For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాడీ మసాజ్ ఆయిల్ ను ఎంపిక చేసుకోవడం ఎలా...?

|

సాధారణంగా బాడీ మసాజ్ లో ఎంచుకోవడానికి అనేక నూనెలు ఉండటం వల్ల మసాజ్ ఆయిల్ ఎంపిక కాస్త నిరుత్సహ౦ కలిగించే పనే. ఏ మర్దనా సరఫరా జాబితా చూసినా మీకు గింజల నుంచి, విత్తనాల నుంచి తీసిన నూనెలు, ఆలివ్ నూనె, ఈమూ వంటి జంతువుల నుండి తీసిన నూనెలు కనపడతాయి.

అలాగే మీరు క్రీములు, కొన్ని ఘనాలు, లేదా ద్రవాలూ ఔషధ సంబంధాలూ, ఔషధ సంబంధం కానివి, పరిమళాన్ని ఇచ్చేవి, ఇవ్వనివి లాంటి వాటిని కూడా ఎంచుకోవచ్చు. ప్రతి నూనెకు కొన్ని సుగుణాలు ఉండొచ్చు, కానీ ఏ ఒక్క నూనె అన్ని సందర్భాలకూ సరిపోదు. మీరు ఏ ప్రయోజనం కోసం నూనెను ఎంచుకు౦టున్నారో దానిని బట్టి ఎలా ఎంచుకోవాలి అనేది ఆధారపడి ఉంటుంది.
చర్యలు

How to Choose a Massage Oil

1. ఎలాంటి మర్దనా కావాలో నిర్ణయించుకోండి. ఎక్కువ ఒత్తిడి అవసరంలేని స్వీడిష్ లేదా విరామానికి వంటి మర్దనలకు ఆలివ్ ఆయిల్ లాంటి బరువైన నూనెలు బాగా పనిచేస్తాయి. ఇవి జారుడుగా ఉండి, చర్మంలోకి వెంటనే దిగవు. ద్రాక్ష గింజలు, క్రీములు వంటి తేలికపాటి నూనెలు ఒత్తిడి అవసరంలేని క్రీడలు, లోతైన కణాల మర్దనకు బాగా ఉపయోగపడతాయి. ఈ నూనెలు త్వరగా చర్మంలోకి ఇంకి పోయి మీరు జారిపడకుండా కాపాడతాయి, కానీ మీరు ఒత్తిడి ఉంచినప్పుడు శరీరానికి మంట కలగకుండా అవసరమైనంత జారతాయి.

2. మర్దనా జరుగుతున్న సమయం, స్థలం గమనించండి. భారమైన నూనెలు త్వరగా ఇంకిపోకుండా మీరు బట్టలు వేసుకున్నప్పుడు వాటికి అంటుకుంటాయి. ఎక్కువైన నూనెను కడుక్కోవడానికి అవకాశం ఉండేలా షవర్ లేదా స్నానశాల వున్న చోట ఇలాంటివి వాడినా ఇబ్బంది లేదు. వారాంతంలో ఇంట్లో వుండగా, మీరు బట్టలకు నూనె అ౦టుతుందనే భయం లేనప్పుడు, మర్దనా చేసుకోవడానికి ఈ నూనెలు పనిచేస్తాయి.

3. వ్యక్తిగత అభిరుచులను కూడా చూసుకోండి. కొందరికి పరిమళ భరితమైన నూనెలు నచ్చితే, ఇంకొందరికి లవె౦డర్ మొక్కలాగా వాసనలు వెదజల్లుతూ తిరగడం నచ్చదు. కొందరికి ఘాటైన పరిమళాలు పడవు, కొందరికి సుగంధ పరిమళాలంటే అలర్జీ వుంటుంది. వ్యక్తిగత అవసరాల కోసం మీరు నూనెలు వాడుతుంటే పరిమళాలు లేని, అత్యవసర నూనెలు వాడడం మంచిది. మీరు వ్యక్తిగత అవసరాల కోసం నూనెలు వాడుతుంటే మీకు మీ భాగస్వామికి నచ్చే లాంటి సుగంధ పరిమళం వెతుక్కోండి.

4. అలెర్జీల గురించి అడగండి. సుగంధ అలేర్జీలే కాకుండా కొందరికి కొన్ని రకాల గింజలు, పూల సుగాదాలు కూడా పడకపోవచ్చు. ఉదాహరణకు గి౦జల౦టే పడని వారు బాదం నూనె వాడకూడదు - చెట్ల నుంచి వచ్చేవి పడని వారు చమోమిల్ లాంటి వాటితో చేసిన నూనెలు వాడకూడదు. మీరు అలెర్జీల గురించి కంగారు పడుతుంటే హైపో అల్లెర్జేనిక్ అని రాసి వున్న నూనేలే కొనండి.

5. చికిత్సా పరమైన ఉద్దేశ్యం కూడా గమనించండి. కొన్ని మర్దనా నూనెలు ఆర్నికా, మెంతాల్, ఇతర ఉత్పత్తులతో తయారై వాపు, నెప్పులను తగ్గించేవి ఉన్నాయి. చర్మ వ్యాధులను దూరం చేయడానికి ఈము ఆయిల్ తో తయారైనవి వుంటాయి. ఆటల్లో అయిన గాయానికి మీరు నూనె రాస్తుంటే, సాదా నూనె కంటే వైద్యపరమైన నూనె చాలా ఉపయోగపడుతుంది. ఐనప్పటికీ మీరు నూనె రాస్తున్న వ్యక్తికీ అల్లెర్జీ కానీ చర్మ సమస్యలు గానీ వుంటే ఔషధాలు లేని నూనె రాసి, కేవలం సాంకేతిక ప్రక్రియ మీదే ఆధార పడాలి.

చిట్కాలు :

నిపుణులైన మాసేజ్ తెరపిస్ట్ ల దగ్గర వారికి అవసరమైన పరిమాణంలో వివిధ రకాల సాదా నూనెలు, వివిధ బరువులుండే క్రీములు, నూనెలు, ఉత్పత్తులు నిల్వ ఉంచుతారు. ఇలా భారీ మొత్తం లో నూనెలు కొనడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. ఐతే మీకు అత్యవసర నూనెలను చికిత్సా పరంగా ఎలా మిశ్రమం చేయాలో తెలిస్తేనే ఈ విధంగా కొనాలి.

English summary

How to Choose a Massage Oil | మసాజ్ ఆయిల్ ను ఎంపిక చేసుకోవడం ఎలా..?

Choosing a massage oil can be a discouraging task because there are so many types of oils to choose from. Look in any massage supply catalogue and you will find nut- and seed-based oils, olive oils and even oils made from animal products, such as emu.
Story first published: Friday, January 4, 2013, 18:35 [IST]
Desktop Bottom Promotion