పొడవైన..ఒత్తైన జుట్టు పొందడానికి బొప్పాయితో డిఫరెంట్ హెయిర్ మాస్కులు..!

. పండ్లలో బొప్పాయి సౌందర్యాన్ని పెంచడంలో గొప్పగా పనిచేస్తుంది. దీన్ని చర్మ, కేశ సంరక్షణలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. పొడవాటి, స్ట్రాంగ్ జుట్టును పొందడానికి అమ్మాయిలు వారి రెగ్యులర్ బ్యూటీ కిట్ లో బొప్ప

Posted By:
Subscribe to Boldsky

ప్రస్తుత రోజుల్లో జుట్టు సమస్యలు ఎదుర్కొనే వారి సంఖ్యం రోజు రోజుకి పెరిగిపోతున్నది. జుట్టు రాలడం, జుట్టు పల్చగా మారడం, హెయిర్ బ్రేకేజ్, జుట్టు చిట్లడం, చుండ్రు, మొదలగు సమస్యల వల్ల జుట్టు రాలడం అధికమౌతుంది. ఇంకా కొన్ని హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల, పౌష్టికాహారం లోపం వల్ల కూడా జుట్టు రాలడం ప్రారంభమౌతుంది. జుట్టు రాలడం నివారించుకోవడానికి ఇంట్లోనే స్వయంగా కొన్ని హెయిర్ మాస్క్ లను తయారుచేసుకోవచ్చు .

బయట మార్కెట్లో అందుబాటులో ఉండే కెమికల్ హెయిర్ ప్రొడక్ట్స్ సమస్యను మరింత తీవ్రం చేస్తాయి, కాబట్టి, వీటిలో ఉండే కెమికల్స్ జుట్టును మరింత బలహీనపరిచి, జుట్టు రాలడానికి కారణమవుతాయి. కాబట్టి సహజ పద్దతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.

బొప్పాయి ఆకులో మనకు తెలియని ఆరోగ్య రహస్యాలెన్నో..ఎన్నెన్నో...

సహజపద్దతులను ఉపయోగించడానికి మనకు ప్రక్రుతి ప్రసాధించిన పదార్థాలు చాలానే ఉన్నాయి. ఇవి నేచురల్ గా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అటువంటి సహజ పదార్థాల్లో పండ్లు. పండ్లలో బొప్పాయి సౌందర్యాన్ని పెంచడంలో గొప్పగా పనిచేస్తుంది. దీన్ని చర్మ, కేశ సంరక్షణలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. పొడవాటి, స్ట్రాంగ్ జుట్టును పొందడానికి అమ్మాయిలు వారి రెగ్యులర్ బ్యూటీ కిట్ లో బొప్పాయి చేర్చుకోవాలి. బొప్పాయిను జుట్టుకు ప్యాక్ వేసుకోవడం, అనేక ప్రయోజనాలను పొందవచ్చు అదేలాగో తెలుసుకుందాం..

బొప్పాయి , పెరుగు:

బాగా పండిన బొప్పాయిలో విటమిన్ ఎ, సి , బీటా కెరోటిన్, మెగ్నీషియం, పొటాషియం మరియు కాపర్ వంటి వివిధ రకాల న్యూట్రీషియన్స్ ఉన్నాయి . ఇవి హెల్తీ హెయిర్ గ్రోత్ కు సపోర్ట్ చేస్తాయి . ఇంకా జుట్టు స్మూత్ గా మరియు షైనీగా మార్చుతాయి. ఇంకా బొప్పాయిలోని పెపైన్ అనే ఎంజైమ్ తలలో మలినాలను నివారిస్తాయి. ఇది గ్రేట్ హెయిర్ కండీషనర్ గా ఉపయోగించడం వల్ల నిర్జీవమైన జుట్టు తిరిగి పునరుత్తేజమవుతుంది. బొప్పాయి, పెరుగు కాంబినేషన్ హెయిర్ మాస్క్ తలలో దురదను, తగ్గిస్తుంది. జుట్టును స్మూత్ గా సిల్కీగా మార్చతుంుది. అరకప్పు బొప్పాయి గుజ్జు తీసుకుని, అందులో రెండు టీస్పూన్ల పెరుగు వేసి మిక్స్ చేయాలి. ఈ హెయిర్ మాస్క్ ను జుట్టుకు పూర్తిగా అప్లై చేయాలి. తర్వాత హాట్ టవల్ తో కవర్ చేసి, ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి.

బొప్పాయి, కోకనట్ మిల్క్ మరియు తేనెతో హెయిర్ మాస్క్ :

ఈ మూడింటి కాబినేషన్ పదార్థాలు జుట్టు సమస్యలను నివారించడంలో గ్రేట్ గా పనిచేస్తాయి. ఈ బొప్పాయి ఫేస్ ప్యాక్ ను వారంలో ఒకసారి అప్లై చేస్తే జుట్టు స్ట్రాంగ్, షైనీగా పెరుతుంది. హెయిర్ బ్రేక్ కాకుండా ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ పండిన బొప్పాయి తీసుకుని, అందులో ఒక టేబుల్ స్పూన్ కోకనట్ మిల్క్, ఒక టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేయాలి. ఈ మాస్క్ ను తలకు అప్లై చేసి ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే మంచి కండీషనర్ గా పనిచేస్తుంది.

బొప్పాయి, జోజోబ ఆయిల్ , తేనె:

హెయిర్ వాల్యూమ్ పెంచుతుంది, హెయిర్ ను సాప్ట్ గా మార్చుతుంది, హెయిర్ కు మంచి షైనింగ్ అందిస్తుంది. ఈ సింపుల్ బొప్పాయి మాస్క్ ను ట్రై చేస్తే జుట్టుకు అనేక ప్రయోజనాలు అందుతాయి. 3 టేబుల్ స్పూన్ ల బొప్పాయి గుజ్జు, ఒక టేబుల్ స్పూన్ జోజోబ ఆయిల్ , ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకుని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

బొప్పాయి, అరటి, హనీ:

బొప్పాయి, అరటి, తేనె కాంబినేషన్ హెయిర్ మాస్క్ జుట్టుకు ఎక్స్ ట్రా షైనింగ్ ను ఇస్తుంది. ఇది జుట్టును నేచురల్ గానే స్ట్రెయిట్ గా మార్చుతుంది. బాగా పండిన బొప్పాయిని, మెత్తగా చేసి, అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేయాలి. వీటన్నింటిని బాగా మిక్స్ చేసి, దీన్ని జుట్టుకు అప్లై చేయాలి. 3 గంటల తర్వాత షాంపు, మరియు కండీషనర్ తో తలస్నానం చేయాలి.

బొప్పాయి, నిమ్మరసం, తేనె:

వారానికొకసారి, ఈ బొప్పాయి హెయిర్ మాస్క్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల చుండ్రు ఎఫెక్టివ్ గా నివారించుకోవచ్చు. బొప్పాయి పొట్టు తొలగించి, మెత్తగా పేస్ట్ చేసి అందులో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, తేనె మిక్స్ చేసి, తలకు మసాజ్ చేయాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. బొప్పాయితో ఇలాంటి టిప్స్ ఫాలో అవుతుంటే తప్పనిసరిగా జుట్టు స్ట్రాంగ్ గా మరియు పొడవుగా పెరుగుతాయి.

English summary

Papaya Hair Mask Recipes For Longer & Stronger Hair

Papaya is fast becoming a favourite ingredient with hair product manufacturers and there is a very good reason why. From treating itchy scalp, preventing hair fall, to infusing life back into your dull mane, papaya can pretty-much transform your tresses.
Please Wait while comments are loading...
Subscribe Newsletter