For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పుష్పాల్లో రాజసాన్ని ఒలికించే గులాబీతో జుట్టుకు అత్యద్భుతమైన ప్రయోజనాలు

పుష్పాల్లో రాజసాన్ని ఒలికించే పుష్పంగా గులాబీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఔషధ గుణాలనే కాదు... తన సొగసులతో ఇటు భక్తినీ, ప్రేమసాగరాలనీ దాటించ గల సత్తా గులాబీ సొంతం అంటే ఆశ్చర్యం కలగక తప్పదు. గులాబీల హంగామ

|

పుష్పాల్లో రాజసాన్ని ఒలికించే పుష్పంగా గులాబీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఔషధ గుణాలనే కాదు... తన సొగసులతో ఇటు భక్తినీ, ప్రేమసాగరాలనీ దాటించ గల సత్తా గులాబీ సొంతం అంటే ఆశ్చర్యం కలగక తప్పదు. గులాబీల హంగామా అంతా ఇంతా కాదు. అన్ని రకాల సౌందర్యపోషక ఉత్పత్తుల్లో గులాబీలు లేని ఉత్పత్తి లేదంటే అతిశయోక్తి అంతకన్నాకాదు. ఫెర్ఫ్యూమ్ తయారీలో కూడా గులాబీ అగ్రగామి అన్న విషయం అందరికీ విధితమే. వాడిపోయినా, వాడిగా ఉన్నా గులాబీ తన రాజసాన్నిఏ మాత్రం కోల్పోదు. దాని గుణాలు ఎన్నటికీ వాడిపోవు. కాబట్టి దీన్ని సౌదర్య సాధనాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

అది ఇప్పటి నుండి కాదండోయో పురాతన కాలం నుండే గులాబీలోని సౌందర్య గుణాలను అవపోసన పట్టారు. ఆ గుణాల వల్ల చర్మ, మరియు హెయిర్ సంరక్షణలో వండర్స్ ను క్రియేట్ చేస్తోంది. డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేయడం నుండి మరెన్నో అద్భుతాలను చేస్తుంది. డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేయడంతో పాటు, జుట్టుకు మంచి షైనింగ్ , వాల్యూమ్ ను పెంచుతుంది. అందుకే హెయిర్ కేర్ విషయంలో రోజ్ వాటర్ ను వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటారు.

సౌందర్యాన్ని మెరుగుపరుచుకునే క్రమంలో రోజ్ వాటర్ ను డైలీ మరియు వీక్లీ బ్యూటి ప్రయోగాల్లో ఉపయోగించి, అందాన్ని మెరుగుపరుచుకోవచ్చు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇది నేచురల్ హెయిర్ కేర్ ప్రొడక్ట్. దీన్ని వాడటం వల్ల జుట్టుకు ఎలాంటి హాని జరగదు. కెమికల్ ప్రొడక్ట్స్ తో పోల్చితే ఇది ఉత్తమమైనది. జుట్టుకు రోజ్ వాటర్ ఉపయోగించడం వల్ల వండర్ ఫుల్ బెనిఫిట్స్ పొందవచ్చు. జుట్టు స్ట్రాంగ్ గా షైనీగా మారుతుంది.

సూచన: జుట్టుకు ఏదైనా నేచురల్ పదార్థం ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. ప్యాచ్ టెస్ట్ లో ఎలాంటి ఇరిటేషన్, సమస్య లేకపోతే తర్వాత జుట్టు మొత్తానికి అప్లై చేయవచ్చు. మరి రోజ్ వాటర్ లోని అద్భుతమైన హెయిర్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం..

అలోవెర జెల్ తో రోజ్ వాటర్ :

అలోవెర జెల్ తో రోజ్ వాటర్ :

అలోవెర జెల్ కు కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేయడం వల్ల జుట్టు చిక్కువడకుండా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి, షవర్ క్యాప్ పెట్టుకోవాలి. ఇలా వారానికొకసారి చేస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది.

తేనెతో రోజ్ వాటర్ :

తేనెతో రోజ్ వాటర్ :

రోజ్ వాటర్ ను తేనెతో మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. జుట్టు మందం పొడవును బట్టి జుట్టుకు అప్లై చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

విటమిన్ ఇ ఆయిల్ తో రోజ్ వాటర్ :

విటమిన్ ఇ ఆయిల్ తో రోజ్ వాటర్ :

రెండు విటమిన్ ఇ క్యాప్స్యూల్స్ తీసుకుని బ్రేక్ చేసి అందులో ఆయిల్ ల్లో రోజ్ వాటర్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేయాలి. ఇది తలను హైడ్రేషన్ లో ఉంచుతుంది. తలలో దురదను నివారిస్తుంది. చుండ్రును అరికడుతుంది. వారంలో ఒకసారి ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

గ్రీన్ టీతో రోజ్ వాటర్ :

గ్రీన్ టీతో రోజ్ వాటర్ :

జుట్టు పొడవుకు సరిపడా గ్రీన్ టీ తీసుకుని,అందులో రోజ్ వాటర్ మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. హెయిర్ ఫోలిసెల్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది.

సాల్ట్ అండ్ రోజ్ వాటర్ :

సాల్ట్ అండ్ రోజ్ వాటర్ :

ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకుని అందులో రోజ్ వాటర్ ను మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి, మసాజ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేయడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది.

గ్లిజరిన్ తో రోజ్ వాటర్ :

గ్లిజరిన్ తో రోజ్ వాటర్ :

ఒక టీస్పూన్ గ్లిజరిన్ లో 5 చుక్కల రోజ్ వాటర్ మిక్స్ చేయాలి. తలస్నానం పూర్తి అయిన తర్వాత చివరగా రోజ్ వాటర్ మిశ్రమాన్ని ఒక మగ్ నీటిలో మిక్స్ చేసి తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు సాప్ట్ గా మరియు షైనీగా మారుతుంది.

రోజ్ వాటర్ ను నేరుగా జుట్టుకు అప్లై చేయడం:

రోజ్ వాటర్ ను నేరుగా జుట్టుకు అప్లై చేయడం:

రోజ్ వాటర్ ను తలకు అప్లై చేయడంలో సింపుల్ రెమెడీ కాటన్ ప్యాడ్ ను రోజ్ వాటర్ లో డిప్ చేసి తలకు అప్లై చేయాలి. ఇది నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది. జుట్టును స్ట్రాంగ్ గా మార్చుతుంది.

ఫుల్లర్స్ ఎర్త్ తో రోజ్ వాటర్ :

ఫుల్లర్స్ ఎర్త్ తో రోజ్ వాటర్ :

2 టేబుల్ స్పూన్ల ఫుల్లర్ ఎర్త్ 5 చుక్కల రోజ్ వాటర్ మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. దీన్ని అప్లై చేయడం ల్ల తలలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. హెయిర్ బ్రేకేజ్ ను నివారిస్తుంది.

రోజ్ వాటర్ ఆముదం:

రోజ్ వాటర్ ఆముదం:

ఒక టీస్పూన్ ఆముదంలో 4 చుక్కల రోజ్ వాటర్ మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. తలస్నానం చేయడానికి ఒక గంట ముందు తలకు అప్లై చేసి, వారానికొకసారి రిపీట్ చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు స్ట్రాంగ్ మారుతుంది.

ఆనియన్ జ్యూస్ తో రోజ్ వాటర్ :

ఆనియన్ జ్యూస్ తో రోజ్ వాటర్ :

రెండు టేబుల్ స్పూన్ల ఆనియన్ జ్యూస్ లో 5 చుక్కల రోజ్ వాటర్ మిక్స్ చేసి తలకు అప్లై చేస్తే తెల్ల జుట్టు నివారించబడుతుంది. ఒక గంట తర్వాత మన్నికైన షాంపుతో స్నానం చేయాలి. దీన్ని వారానికొకసారి ట్రై చేయడం వల్ల కామన్ హెయిర్ ప్రాబ్లెమ్స్ నివారించబడుతాయి.

English summary

10 Wonderful Ways To Use Rose Water For Hair Care

Since time immemorial, women have been using rose water for various beauty purposes, both skin and hair care. It is a rich source of rejuvenating properties that can do wonders on your tresses. From repairing damaged hair to adding volume and shine to your tresses, rose water can do it all. Moreover, there are numerous ways to use rose water for hair care.
Story first published: Friday, February 17, 2017, 13:21 [IST]
Desktop Bottom Promotion