జుట్టు ఆరోగ్యానికి ఇంట్లో స్వయంగా తయారుచేసుకునే నేచురల్ షాంపులు

మీరు ఉపయోగించే షాంపులు కూడా మీరు అనుకున్న ఫలితాలను అందివ్వకపోతే, క్రమంగా జుట్టు డ్యామేజ్ అవుతుంది.వీటిని మార్చడానికి ఇది ఒక క్లియర్ సంకేతం. ఇలాంటి సమయంలో నేచురల్ షాంపులు బాగా పనిచేస్తాయి.కొన్ని హోం మే

Subscribe to Boldsky

జుట్టు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. జుట్టు క్లీన్ గా ఉంచుకోవడంలో షాంపు ముఖ్యమైనది. మార్కెట్లో అందుబాటులో ఉండే కెమికల్ షాంపుల కంటే, నేచురల్ తయారుచేసుకునే షాంపులు ఉత్తమం . ఈ షాంపులను తయారుచేసుకోవడానికి పదార్థాలు ప్రతి ఒక్కరి వంటగదిలో ఉండే దినసరి వస్తువులే . వీటిలోఎలాంటి కెమికల్స్ ఉండవు, వీటిని జుట్టుకు ఉపయోగించినప్పుడు ఎఫెక్టివ్ గా జుట్టును శుభ్రం చేస్తాయి.

నిపుణులు అభిప్రాయం ప్రకారం, దీర్ఘకాలంగా ఒకే బ్రాండ్ కు సంబంధించిన షాంపులను కంటిన్యూగా వాడుతుంటే జుట్టు సామర్థ్యం కోల్పోతుంది . అంతే కాదు, జుట్టు కూడా వాతావరణం, శీతోష్ణస్థితి, పొల్యూషన్ కు వంటి పర్యావరణ పరిస్థితులకు లోనవ్వడం జరగుతుంది. వేసవిలో షాంపులను ఉపయోగించడం వల్ల శీతాకాలంలో అంత మంచిది కాదు మీ జుట్టుకు ఎక్కువ మాయిశ్చరైజింగ్ అవసరమవుతుంది. వాతావరణ పరిస్థి కారణంగా జుట్టు డ్రైగా మారుతుంది.

కాబట్టి ఎప్పటికప్పుడు షాంపులను మార్చుతండాలి. మరి ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నే?ఎన్ని రోజులకొకసారి షాంపు మార్చాలి. హెయిర్ స్పెషలిస్టుల ప్రకారం ప్రతి మూడు నెలలకొక సారి షాంపు మార్చాలని చెబుతుంటారు.

మీరు ఉపయోగించే షాంపులు కూడా మీరు అనుకున్న ఫలితాలను అందివ్వకపోతే, క్రమంగా జుట్టు డ్యామేజ్ అవుతుంది.వీటిని మార్చడానికి ఇది ఒక క్లియర్ సంకేతం. ఇలాంటి సమయంలో నేచురల్ షాంపులు బాగా పనిచేస్తాయి.కొన్ని హోం మేడ్ షాంపులను ఈ క్రింది విధంగా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది , వీటిని కనుక రెగ్యులర్ గా ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది.

గుడ్డు, ఓడ్కా షాంపు:

ఆయిల్ హెయిర్ కు ఈ షాంపు చాలా మంచిది. 2 టీస్పూన్ల వోడ్కాను , 2 గుడ్డుతో మిక్స్ చేసి, బాగా కలపాలి, నురగ వచ్చే వరకూ కలిపి, జుట్టుకు అప్లై చేయాలి. తలకు , జుట్టుకు పూర్తిగా అప్లై చేసిన తర్వాత మసాజ్ చేసి, కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేసుకోవాలి.

బేకింగ్ సోడ, నీళ్ళు:

జుట్టు మరీ డ్రైగా అనిపిస్తే, ఈ హోం మేడ్ షాంపు చాలా ఎఫెక్టివ్ గా ఉపయోగపడుతుంది. బేకింగ్ సోడ తీసుకుని, దానికి సరిపడా నీళ్ళు పోసి, పేస్ట్ తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ను తలకు, వెంట్రుకలకు పట్టించి మసాజ్ చేయాలి. కొద్ది సేపటి తర్వాత తలస్నానం చేసుకోవాలి.

అవొకాడో, బేకింగ్ సోడ:

డ్యామేజ్ అయిన జుట్టుకు పల్పీ గ్రీన్ ఫ్రూట్ గ్రేట్ గా పనిచేస్తుంది. అవొకాడో గుజ్జును వాటర్ తో మిక్స్ చేసి, కొద్దిగా బేకింగ్ సోడా మిక్స్ చేయాలి.ఫోర్క్ తో బాగా మిక్స్ చేసి, తర్వాత తలకు, జుట్టు పొడవునా అప్లై చేయాలి. కొద్దిసేపటి తర్వాత తలస్నానం చేసుకోవాలి.

కాస్టిల్ సోప్ ,ఎసెన్షియల్ ఆయిల్ :

జుట్టు డ్యామేజ్ అయితే కనుకు ఏది పనిచేయనప్పుడు ఈ షాంపును ఉపయోగించుకోవచ్చు. నీళ్ళు, కాస్టిల్ సోప్ సమంగా తీసుకుని, లైట్ వెజిటేబుల్ ఆయిల్ మిక్స్ చేయాలి. తర్వాత బాటిల్లోనింపి అవసరమైనప్పుడు ఉపయోగించాలి.

కోకనట్ మిల్క్, కాస్టిల్ సోప్:

ఇంట్లో తయారుచేసుకునే ఈ షాంపును పిల్లలకు కూడా ఉపయోగించవచ్చు. కొబ్బరి పాలు, కాస్టల్ సోప్, ఆరెంజ్, పెప్పర్మెంట్, రోజ్మెర్రీ, ల్యావెండర్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ అన్నీ సమయంగా తీసుకుని మిక్స్ చేయాలి. డ్రై హెయిర్ ఉన్నవారు ఆలివ్, బాదం ఆయిల్ ను మిక్స్ చేయవచ్చు. దీన్ని అసవరమైనప్పుడు తలకు అప్లై చేసి తలస్నానం చేయాలి.

గ్రీన్ టీ షాంపు:

గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది జుట్టుకు కూడా గొప్పగా సహాయపడుతుంది. గ్రీన్ టీ, ల్యావెండర్ టీ, కాస్టిల్ సోప్, ఉపయోగించి, బాటిల్లో నింపుకోవాలి. ఇది టు-ఇన్-వన్ షాంపు. ఇది కండీషనర్ గా కూడా పనిచేస్తుంది.

English summary

Natural Shampoos That You Can Prepare At Home

Natural Shampoos That You Can Prepare At Home,To have clean and healthy hair, shampooing is the most important thing to do. Here we share few of the recipes for preparing natural shampoos right at the comfort of your home. These shampoos are sans chemicals and will effectively cleanse your hair when used.
Please Wait while comments are loading...
Subscribe Newsletter