శీతాకాలంలో జుట్టు సంరక్షణ కోసం తీసుకోవల్సిన జాగ్రత్తలు..!

శీతాకాలం ప్రారభమైందో ...లేదో ...చర్మ సమస్యలు కూడా మొదలయ్యాయి. అయితే ఈ కాలంలో కేవలం చర్మానికే కాదు.. జుట్టుకూ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ కాలంలో జుట్టు రాలిపోవడం కాస్త ఎక్కువగానే ఉంటుంద. మరి, శీతాకాలంల

Posted By:
Subscribe to Boldsky

శీతాకాలం ప్రారభమైందో ...లేదో ...చర్మ సమస్యలు కూడా మొదలయ్యాయి. అయితే ఈ కాలంలో కేవలం చర్మానికే కాదు.. జుట్టుకూ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ కాలంలో జుట్టు రాలిపోవడం కాస్త ఎక్కువగానే ఉంటుంద. మరి, శీతాకాలంలో శిరోజాలను సంరక్షించుకోవాలంటే ఏం చేయాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఇక్కడ ఓ లుక్ వేయాల్సిందే..

శీతాకాలంలో ఉండే చల్లగాలుల వల్ల కేవలం శరీరంలోనే కాదు, శిరోజాల్లో కూడా తేమ శాతం బాగా తగ్గిపోతుంది. ఫలితంగా జుట్టంతా అట్టకట్టినట్లు పొడిగా తయారవుతుంది. అంతే కాకుండా కుదుళ్ళు బలహీనపడి జుట్టు రాలిపోయే సమస్య అధికమవుతుంది. కాబట్టి, చలి బారి నుంచి శిరోజాలను కూడా సంరక్షించుకుంటూ, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అలల్లాంటి ముంగురులతో అందంగా ఉండవచ్చు. వింటర్లో అనుసరించాల్సిన కొన్ని జాగ్రత్తలు..

తరచూ తలస్నానం చేయకూడదు :

కొందరు రోజూ తలస్నానం చేస్తే మరికొందరు వారానికి మూడు లేదా నాలుగు సార్లు చేస్తుంటారు. శీతాకాలంలో తలస్నానం మరీ ఎక్కువగా లేదా తక్కువగా కాకుండా వారానికి రెండు స్లారు చేస్తే సరిపోతుంది. అలాగే తలస్నానానికి ఉపయోగించే షాంపు కూడా మీ శిరోజాలకు సరిపడినదై ఉండాలి.

కండీషనింగ్ కూడా..

తలస్నానానికి ముందు జుట్టుకు కండీషనర్ (ఫ్రీవాష్ కండీషనర్స్ )తప్పకుండా అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కుదుళ్లు బలంగా ఉంటాయి. షాంపులో ఉండే రసాయనాల ప్రభావం కూడా జుట్టుపై అంతగా ఉండదు.

వేడినీటి స్నానం తగదు:

శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉండి, వేడినీటితో స్నానం చేయాలనిపించడం సహజం. అయితే స్నానానికి బాగా వేడిగా ఉన్న నీళ్లను ఉపయోగించకూడదు. గోరు వెచ్చని నీటిని ఉపయోగించాలి. ఎక్కువగా వేడిగా ఉన్న నీటిని ఉపయోగిస్తే చర్మం, శిరోజాల్లోని సహజనూనెల శాతం తగ్గిపోయి పొడిగా , నిర్జీవంగా మారిపోతాయి.

హెయిర్ డ్రయ్యర్స్ ఉపయోగించకపోవడం మంచిది:

శీతాకాలంలో వేడి నీటి స్నానం ఎలా తగదో అలాగే జుట్టుకు ఉపయోగించే డ్రయర్స్, కర్లర్స్ స్ట్రెయిటనర్స్ మొదలగున వాటికి దూరంగా ుండాలి. టవల్ తో తుడుచుకుని ఆరబెట్టుకునే విధానానికే పరిమితం కావాలి. అలాగే కండీషనర్ పెట్టుకున్ తర్వాత వేడి నీళ్లలో ముంచిన టవల్ ను తలకు చుట్టుకున్నా కుదుళ్లకు మంచి పోషణ అంది బలం చేకూరుతుంది

హెయిర్ ఆయిల్ వద్దు:

చలికాలంలో శిరోజాలకు ఎంత తరచుగా నూనె పెడితే అంత మంచిది. ఇది జుట్టులోని తేమ శాతం ఎక్కువ సమయం నిలిచి ఉండటానికి బాగా ఉపకరిస్తుంది. అలాగే దువ్వుకోవడానికి ఉపయోగించే దువ్వెన కూడా సరైనది ఎంపిక చేసుకోవాలి. పళ్లు కాస్త దూరంగా , వెడల్పుగా ఉన్నవైతే మంచిది.

అట్ట కట్టినట్టు ఉంటే :

చలిగాలలకు జుట్టు అట్టకట్టినట్లుగా మారుతుంది. అలా కాకుండా ఉండాలంటే రోజూ రాత్రి నిద్రపోయే ముందు విటమిన్ ఇ ఉన్న నూనెను రాసుకోవాలి. అలాగే బయటకు వెళ్లేటప్పుడు జుట్టుని కూడా కవర్ చేసేలా స్కార్ఫ్, టోపి..ఇలా ఏదో ఒకటి విధంగా ధరించాలి. ఒక వేళ బయట ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఎదురైతే మీ దగ్గర ఉన్న బాడీలోషన్ కొద్దిగా తీసుకుని చేతులకూ రుద్దుకోవాలి. తర్వాత ఆ చేతుల మధ్య జుట్టు ఉంచి మెల్లగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల శిరోజాల పెళుసుదనం పోయి, ప్రకాశవంతంగా మారుతాయి.

జుట్టు రాలకుండా :

ఒక అరటి పండు తీసుకుని మెత్తగా గుజ్జులా చేసుకోవాలి. దీనికి కొద్దిగా ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనె జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20 నుండి 25 నిముషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరెవెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. అరటిపండులోని గుణాల వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.

జుట్టు రాలకుండా :

నిమ్మతో కేవలం చుండ్రు దూరం కావడమే కాదు, జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. నిమ్మరసాన్ని నేరుగా తలకు పట్టించవచ్చు లేదా ఏదైనా హెయిర్ మాస్క్ కు జత చేయవచ్చు. లేదంటే కొద్దిగా పెరుగు తీసుకుని అందులోని కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి జుట్టుకు రాసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కూడా సమస్య కు మంచి పరిష్కారం లభిస్తుంది.

English summary

Winter Hair Care Tips You Should Follow

Winter the most romantic, beautiful and favourite season of many demands a bit more attention to your skin and hair. Generally winter skin care is what all of us keep in mind but it is a fact that like summer, winter too has an inverse effect on hair.
Story first published: Wednesday, November 16, 2016, 17:57 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter