For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సివియర్ డాండ్రఫ్ ను తొలగించుకోవడానికి 10 నేచురల్ మార్గాలు..!!

|

జుట్టు చూడటానికి ఎంత పొడవుగా, ఒత్తుగా ఉన్నా, శుభ్రంగా లేకపోతే జుట్టు అందంగా కనబడుదు. ఉదాహరణకు పొడవైన, ఒత్తైన జుట్టు ఉన్నా, తలలో తెల్లగా పొట్టుపొట్టుగా కనబడితే చూడటానికి అసహ్యంగా కనబడుతుంది. అంతే కాదు, నలుగురిలో దురదపెడితే మరింత ఇబ్బంది కరంగా మెయింటైన్ చేయడం కష్టంగా మారుతుంది. జుట్టు సమస్యల్లో చుండ్రును దాచడానికి కూడా కుదరదు.

ఎక్సెస్ ఆయిల్ తలలో ఎక్కువగా చేరి చుండ్రుకు దారితీస్తుంది. పౌష్టికాహార లోపం మరియు ఒత్తిడి వల్ల కూడా చుండ్రు ఏర్పడటానికి కారణం అవుతుంది. మరి ఈ సమస్య నుండి బయటపడాలంటే నేచురల్ రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. మరి ఈ నేచురల్ రెమెడీస్ ఏంటో ఒక సారి తెలుసుకుందాం...

1. ఆస్పిరిన్ :

1. ఆస్పిరిన్ :

ఆస్పిరిన్ లో ఉండే సాలిసిలిక్ యాసిడ్ చుండ్రును నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. రెండు ఆస్పిరిన్ టాబ్లెట్స్ తీసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి, షాంపుకు మిక్స్ చేసి తలస్నానం చేయాలి.

2. ఆపిల్ సైడర్ వెనిగర్ :

2. ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఆపిల్ సైడర్ వెనిగర్ చుండ్రును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఒక కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఒక కప్పు నార్మల్ వాటర్ లో మిక్స్ చేసి స్ప్రేబాటిల్లో వేసి తలకు స్ప్రే చేయాలి. అరగంట 10 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారంలో అప్పుడప్పుడు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

3.మౌత్ వాష్:

3.మౌత్ వాష్:

మౌత్ వాష్ నోటిని శుభ్రం చేయడం మాత్రమే కాదు, చుండ్రును కూడా నివారిస్తుంది, ఆల్కహాల్ బేస్డ్ మౌత్ వాష్ లన్నీ చుండ్రును ఎఫెక్గివ్ గా నివారిస్తాయి. దీన్నిరెగ్యులర్ కండీషనర్ గా, ఉపయోగిస్తే, జుట్టు సాప్ట్ గా మరియు సిల్కీగా మారుతుంది. జుట్టును సాఫ్ట్ గా, సిల్కీగా మార్చుతుంది.

4. టీట్రీ ఆయిల్ :

4. టీట్రీ ఆయిల్ :

టీట్రీఆయిల్లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, ఇది చుండ్రును నివారించడంోల ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీన్ని షాంపుతో మిక్స్ చేసి, తలకు అప్లై చేసి, కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

5. ఆలివ్ ఆయిల్ :

5. ఆలివ్ ఆయిల్ :

తలస్నానం చేయడానికి 10నిముషాల ముందు తలకు అప్లై చేసి, శుభ్రం చేసుకోవాలి. తర్వాత వేడినీళ్ళలో ముంచిన టవల్ ను తలకు చుట్టేసుకోవాలి. కొద్ది సమయం అలాగే ఉండి, తర్వాత వేడినీటితో తలస్నానం చేయాలి.

6. కొబ్బరి నూనె:

6. కొబ్బరి నూనె:

చుండ్రును నివారించడంలో కొబ్బరినూనె గ్రేట్ గా సహాపడుతుంది. కొబ్బరి నూనెను గోరువెచ్చగా చేసి, తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి.మసాజ్ చేసిన 5 గంటల తర్వాత తలస్నానం చేసుకోవాలి. కండీషనర్ తో తలస్నాం చేస్తే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

7. ఉప్పు:

7. ఉప్పు:

షాంపు మీద కొద్దిగా ఉప్పును చిలకరించి, దీన్ని తలలో అప్లై చేసి స్ర్కబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల తలలో స్కిన్ కు ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. చుండ్రును త్వరగా తగ్గించుకోవడానికి ఇది ఒక సులభమైన రెమెడీ.

8. వెల్లుల్లి:

8. వెల్లుల్లి:

చుండ్రునివారించడంలో మరో అమేజింగ్ హోం రెమెడీస్ వెల్లుల్లి. వెల్లుల్లి యాంటీబయోటిక్స్ అధికంగా ఉంటాయి . చుండ్రుకు కారణం అయ్యే బ్యాక్టీరియను తొలగిస్తుంది. వెల్లుల్లిని పేస్ట్ లా చేసి తలకు పట్టించి 15నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి.

9. నిమ్మరసం, పెరుగు:

9. నిమ్మరసం, పెరుగు:

ఒక బౌల్ పెరుగులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి, తలకు అప్లై చేయాలి. లెమన్ పీల్ ను ఉపయోగించి తలకు అప్లై చేయాలి. అప్లై చేసిన అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. షాంపుతో రెగ్యులర్ గా తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

10.సెడర్ వుడ్ ఆయిల్:

10.సెడర్ వుడ్ ఆయిల్:

10 చుక్కల సెడర్ వుడ్ ఆయిల్ ను తీసుకుని, 10 చుక్కల కెరీర్ ఆయిల్ మిక్స్ చేసి, తలకు అప్లై చేయాలి. దీన్ని గోరువెచ్చని నీటితో మిక్స్ చేసి, తలకు అప్లై చేసి, మసాజ్ చేసి 15నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికొకసారి , కొన్ని వారాలపాటు క్రమంతప్పకుండా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

English summary

Natural Ways To Get Rid Of Severe Dandruff

Dandruff is generally caused by the skin condition called seborrhoeic dermatitis in which the scalp tends to turn extremely dry. Under such conditions, a yeast-like fungus called Malassezia grows on the scalp which also results in eczema and psoriasis on the scalp.
Story first published:Saturday, October 22, 2016, 15:53 [IST]
Desktop Bottom Promotion