For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ జుట్టు పెరగకపోవడానికి ప్రధాన కారణాలేంటో తెలుసా...

మీ జుట్టు ఎందుకు పెరగడం లేదు ?

By Swathi
|

మీ జుట్టు పెరగడం లేదా ? హెయిర్ గ్రోత్, హెయిర్ ఫాల్ వంటి సమస్యలు ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్సే. అయితే నెలలు గడుస్తున్నా.. జుట్టు పెరగకపోతే మాత్రం.. ప్రతి ఒక్కరిలోనూ కోపం వస్తుంది. ముఖ్యంగా.. అమ్మాయిలకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది.

మీ జుట్టు ఎందుకు పెరగడం లేదు ? ఒకవేళ పెరుగుతుంటే.. అది ఎక్కడికి పోతోంది ? పొడవు అంతే ఎందుకు ఉంది ? ఇలా చాలా ప్రశ్నలకు సమాధానం దొరకదు. కానీ.. ఇలాంటి సమస్యలు మీవి మాత్రమే కాదు. ముగ్గురిలో ఒకరి ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. కానీ కారణాలు చాలామందికి తెలియకపోవచ్చు.

కొన్ని అధ్యయనాల ప్రకారం.. జుట్టు పెరకపోవడానికి కొన్ని కారణాలు వెలుగులోకి వచ్చాయి. అవన్నీ మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తాయి. ఈ కారణాలు తెలుసుకోవడం వల్ల ఇకపై మీరు అలర్ట్ అవడమే కాకుండా.. జాగ్రత్తలు తీసుకుంటారు. మరి మీ జుట్టు పెరగకపోవడానికి కారణాలేంటో చూద్దామా..

అన్ హెల్తీ స్కాల్ప్

అన్ హెల్తీ స్కాల్ప్

జుట్టు పెరగడం ఆగిపోవడానికి మీ స్కాల్ప్ లో ఇన్ఫెక్షన్స్. పీహెచ్ లెవెల్స్ 4.5 నుంచి 5.5 వరకు ఉండాలి. ఇంతకంటే.. తక్కువ ఉంటే... అన్ హెల్తీగా ఉన్నట్టు. ఎక్కువ ఆయిలీగా లేదా డ్రైగా ఉంటే.. జుట్టు పెరగదు.

మాయిశ్చరైజర్ లేకపోవడం

మాయిశ్చరైజర్ లేకపోవడం

జుట్టులో ఎలాస్టిసిటీని ఏరోజుకి ఆ రోజు చెక్ చేసుకోవాలి. ముదిరినా, బెండ్ చేసి, తిప్పిన జుట్టు చిట్లిపోకూడదు. జుట్టులో ఎలాస్టిసిటీ ఉండటం వల్ల.. కుదుళ్లు బలహీనం కాకుండా ఉంటాయి. కాబట్టి మీ జుట్టు మాయిశ్చరైజర్ ని కోల్పోతే... కుదుళ్లు బలహీనమై జుట్టు పెరగదు.

డైట్

డైట్

జుట్టు లోపలి నుంచి మొదలవుతుంది. లోపల ఏమి ఉంటే.. బయట అదే ఉంటుంది. జుట్టు పెరగకపోవడానికి.. శరీరం సరైన విటమిన్స్, మినరల్స్ పొందకపోవడమే. జుట్టుకి చాలా ముఖ్యమైనది నీళ్లు.

జెనటిక్స్

జెనటిక్స్

హెయిర్ గ్రోత్ అనేది జెనెటిక్స్ పై ఆధారపడి ఉంటుంది. ఒకసారి ఒత్తుగా పెరిగి.. మరోసారి పెరగడం లేదంటే.. దానికి వారసత్వ లోపాలే కారణం.

ఒత్తిడి

ఒత్తిడి

ఒత్తిడి వల్ల చర్మం ఎలా డల్ గా మారుతుందో.. జుట్టు కూడా ఈస్ట్రోజన్ ఉత్పత్తిని కోల్పోయి.. హెయిర్ గ్రోత్ ని అడ్డుకుంటుంది.

కెమికల్స్

కెమికల్స్

బ్లీచింగ్, స్టైలింగ్, కెమికల్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల.. స్కాల్ప్ లో పేరుకుపోయి, గాయాలకు కారణమవుతాయి. దీనివల్ల హెయిర్ గ్రోత్ కి ఆటంకం ఏర్పడుతుంది.

ఎక్కువగా కట్ చేయడం

ఎక్కువగా కట్ చేయడం

జుట్టు పెరగకపోవడానికి ఇదో ప్రధాన కారణం. జుట్టుని ట్రిమ్ చేయడం అవసరమే.. కానీ.. చాలా వెంటవెంటనే చేయడం వల్ల.. పెరుగుదలకు ఆటంకం ఏర్పడుతుంది.

మెడికల్ ట్రీట్మెంట్స్

మెడికల్ ట్రీట్మెంట్స్

హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వంటి రకరకాల అనారోగ్య సమస్యలు కూడా జుట్టు పెరగకపోవడానికి కారణమవుతుంది. అలాగే పొల్యూషన్ కూడా.. జుట్టు పెరుగుదలను అడ్డుకుంటుంది.

సరైన ప్రొడక్ట్స్ ఎంచుకోకపోవడం

సరైన ప్రొడక్ట్స్ ఎంచుకోకపోవడం

జుట్టు పెరగకపోవడానికి ఇదో ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కొన్ని రకాల షాంపూలు, ఆయిల్స్ లో ఉండే పదార్థాలు.. జుట్టుపై దుష్ర్పభావం చూపుతుంది.

అలవాట్లు

అలవాట్లు

తడిజుట్టుతో పడుకోవడం, జుట్టుకి హెయిర్ ప్యాక్ అప్లై చేసి పడుకోవడం, లాగడం వంటి కారణాల వల్ల జుట్టు పెరుగుదలకు ఆటంకం ఏర్పడుతుంది.

ప్రొటీన్స్ తగ్గడం

ప్రొటీన్స్ తగ్గడం

జుట్టు పెరుగుదలను ఆపడంలో ప్రొటీన్స్ తగ్గిపోవడం కూడా ప్రధాన కారణం. జుట్టు క్వాలిటీ.. తీసుకునే ప్రొటీన్స్ పై ఆధారపడి ఉంటుంది. ఎలాస్టిసిటీ.. కొల్లాజెన్ లెవెల్ ని తెలుపుతుంది. కాబట్టి.. జుట్టు పెరుగుదలకు కావాల్సిన ప్రొటీన్స్ తీసుకోవాలి.

వయసు

వయసు

వయసుతో పాటు జుట్టులో ఆయిల్ ప్రొడక్షన్ తగ్గుతుంది. దీనివల్ల జుట్టు డ్రైగా మారుతుంది. కాబట్టి ప్రొటీన్స్, విటమిన్స్ పొందడం చాలా అవసరం.

జుట్టు చివర్లు చిట్లిపోవడం

జుట్టు చివర్లు చిట్లిపోవడం

కొన్నిసార్లు.. జుట్టు పెరగకపోవడానికి జుట్టు చివర్లు చిట్లిపోవడం కూడా కారణమే. కాబట్టి జుట్టు చిట్లిపోవడానికి కారణమయ్యే అలవాట్లకు దూరంగా ఉంటే.. హెయిర్ గ్రోత్ ఉంటుంది.

English summary

Why Is Your Hair Not Growing?

Why Is Your Hair Not Growing? What is even more frustrating is the hair length that seems to stay the same, month after month.
Desktop Bottom Promotion