జుట్టుని టైట్ గా ముడివేసుకోకూడదు అనడానికి కారణాలు..!

జుట్టుకి బ్యాండ్ వేయడం, లేదా క్లచ్ పెట్టుకోవడం చాలా ముఖ్యం. కానీ మరీ ఎక్కువ టైట్ గా వేసుకోవడం వల్ల.. జుట్టుకి హాని కలుగుతుంది.

Posted By:
Subscribe to Boldsky

మీ జుట్టుని డ్యామేజ్ చేయడంలో దాన్ని గట్టిగా కట్టుకోవడం కూడా ఒక కారణం. కొంతమంది జుట్టుకి చాలా టైట్ గా ఉండే బ్యాండ్స్ ఉపయోగిస్తుంటారు. మరికొందరు టైట్ గా పోనీటైల్ వేసుకుని గంటలు గడుపుతూ ఉంటారు. కానీ అలా చేస్తే.. జుట్టు డ్యామేజ్ అవుతుంది.

hair damage

ప్రతి ఒక్కరూ తమ జుట్టుని కట్టుకుంటూ ఉంటారు. కానీ దానివల్ల జుట్టుకి డ్యామేజ్ అవుతుందని చాలామందికి తెలియదు. జుట్టుకి బ్యాండ్ వేయడం, లేదా క్లచ్ పెట్టుకోవడం చాలా ముఖ్యం. కానీ మరీ ఎక్కువ టైట్ గా వేసుకోవడం వల్ల.. జుట్టుకి హాని కలుగుతుంది.

చాలామంది ఒకేదగ్గర జుట్టుని ముడి వేసుకుంటూ ఉంటారు. అయితే జుట్టుని గట్టిగా ముడివేసుకోవడం వల్ల ఏమవుతుందో ఇప్పుడు మీకు వివరిస్తున్నాం. ఇకపై జుట్టుని టైట్ గా ముడివేసుకోకూడదనడానికి కారణాలు..

జుట్టు బలహీనమవుతుంది

తరచుగా జుట్టుకి ఒకే స్పాట్ లో టైట్ గా ముడివేసుకోవడం వల్ల.. జుట్టు డ్యామేజ్ అవుతుంది. బ్రేక్ అవుతుంది.

బ్రేకేజ్

చాలా బిగుతుగా ఉండే బ్యాండ్ తో జుట్టుని ముడివేసుకోవడం వల్ల.. జుట్టు బ్రేక్ అవడానికి కారణమవుతుంది. అలాగే.. జుట్టు రబ్బర్ బ్యాండ్ తో పాటే రావడం కూడా చూస్తుంటాం. కాబట్టి.. జుట్టుని బిగుతుగా ముడివేసుకోకూడదు.

మార్క్

ఒకే దగ్గర ప్రతిరోజూ జుట్టుని గట్టిగా ముడివేసుకోవడం వల్ల.. మీ న్యాచురల్ హెయిర్ లెంగ్త్ పై మార్క్ పడుతుంది. కాబట్టి.. జుట్టుని ముడివేసుకునే స్పాట్ ని మారుస్తూ ఉండటం అవసరం.

రాత్రిపూట వదిలేయడం

నిద్రపోవాలకుంటే.. ఎప్పుడూ జుట్టుని వదులుగా వదిలేయాలి. దిండుపై కదిలేటప్పుడు.. మీ జుట్టు దిండుపై పడే అవకాశం ఉంది.

తడిజుట్టుని ముడివేస్తే

తడిజుట్టు చాలా బలహీనంగా ఉంటుంది. కాబట్టి తడిజుట్టుని గట్టిగా ముడివేయడం వల్ల.. చాలా డ్యామేజ్ అవుతుంది.

డ్యామేజ్

జుట్టుని వీలైనంత వరకు వదులుగా వదిలేయండి. జుట్టుకి ఇది చక్కటి ఆప్షన్. దీనివల్ల జుట్టు డ్యామేజ్ అవడాన్ని కొంతవరకైనా తగ్గించవచ్చు.

డ్యామేజ్ అవకుండా

జుట్టుని పోనీటైల్ వేసుకోకూండా.. కొత్త స్టైల్స్ పాలో అవ్వండి. జుట్టుని లూజ్ గా అల్లుకోవడం వల్ల జుట్టు తక్కువగా డ్యామేజ్ అవుతుంది.

English summary

What Happens When You Tie Your Hair Too Tight?

What Happens When You Tie Your Hair Too Tight? Everyone ties their hair, but here's how it could be damaging your hair, as we've mentioned details on what happens when you tie your hair too tight or for too long.
Please Wait while comments are loading...
Subscribe Newsletter