అయితే ఇప్పుడు అన్ని రోజులూ జుట్టుకి ఆయిల్ పెట్టుకోవడం ఇష్టంలేక.. రాత్రి పడుకునే ముందు జుట్టుకి ఆయిల్ అప్లై చేసి.. రాత్రంతా అలానే ఉంచుతారు. ఇది ఎంతవరకు సేఫ్ ? ఇలా రాత్రంతా జుట్టుకి ఆయిల్ ఉంచుకోవడం మంచిదేనా ?

జుట్టు ఆరోగ్యానికి కొబ్బరినూనె ? ఆల్మండ్ ఆయిల్ ? ఏది మంచిది ?

రాత్రంతా ఆయిల్ ఉంచుకోవడం వల్ల జుట్టు హెల్తీగా పెరుగుతుందని చాలామంది భావిస్తారు. కానీ ఇది అపోహ మాత్రమే. జుట్టుకి ఆయిల్ అవసరమే కానీ.. ఎక్కువ మొత్తంలో ఆయిల్ పట్టించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అంటున్నారు బ్యూటీ ఎక్స్ పర్ట్స్. కాకపోతే ఆయిల్ ని జుట్టు కుదుళ్ల వరకు చేరేలా మసాజ్ చేయాలి. స్కాల్ప్ ని బాగా మర్దనా చేయడం అవసరం.

hair oil

కొన్ని స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. ఒకవేళ గోరువెచ్చని ఆయిల్ ఉపయోగిస్తే.. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి జుట్టు హెల్తీగా పెరుగుతుంది. అలాగే రాత్రంతా జుట్టుకి ఆయిల్ ఉంచుకోవడం వల్ల కూడా ఎలాంటి ఫలితం ఉండదు. అంతేకాదు మీది సున్నితమైన చర్మం అయితే.. చర్మ సమస్యలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

జుట్టుకి ఎక్కువ ఆయిల్ ఉంటే.. దాని ద్వారా ముఖంపై మొటిమలు రావడానికి అవకాశాలుంటాయి. అలాగే దిండుకి అంటుకుని.. చర్మ సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఆయిల్ ఎక్కువ మొత్తంలో పెట్టి, ఎక్కువ సమయం ఉండటం వల్ల జుట్టు పెరుగుతుందనే అపోహ నుంచి బయటపడండి. జుట్టు రాలే సమస్య పోషకాహార లోపం వల్ల వస్తుంది. ఆరోగ్యకరమైన డైట్ ఫాలో అయితే జుట్టు హెల్తీగా ఉంటుంది.

hair oil

ఒకవేళ మీరు జుట్టుకి ఎక్కువ ఆయిల్ రాసుకుంటే.. దాన్ని వదిలించడానికి ఎక్కువ షాంపూ ఉపయోగించాలి. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అలాగే జుట్టు కూడా డ్రైగా మారుతుంది. కాబట్టి వారానికి ఒకసారి లేదా రెండు సార్లు ఆయిల్ పెట్టుకుంటే చాలు. అలాగే ఆయిల్ పెట్టుకున్న తర్వాత గంటసేపటికి శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

English summary

Leaving hair oil overnight does not help in hair growth

Leaving hair oil overnight does not help in hair growth. Leaving the hair oil overnight isn’t really going to help either. In fact, it may lead to skin issues for those with oily and sensitive skin.
Story first published:Tuesday, May 31, 2016, 9:51 [IST]
Desktop Bottom Promotion