For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సమ్మర్లో: హెల్తీ అండ్ బ్యూటిఫుల్ హెయిర్ కోసం ఎఫెక్టివ్ హోం రెమెడీస్

అళలులాగే ఎగసిపడే బ్యూటిఫుల్ హెయిర్ ను పొందడానికి హైబ్రాండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్, ఎక్స్ ప్యాన్సివ్ హెయిర్ కేర్ ట్రీట్మెంట్ , సిగ్నేచర్ సలూన్స్ అవసరం లేదు .

By Lekhaka
|

ఆరోగ్యం మీదే కాదు, అందం మీద కూడా కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చర్మం, జుట్టుకు కాలుష్యం ప్రభావం వల్ల చాలా నష్టం జరుగుతుంది?

మరి హెల్తీ హెయిర్ ను మెయింటైన్ చేయడం ఎలా?ఈ ప్రశ్న ఒక్కరిది కాదు, చాలా మందిలో ఉంటుంది. ఆరోగ్యకరమైన. అందమైన జుట్టు పొందడానికి ఎక్స్ ట్రా కేర్ తీసుకోవడం చాలా అవసరం. మరి అలాంటి హెయిర్ పొందాలంటే కెమికల్ ప్రొడక్ట్స్ ఎంపిక చేసుకోకుండా నేచురల్ రెమెడీస్ ను ఫాలో అవ్వడం మంచిది. ఇవి జుట్టును హెల్తీగా, స్ట్రాంగ్ గా ఉంచుతాయి.

అళలులాగే ఎగసిపడే బ్యూటిఫుల్ హెయిర్ ను పొందడానికి హైబ్రాండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్, ఎక్స్ ప్యాన్సివ్ హెయిర్ కేర్ ట్రీట్మెంట్ , సిగ్నేచర్ సలూన్స్ అవసరం లేదు . మన వంటగదిలోనే అనేక హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. అవి ఆరోగ్యకరమైన పొడవైన జుట్టును అందిస్తాయి. మరి ఆ హోం రెమెడీస్ ఏంటో ఒక సారి తెలుసుకుందాం.

అరటి పండ్లు

అరటి పండ్లు

అరటి పండ్లు ఆరోగ్యకరమైన జుట్టును అందిస్తాయి. అరటిపండ్లలో ఉండే పొటాషియం కంటెంట్, హెయిర్ ఎలాసిటిని అందిస్తుంది. ఇది నేచురల్ హెల్తీ హెయిర్ ను పొందవచ్చు. ఒక బౌల్లో అరటిపండ్లను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి, ఈపేస్ట్ ను జుట్టుకు అప్లై చేయాలి. అరటిపండును జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు డ్రై అండ్ డ్యామేజ్డ్ హెయిర్ నివారిస్తుంది. అరటిపండు గుజ్జును అప్లై చేసిన అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.

గుడ్లు

గుడ్లు

గుడ్లు జుట్టును సాఫ్ట్ గా మరియు సిల్కీగా మార్చుతుంది. గుడ్డును నేరుగా జుట్టుకు అప్లై చేయడం లేదా ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, 3గుడ్లలోని పచ్చసొన, 4చుక్కల విటమిన్ ఇ ఆయిల్ ను ఒక బౌల్లో తీసుకుని బాగా మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. 15నిముషాల తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఇది జుట్టుకు మంచి కండీషనర్ గా పనిచేసి నేచురల్ హెయిర్ ను అందిస్తుంది.

హెయిర్ కండీషన్ విత్ మయోనైజ్

హెయిర్ కండీషన్ విత్ మయోనైజ్

మయోనైజ్ తినడానికి రుచిని అందివ్వడం మాత్రమే కాదు, ఇది జుట్టుకు కూడా సూపర్ కండిషనర్ గా పనిచేస్తుంది. జుట్టును తడిచేసి, మయోనైజ్ ను నేరుగా అప్లై చేయాలి. దీన్ని జుట్టుకు పూర్తిగా అప్లై చేసి ఒక గంట తర్వాత షాంపుతో స్నానం చేయాలి.

తేనె

తేనె

తేనెను చర్మానికి మాత్రమే కాదు, జుట్టుకు కూడా వండర్ ఫుల్ బెనిఫిట్స్ ను అందిస్తుంది. తేనె డ్యామేజ్ అయిన జుట్టుకు గ్రేట్ గా సహాయపడుతుంది. జుట్టు రాలడం తగ్గిస్తుంది. సింపుల్ గా మీరు ఉపయోగించే కండీషనర్ లేదా షాంపుకు సింపుల్ గా 3చుక్కల తేనెను జోడించి తలకు ఉపయోగించాలి. తర్వాత తలస్నానం చేసుకోవాలి.

మెంతులు

మెంతులు

ఇది మరో ఎఫెక్టివ్ హెయిర్ కేర్ రెమెడీ. ఇది చాలా సులభంగా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. రెండు టేబుల్ స్పూన్ల మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం మెంతులను పేస్ట్ చేసి తలకు అప్లై చేయాలి. తర్వాత తలకు అప్లై చేసి ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఈ ట్రీట్మెంట్ వల్ల జుట్టు రాలకుండా , చుండ్రును నివారిస్తుంది.

బీర్ ట్రీట్మెంట్

బీర్ ట్రీట్మెంట్

జుట్టుకు బీర్ ఉపయోగించడం వల్ల ఇది జుట్టుకు మంచి షైనింగ్ ఇస్తుంది. దాంతో జుట్టు అందంగా షైనింగ్ గా మెరిసిపోతుంది. బీర్ ను స్ప్రే బాటిల్లో సోసి జుట్టుకు స్ప్రే చేసి కొద్దిసేపటి తర్వాత తలస్నానం చేయాలి. తలకు ఇన్ స్ట్రాంట్ షైనింగ్ ను అందిస్తుంది,

ఆమ్లా

ఆమ్లా

స్ట్రాంగ్ అండ్ హెల్తీ హెయిర్ కోసం ఉసిరికాయను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఆమ్లా జ్యూస్ లో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. 20నిముషాల తర్వాత షాంపుతో తలస్నానం చేసుకోవాలి

యాపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్

మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ ఇది. ఇది జుట్టు వాల్యూమ్ ను పెంచుతుంది. గోరువెచ్చని నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందుతారు.

స్ట్రాబెర్రీస్

స్ట్రాబెర్రీస్

ఈ జ్యూసీ బెర్రీ నేచురల్ హెయిర్ కండీషనర్ గా అద్భుతంగా పనిచేస్తుంది. 9 స్ట్రాబెర్రీలను పేస్ట్ చేసి, అందులో 1 టేబుల్ స్పూన్ మయోనైజ్ మిక్స్ చేసి, తలకు అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత జుట్టును అందంగా మార్చుతుంది. తర్వాత షాంపు , కండీషనర్ తో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు అందంగా మారుతుంది

ఆలివ్ ఆియల్ , తేనె

ఆలివ్ ఆియల్ , తేనె

రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ ను అరకప్పుతేనెలో మిక్స్ చేసి, జుట్టుకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి.

English summary

home Remedies For Better Hair In Summer

Summer is one of the major seasons which causes a lot of problems to one's skin and hair. Therefore, according to experts it is important to consume a lot of hydrated foods in order to keep your skin and hair in good condition.
Story first published: Sunday, April 2, 2017, 10:06 [IST]
Desktop Bottom Promotion