For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి ఉల్లిరసాన్ని ఉపయోగించే మార్గాలు..!

చాలా మంది కేశాలను సంరక్షించుకోవడం కోసం కొన్ని ఇంటి చిట్కాలను సాధారణ పద్దతుల్లో ఉపయోగిస్తుంటారు. మన వంటగదిలోని చాలా రకాలు వంటకు ఉపయోగించే వస్తువులను హెయిర్ కేర్ లో భాగంగా ఉపయోగిస్తుంటారు.

|

చాలా మంది కేశాలను సంరక్షించుకోవడం కోసం కొన్ని ఇంటి చిట్కాలను సాధారణ పద్దతుల్లో ఉపయోగిస్తుంటారు. మన వంటగదిలోని చాలా రకాలు వంటకు ఉపయోగించే వస్తువులను హెయిర్ కేర్ లో భాగంగా ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకు తేనె, గుడ్డు, పెరుగు, బేకింగ్ సోడా, వెనిగర్, నిమ్మరసం, మరియు ఉల్లిపాయ వంటివి హోమ్ రెమెడీ హెయిర్ ట్రీట్మెంట్ కు ఉపయోగిస్తుంటారు. అవును, నిజంగానే ఉల్లిపాయ మన కళ్ళలో నీళ్ళు కారేవింధంగా చేస్తుంది. అలాగే కురుల సమస్యలను కూడా నివారిస్తుంది.

Ways To Use Onion Juice For Hair Loss

నిజానికి ఉల్లిపాయ వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టడంలో అద్భుతమైన ప్రయోజనాలను అంధిస్తుంది. జుట్టు రాలడాన్ని అరికడుతుంది. దాంతో పాటు కేశాలు చిట్లడానికి అడ్డుకుంటుంది. ఉల్లిపాయలో ఉండే ఘాటైన సల్ఫర్ జుట్టు పెరగడానికి బాగా సహాయపడుతుంది. మరియు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మరియు ఇందులో యాంటీబ్యాక్టిరియల్ లక్షణాలుండటం వల్ల చుండ్రును నిర్మూలిస్తుంది. కాబట్టి మీ జుట్టు రాలడాన్ని అరికట్టాలనుకున్నా .. ఉన్న జుట్టు అందంగా, స్ట్రాంగ్ గా ఉండాలనుకున్నా ఆనియన్ రసాన్ని జుట్టు పట్టించాలి.

ఉల్లిపాయ వాసన మనకు ఇబ్బంది కలిగించినా కొంత సమయం తర్వాత జుట్టు పెరగడంలో అద్భుతంగా ఉపయోగపడుతుందని గ్రహించాలి. ఉల్లిపాయ రసం వల్ల తలలో ఇతర ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. హోం రెమడీస్ లలో చుండ్రును వదలగొట్టడానికి ఇదొ అద్బుతమైన చిట్కా. చుండ్రును నివారిస్తుంది. మీరు రెగ్యులర్ గా తలకు వాడే హెయిర్ ప్యాక్ కి కొద్దిగా ఉల్లిపాయ రసాన్ని కూడా చేర్చడం వల్ల చుండ్రును నివారించగలుగుతుంది. అనేక జుట్టు సమస్యలకు ఉల్లిపాయ ఏవిధంగా ఉపయోగపడుతుందో ఒక సారి చూద్దాం...

గుడ్డు:

గుడ్డు:

గుడ్డు జుట్టు సంరక్షణకు చాలా మంచిది. దీనివల్ల అనేక ప్రయోజనాలున్నాయి. కాబట్టి గుడ్డులో ఉల్లిపాయ రసాన్ని కలిపి, బాగా గిలకొట్టి, తడి జుట్టు మీద అప్లై చేయాలి 25-30నిముషాలు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

నిమ్మరసం:

నిమ్మరసం:

ఉల్లిపాయ రసానికి నిమ్మరసం కలిని జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు పెరుగుదల బాగా ఉంటుంది మరియు చుండ్రును వదలగొడుతుంది. నిమ్మరసం తలను శుభ్రపరుస్తుంది మరియు హెయిర్ ఫాల్ ను అరికడుతుంది.

పెరుగు:

పెరుగు:

ఉల్లిపాయను గ్రైండ్ చేసి రసం తీసి అందులో ఒక చెంచా పెరుగు మిక్స్ చేసి, బాగా గిలకొట్టి తలకు మసాజ్ చేయాలి. అరగంట అలాగే వదిలేసి షాంపూతో తలస్నానం చేయాలి. జుట్టు రాలడాన్ని అరకట్టడంతో పాటు సిల్కీగా మరియు షైనీగా ఉంచుతుంది.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

ఈ హెయిర్ ప్యాక్ చాలా ప్రభావంతమైనది. హెయిర్ గ్రోత్ కు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కొబ్బరి నూనెలో ఉల్లిపాయ రసాన్ని మిక్స్ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి.

ఉల్లిపాయ

ఉల్లిపాయ

ఉల్లిపాయ జుట్టు రాలడాన్ని అరికడుతుంది: ఉల్లిపాయల వల్ల ఒదొక మంచి ప్రయోజనం. ఉల్లిపాయలో అధిక శాతంలో సల్ఫర్ ఉంటుంది. సల్ఫర్ రక్త ప్రసరణను పెంచి, కురులకు శక్తిని ఇస్తుంది. ఉల్లిపాయను మెత్తగా చేసి తలకు రాయడం వల్ల జుట్టు రాలడాన్ని అరికడుతుంది. దీన్ని అలాగే ఉల్లిపాయ పేస్ట్ తలకు పట్టించడం లేదా ఏదైనా ఇతర హెయిర్ ప్యాక్ లతో ఈ పేస్ట్ ను కూడా కలిపి తలకు పట్టించాలి. ఇలా చేయడానికి అరగంట ముందు తలకు హాట్ ఆయిల్ మసాజ్ చేయాలి.

అరటిపండు గుజ్జు:

అరటిపండు గుజ్జు:

ఒక కప్పు అరటి పండు గుజ్జులో ఉల్లిపాయ రసాన్ని మిక్స్ చేసి, తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది.

తేనె:

తేనె:

ఆనియన్ జ్యూస్ కు కొద్దిగా తేనె మిక్స్ చేసి బాగా జెల్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. పట్టించిన రెండు గంటల తర్వాత లెమన్ వాటర్ తో తలస్నానం చేసుకోవాలి. ఈ హెయిర్ జెల్ హెయిర్ గ్రోత్ ను పెంచుతుంది మరియు మంచి షైనింగ్ ను అంధిస్తుంది. ఈ హెయిర్ జెల్ ను వారంలో రెండు మూడు సార్లు ఉపయోగించవచ్చు.

English summary

Ways To Use Onion Juice For Hair Loss

Hair loss or hair thinning is a common problem we all go through, irrespective of the age groups. Hair loss gives us sleepless nights and can even lead to stress.
Desktop Bottom Promotion