నిమ్మరసంను జుట్టుకు అప్లై చేస్తే పొందే అద్భుతమైన ప్రయోజనాలు..!!

నిమ్మరసం తలకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం నివారిస్తుంది, చుండ్రు తొలగిస్తుంది , జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అంతే కాదు మరెన్నో బెనిఫిట్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి....

Posted By:
Subscribe to Boldsky

నిమ్మకాయ గురించి తెలియని భారతీయ్యలుండరంటే అతిశయోక్తి కాదు, ఎందుకంటే నిమ్మకాయను వేసవి తాపం తీర్చే సిట్రస్ ఫ్రూట్ గా తీసుకుంటారు. వివిధ రకాల వంటల్లో నిమ్మకాయను చేర్చడం వల్ల వంటలను మంచి సువాసనతో ట్యాంగీ టేస్ట్ ఉంటుంది. వంటలకు ట్యాటీ టేస్ట్, ఆరోమా వాసన అందివ్వడం మాత్రమే కాదు, ఇది బ్యూటీ విషయంలో కూడా అద్భుతంగా సహాయపడుతుంది. ముఖ్యంగా జుట్టు విషయంలో మరిన్ని బెనిఫిట్స్ అందిస్తాయి. నిమ్మరసం స్కాల్ఫ్, మరియు జుట్టుకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది.

ఉదయాన్నేలెమన్ వాటర్ తాగితే: గొప్ప ప్రయోజనాలు

నిమ్మరసంను జుట్టుకు అప్లై చేయడం వల్ల హెయిర్ ఫాలీ సెల్స్ ను బలోపేతం చేయడం మాత్రమే కాదు, జుట్టును పొడవుగా మరియు స్ట్రాంగ్ గా పెరగడానికి సహాయపడుతుంది. జుట్టు సమస్యలను నివారించుకోవడానికి, జుట్టు ఆరోగ్యానికి, జుట్టు పెరుగుదలనుకు నేచురల్ గా చౌకైన పదార్థాల కోసం మీరు వెతుకుతుంటే అందుకు నిమ్మకాయ ఎఫెక్టివ్ రెమెడీ అని చెప్పవచ్చు. ఇది అతి చౌకగా మీకు అందుబాటులో ఉంటూ కావల్సిన అవసరాలను తీర్చుతుంది.

లెమన్ + హనీ మిక్స్ టీలో అద్భుతమైన ప్రయోజనాలు..!!

అదేలాగంటే నిమ్మరసం తలకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం నివారిస్తుంది, చుండ్రు తొలగిస్తుంది , జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అంతే కాదు మరెన్నో బెనిఫిట్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి....

తలలో దురద తగ్గిస్తుంది:

తరచూ తలలో దురద పెడుతుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. తలలో దురదను తగ్గించుకోవడానికి ఎఫెక్టివ్ హోం రెమెడీ నిమ్మరసం . నిమ్మరసంను తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తలలో దురద క్రమంగా తగ్గుతుంది.

తలలో జిడ్డును నివారిస్తుంది:

తలలో సెబాషియస్ గ్రంథులు ఓరాక్టివ్ గా ఉండటం వల్ల తలలో ఎక్సెస్ ఆయిల్ విడుదలవుతుంది. ఈ నూనెలో జుట్టును జిడ్డుగా మార్చుతాయి. ఈ జిడ్డును తొలగించడాని బెస్ట్ సొల్యూషన్ నిమ్మరసం. నిమ్మరసంను కొద్దిగా నీటితో మిక్స్ చేసి తలమొత్తం తడపాలి. తర్వాత తలకు పూర్తిగా అప్లై చేయాలి. కొన్ని గంటల తర్వాత తలస్నానం చేయాలి.

చుండ్రు నివారిస్తుంది:

చుండ్రును నివారించడంలో నిమ్మరసం మంచి పరిస్కార మార్గం, నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ చుండ్రు నివారించడంలో గ్రేట్ గా సమాయపడుతుంది. జుట్టును హెల్తీగా మరియు స్ట్రాంగ్ గా ఉంచుతుంది. చుండ్రును నేచురల్ గా తగ్గిస్తుంది. క్రమంగా వారంలో రెండు మూడు సార్లు, కొన్ని వారాల పాటు అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

స్ట్రెయిట్ హెయిర్ :

ఈ మోడ్రన్ కాలంలో స్ట్రెయిట్ హెయిర్ ఉండాలని అమ్మాయిలందరు కోరుకుంటారు. అలాంటి స్ట్రెయిట్ హెయిర్ ను ఇంట్లోనే నేచురల్ గా పొందాలనుకుంటే నిమ్మరసం బెస్ట్ సొల్యూషన్. నిమ్మరసంలో కొద్దిగా కొబ్బరి నూనె లేదా ఎగ్ వైట్ మిక్స్ చేసి తలకు, కేశాల పొడవునా అప్లై చేయాలి. ఒక గంట తర్వాత వేడినీటితో స్నానం చేస్తే హెయిర్ స్ట్రక్చర్ స్ట్రెయిట్ గా మారుతుంది.

జుట్టుకు ఎక్సఫ్లోయేషన్ కలిగిస్తుంది:

నిమ్మరసంలో ఎక్సఫ్లోయేట్ చేసే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చుండ్రును సులభంగా తొలగిస్తుంది. తలకు నిమ్మరసం అప్లై చేయడం వల్ల తలలో మలినాలు తొలగిపోయి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.

జుట్టు పెరుగుదల:

జుట్టు పెరగడానికి నిమ్మరసంలో అద్భుత రహస్యాలున్నాయి. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి హెయిర్ గ్రోత్ ను పెంచడంలో , జుట్టుకు తగిన బలాన్ని చేకూర్చడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అందుకోసం మీరు చేయాల్సిందల్లా, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె సమంగా తీసుకుని మొత్తం పదార్థాలను మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పూర్తిగా అప్లై చేయాలి. ఒకటి లేదా రెండు గంటల తర్వాత తలస్నానం చేయాలి.

జుట్టు చిట్లకుండా నివారిస్తుంది:

నిమ్మరసం జుట్టును చిట్లకుండా నివారిస్తుంది. కాబట్టి, జుట్టు చివర్లను అప్పుడప్పు కట్ చేస్తుండాలి. అలాగే 5 నుండి 6 టీస్పూన్ల నిమ్మరసంను జుట్టు పొడవునా అప్లై చేయాలి. అరగంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

జుట్టు రాలడం నివారిస్తుంది:

సెడన్ గా ఎక్కువగా జుట్టు రాలుతుంటే కనుక వెంటనే జుట్టుకు నిమ్మరసం ఉపయోగించండి. ఇది జుట్టు రాలడాన్ని నేరుగా అరికడుతుంది. నిమ్మరసంలో కొద్ది బ్లాక్ పెప్పర్ పౌడ్ మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను తలకు అప్లై చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గుతుంది.

English summary

What Happens When You Apply Lemon Juice On Your Hair?

Did you know other than adding a tangy taste to your cooking, lemon is a great ingredient for hair as well? Well, if you still doubt if lemon is really useful for your hair or not, let us tell you that lemon is extremely useful for your scalp and hair.
Please Wait while comments are loading...
Subscribe Newsletter