చుండ్రును నివారించే యాపిల్ సైడర్ వెనిగర్

తలలో డెడ్ స్కిన్ సెల్ పెరిగినప్పుడు చుండ్రు ఏర్పడుతుంది. చుండ్రు వల్ల తలలో పొట్టు పొట్టు ఏర్పడుతుంది. అయితే కొంత మందిలో జుట్టుకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల , ఈస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల , ఆయిలీ స్కాల

Subscribe to Boldsky

తలలో డెడ్ స్కిన్ సెల్ పెరిగినప్పుడు చుండ్రు ఏర్పడుతుంది. చుండ్రు వల్ల తలలో పొట్టు పొట్టు ఏర్పడుతుంది. అయితే కొంత మందిలో జుట్టుకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల , ఈస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల , ఆయిలీ స్కాల్ఫ్, డ్రై స్కిన్ , ఎగ్జిమా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కారణంగా చుండ్రు పెరుగుతుంది. ఇంకా కొన్ని రెగ్యులర్ గా ఉపయోగించే కొన్ని రసాయనిక ఉత్పత్తుల కారణంగా తలలో చుండ్రు పెరుగుతుంది.

తలలో నుండి పొట్టుగా రాలడాన్నితొలగించడం అసహ్యంగా అనిపిస్తుంది. చుండ్రు వల్ల జుట్టుకు ఉన్న అందం కూడాపోతుంది.చుండ్రును నివారిచుకోవడానికి మెడికల్ ట్రీట్మెంట్స్ తో పాటు కొన్ని హోం రెమెడీస్ ను కూడా ఉపయోగించి ఉంటారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన చుండ్రు వదలకపోగా, మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి, చుండ్రును నివారించడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉపయోగపడుతాయి. అందులో ఆపిల్ సైడర్ వెనిగర్ ఒకటి.

hair care

ఆపిల్ సైడర్ వెనిగర్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది చుండ్రునివారించడంలో సురక్షితంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ పంగల్, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలుపుష్కలంగా ఉన్నాయి.

ఆపిల్ సైడర్ వెనిగర్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల చలా త్వరగా వేగంగా చుండ్రేను నివారిస్తుంది. చుండ్రు నివారణకుఎలాంటి యాపిల్ సైడర్ వెనిగర్ ను ఉపయోగించాలి. ?ఆపిల్ జ్యూస్, నేచురల్ షుగర్స్ తో తయారుచేసిన యాపిల్ సైడర్ వెనిగర్ ను ఎంపికచేసుకోవడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఆర్గానిక్,ప్రొసెస్ చేయని, ఫిల్టర్ చేయని ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఎంపిక చేసుకోవాలి.

hair care

యాపిల్ సైడర్ వెనిగర్ ను ఎంపిక చేసుకున్న తర్వాత, బాటిల్ ను బాగా షేక్ చేయాలి. షేక్ చేసినప్పుడు ,లిక్విడ్ మొత్తం సమంగా కలుస్తుంది. బ్యాక్టియల్ లిక్విడ్ ను జుట్టుకు ఎంత అవసరమవుతుందో అంతే తీసుకోవాలి.

యాపిల్ సైడర్ వెనిగర్ ఉన్న బాటిల్ అడుగు బాగంలో తెల్లగా, లేదా బ్లూ కలర్లో తేలుతున్నట్లు కనిపిస్తే దీన్ని మదర్ ఆఫ్ వెనిగర్ అని పిలుస్తారు.ఇటువంటి వెనిగర్ లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది, ఎంజైమ్స్, మరియు మినిరల్స్ అధికంగా ఉన్నాయి. ఇవన్నీ చుండ్రును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి . మీ జుట్టును హెల్తీగా ఉంచుతుంది.

hair care

చుండ్రు నివారణకు ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించే పద్దతి:షాంపుతో తలస్నానం చేయాలి. తర్వాత ఆపిల్ సైడర్ వెనిగర్, వాటర్ రెండు సమంగా తీసుకుని, బాగా మిక్స్చేయాలి.ఈలిక్విడ్ ను జుట్టుకుఅప్లై చేసి, మసాజ్ చేయాలి. తర్వాత షవర్ క్యాప్ పట్టి 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ చిట్కాను రోజూ ఒక వారం రోజులు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. చుండ్రుపూర్తిగా తగ్గిపోతుంది. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో పోసి తర్వాత తలకు అప్పుడప్పుడు స్ప్రే చేయాలి.

hair care

తలలో సెన్సిటివ్ స్కిన్:సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారు, మొదట, చర్మం మీద ప్యాచ్ టెస్ట్ చేసుకుని తర్వాత ఉపయోగించాలి, ఎలాంటి ఇరిటేషన్ లక్షణాలు కనిపించకపోతే నేరుగా అప్లైచేసుకోవచ్చు. చర్మం మంట, లేదా దురదగా అనిపిస్తుంటే,మరికొద్దిగా వాటర్ మిక్స్ చేస్తే ఇందులో ఎసిడిట్ లెవల్స్ తగ్గుతుంది.

hair care

బ్యాక్టీరియల్,ఫంగల్ ఇన్ఫెక్షన్స్ :చుండ్రుకు ముఖ్య కారణం ఫంగల్, లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్.యాపిల్ సైడర్ వెనిగర్ లో ఉండే గుణాలు, బ్యాక్టీరియల్ , ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో గ్రేట్ గా సమాయపడుతుంది. దాంతో చుండ్రు తొలగిపోతుంది.

hair care

యాపిల్ సైడర్ వెనిగర్ లోని ఎసిడిక్ నేచర్:యాపిల్ సైడర్ వెనిగర్ లో ఉండే అసిడిక్ లెవల్స్ తలలో పిహెచ్ లెవల్స్ ను మెయింటైన్ చేస్తుంది. దాంతో చుండ్రుకు సంబంధించిన ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏర్పడ కుండా ఉంటుంది. దాంతో తల క్లీన్ అవుతుంది. తలలో నేచురల్ ఆయిల్స్ కోల్పోకుండా చేస్తుంది.

hair care

English summary

Say Bye To Dandruff With Apple Cider Vinegar

Dandruff is caused when the dead skin cells shed off from the scalp (as normal process) that further causes flaking. But some people tend to have excess flaking due to various reasons like improper scalp hygiene, oily scalp (seborrheic dermatitis), dry skin, eczema, bacterial and yeast infections. If you are using hair products that have chemicals in it, then this can also cause dandruff.
Please Wait while comments are loading...
Subscribe Newsletter