జుట్టు పెరుగుదలను రెండింతలు పెంచే ఎగ్ హెయిర్ ప్యాక్స్..!

ఎగ్ లో విటమిన్ ఏ, డి, ఈ, కే ఉంటాయి. ఇవి స్కాల్ప్ కి పోషణ అందిస్తాయి. కుదుళ్లను బలంగా మారుస్తాయి. జుట్టు బ్రేక్ అవకుండా అడ్డుకుంటాయి. అలాగే ఎగ్ లో బయోటిన్ ఉంటుంది.

Posted By:
Subscribe to Boldsky

ఎగ్ హెయిర్ కి మ్యాజిక్ లా పనిచేస్తుంది. ఎగ్ లో ఉండే పోషకాలు కురుల సౌందర్యానికి అద్భుతంగా పనిచేస్తాయి. రెగ్యులర్ హెయిర్ కేర్ లో ఎగ్ ని చేర్చుకోవడం వల్ల మీ జుట్టు రెండు రెట్లు వేగంగా పెరుగుతుంది.

ఎగ్ లో విటమిన్ ఏ, డి, ఈ, కే ఉంటాయి. ఇవి స్కాల్ప్ కి పోషణ అందిస్తాయి. కుదుళ్లను బలంగా మారుస్తాయి. జుట్టు బ్రేక్ అవకుండా అడ్డుకుంటాయి. అలాగే ఎగ్ లో బయోటిన్ ఉంటుంది. ఇది జుట్టు ఒత్తుగా, బలంగా పెరగడానికి సహాయపడుతుంది.

egg hair

హెర్బల్ హెయిర్ మాస్క్ లను వేసుకోవడం వల్ల.. జుట్టులో ఎలాస్టిసిటీని మెరుగుపరుస్తుంది. దీనివల్ల జుట్టు చిట్లిపోకుండా ఉంటుంది. అలాగే ఎగ్ లో ఎక్కువ మొత్తంలో జింక్, సల్ఫర్, ఐరన్ ఉంటాయి. ఇవి హెయిర్ కలర్ ని, పొడవుని, క్వాలిటీని, టెక్చర్ ని మెరుగుపరుస్తాయి.

డైలీ డైట్ లో ఎగ్ ని చేర్చుకున్నా.. జుట్టు సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అయితే జుట్టు పెరుగుదలకు ఎగ్ హెయిర్ ప్యాక్స్ ఎలా అప్లై చేయాలో చూద్దాం..

డ్రై హెయిర్

1గుడ్డులోని పచ్చసొన, 1టేబుల్ స్పూన్ తేనె, కొన్ని చుక్కల గ్రేప్ సీడ్ ఆయిల్ కలపాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి.. జుట్టుకి, స్కాల్ప్ కి అప్లై చేయాలి. గంట తర్వాత షాంపూ, కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. ఇది డ్రై హెయిర్ ని నివారించడంతో పాటు, జుట్టుకి షైనింగ్ ని, స్మూత్ నెస్ ని ఇస్తుంది.

ఆయిలీ హెయిర్

1గుడ్డులోని తెల్లసొన, టీస్పూన్ ఆలివ్ ఆయిల్, కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి.. జుట్టుని పాయలుగా విడదీసి.. ఈ ప్యాక్ ని అప్లై చేయాలి. గంట తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇది ఆయిలీ హెయిర్ నివారించడంతో పాటు, జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.

డీప్ కండిషనర్

ఒక కప్పు పెరుగు, 1 గుడ్డులోని తెల్లసొన, కొన్ని చుక్కల టీట్రీ ఆయిల్ కలిపి.. పేస్ట్ చేసుకోవాలి. ఈ ప్యాక్ ని జుట్టుకి, స్కాల్ప్ కి పట్టించాలి. బాగా ఆరిన తర్వాత, జుట్టు బిగుతుగా మారిన తర్వాత మైల్డ్ షాంపూ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ని వారానికి ఒకసారి అప్లై చేస్తే జుట్టు రాలడాన్ని నివారించవచ్చు.

డ్యామేజ్ హెయిర్ ప్యాక్

గుడ్డులోని పచ్చసొన, టేబుల్ స్పూన్ పెరుగు, టేబుల్ స్పూన్ కొబ్బరినూనె, టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి ప్యాక్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి బాగా అప్లై చేయాలి. జుట్టుకి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. గంట తర్వాత షాంపూ, కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి.

బలమైన జుట్టుకి

రెండు ఎగ్స్ లోని తెల్లసొన, టేబుల్ స్పూన్ అలోవెరా జ్యూస్, 5చుక్కల ఆల్మండ్ ఆయిల్, రోజ్ మెరీ ఆయిల్ తీసుకుని.. అన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. ఈ ప్యాక్ ని జుట్టుకి అప్లై చేసి.. గంట తర్వాత షాంపూ, కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. అంతే జుట్టు బలంగా మారుతుంది.

చిట్లిపోయిన జుట్టుకి

చివర్లు చిట్లిపోయిన జుట్టు నివారించడానికి టేబుల్ స్పూన్ కుంకుడుకాయ పొడి, ఒక గుడ్డులోని తెల్లసొన, టేబుల్ స్పూన్ కొబ్బరినూనె కలపాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి.. జుట్టుకి అప్లై చేయాలి. గంట తర్వాత షాంపూ, కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి.

English summary

Speed Up Your Hair Growth With Egg Hair Masks!

Speed Up Your Hair Growth With Egg Hair Masks! For longer, stronger and darker hair, try these egg hair masks that will suit most hair types.
Please Wait while comments are loading...
Subscribe Newsletter