For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాలి గోళ్ళను శుభ్రం చేసుకోవడం ఎలా?

|

గోరు లేదా నఖం (Nails) కాలి మరియు చేతి వేళ్ళకు చివర భాగం నుండి పెరిగే కొమ్ము (Horn) వంటి గట్టి నిర్మాణాలు. గోర్లు కెరటిన్ (Keratin) అనే ప్రోటీన్ తో చేయబడివుంటాయి. మన కాలి గోళ్ళ కన్నా చేతి గోళ్ళు వేగంగా పెరగటాన్ని మీరు గమనించే ఉంటారు. మనం తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన చేతి గోళ్ళు చలి కాలంలో కన్నా ఎండాకాలంలో వేగంగా పెరుగుతాయి. శరీర సౌందర్యంలో గోళ్లకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇది తెలియక మన దగ్గర చాలా మంది గోళ్ల ఆరోగ్యాన్ని, అందాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కొంచెం శ్రద్ద తీసుకుంటే చాలు మీ గోళ్లను ఎంతో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.

గోళ్లు మన దేహ ఆరోగ్యానికి ప్రతిబింబాలు. వీటిని చూసి మన ఆరోగ్యం ఎలా ఉందో గుర్తించవచ్చు. గోళ్లు పాలిపోయినట్లుగా ఉంటే రక్తహీనత ఉన్నట్లుగా గుర్తించాలి. అదే గోళ్లు లేత గులాబీ రంగులో ఉంటే రక్తం తగినంత ఉందని అర్థం చేసుకోవచ్చు. గోళ్ల ఎదుగుదల తక్కువగా ఉండి పసుపుపచ్చ రంగులో మందంగా ఉంటే మూత్రపిండాల ఆరోగ్యం సరిగ్గా ఉందో లేదోనని అనుమానించాలి. అదే గోళ్లపై తెల్లటి ప్యాచెస్ ఉంటే కాల్షియం లోపం ఉన్నట్లుగా గుర్తించాలి.

మీరు ఎక్కువగా మేజోళ్ళు వేసుకోవడం లేదా టైట్స్ వేసుకోవడం వలన గాలి చొరబడక పోవడంతో కాలి వేలి గోళ్ళు మురికిగా మారతాయి. మురికిగా ఉండే కాలి వేలిగోర్లు చూడటానికి చాల అసహ్యంగా ఉంటాయి, పాదాలు అనాకర్షణీయంగా ఉంటాయని ముద్ర పడి ఉన్నందున మురికిగా ఉండే కాలి గొర్ల వలన అవి ఇంకా అపరిశుభ్రంగా కనబడతాయి. కాని, మురికి కాలి వేళ్ళ గోర్లు ఉండటం సర్వసాధారణం, మనలో చాల మందికి సాధారణంగా మురికి కాలి గోర్లు ఉంటాయి, కాని వాటిని శుభ్రం చేసుకోవడం సులభమే, చేయగా చేయగా అందంగా కూడా కనబడతాయి. ఎప్పుడూ గోర్లు బయటికి కనబడుతూనే ఉంటాయి కనుక వాటిని చాల బాగే కనబడే విధంగా ఉంచుకోవడం ఇంకా బాగుంటుంది.

How to Clean Toe Nails

1. కాలి గోళ్ళను పొట్టిగా ఉంచండి. పొడవైన, వంపుతిరిగిన కాలి గోళ్ళు ఎప్పుడూ ఆకర్షణీయమైనవి కాదు, పైగా వాటిని పొట్టిగా పెంచడం వల్ల శుభ్రంగానే కాక చాల చక్కగా కనబడతాయి, అంటే గోళ్ళు తక్కువ అసహ్యంగా మరింత ఎక్కువ శుభ్రంగా కనబడతాయి.

2. గోళ్ళ బ్రష్ ను వాడండి. ఇది వాడటానికి సులువైనది, సున్నితంగా మృత చర్మ కణాలను, మొత్తం మురికిని మీ గోళ్ళ నుండి తొలగిస్తుంది, ఇవి మంచి పరిస్థితిలో కనబడే విధంగా చేస్తుంది.

3. వర్షాల్లో తడిచిన / స్నానం చేస్తున్నప్పుడు వాటిని కడగడం మర్చిపోకండి. మీ శరీరం పై ఉన్న మురికిని, దుర్గంధాన్ని పోగొట్టుకోవడానికి ప్రతిసారీ సబ్బుని ఉపయోగించాలి, అయితే పాదాల విషయంలో వేరేలా ఎందుకు వుంద్దలి? మీ పాదాలకు సున్నితమైన సబ్బుని ఉపయోగించండి, గోరు చుట్టూ ఉన్న ప్రదేశాన్నే కాక కాలి వేళ్ళను, పాదాలను కూడా శుభ్రం చేయడానికి ప్రయత్నించండి.

4. మీరు ఎక్కువగా బూట్లు వాడేటపుడు, వాటిని కొన్ని రోజులు అరనివ్వండి, అవి తేమని కలిగి ఉండి మీ పాదాలను పూర్తిగా కప్పిఉంచడం వల్ల మీ గోళ్ళు పొడిగా మారి చిట్లుతాయి. మీ పాదాలకు ఎక్కువగా చెమట పట్టేటట్టయితే ఉదయం పూట పౌడర్ ను వాడండి, దీనివల్ల అవి శుభ్రంగా, తాజాగా కనిపించడమే కాకుండా, మంచి సువాసనను కలిగి, హాయిగా ఉండే అనుభూతిని కలిగిస్తాయి.

5. నైల్ క్లీనర్ కనపడే విధంగా నైల్ క్లిప్పర్ ను ఉంచండి. ఇది మురికిని తొలగించడమే కాక ఆ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుతుంది.

6. చివరగా, కాలి గోళ్ళు శుభ్రంగా, తాజాగా కనపడడానికి, గోరు రంగుతో ఉన్న నైల్ పాలిష్ ను వాడితే, అవి కొత్తగా కనపడతాయి. ప్రతి వారం దాన్ని తొలగించి తిరిగి వాడండి, చూడడానికి కొత్తగానే ఉంటుంది, ఇప్పటి వరకు నేను చెప్పిన చర్యలతో మీ వేళ్ళను శుభ్రంగా ఉంచుకోవచ్చు.

చిట్కాలు

మీరు గోళ్ళను కత్తిరించినప్పుడు అవి సమంగా శుభ్రంగా కనపడేటట్టు చూడండి, ఎందుకంటే సమంగా లేని గోళ్ళు అసహ్యంగా వికారంగా కనబడతాయి.

గోళ్ళను కత్తిరించి నప్పుడు గోరు చుట్టూ సహజంగా ఉండే వంపు ననుసరిస్తే అవి చాల సహజంగా శుభ్రంగా కనబడతాయి. వంపు లైన్ కంటే తక్కువ హాని కల్గిస్తుంది, కాని మీ లక్ష్యం లైన్ అయి ఉండవచ్చు.

హెచ్చరికలు

మీ పాదాల మీద పగుళ్ళు ఉన్నట్టయితే జాగ్రత్త వహించండి, లేకపోతే మీరు గాఢమైన సబ్బు వాడితే మీ చర్మానికి హాని కల్గించవచ్చు.

కాలి గోళ్ళలో లోపలి వైపుకు పెరుగుదల ఉంటె ఎవరి సహాయమైన తీసుకొని గోళ్ళు కత్తిరించండి, ఏదైనా ముందస్తు జాగ్రతలు తీసుకోవలసి ఉంటే మీ డాక్టర్ ను కలవండి.

English summary

How to Clean Toe Nails | కాలి గోళ్ళను శుభ్రం చేసుకోవడం ఎలా?

Dirty toe nails occur when you wear lots of socks or tights and not much air is available to your feet. Having dirty toe nails can look quite ugly, as feet can be labelled as unattractive, and having dirty toe nails just makes them look even worse!
Story first published: Tuesday, January 1, 2013, 13:29 [IST]
Desktop Bottom Promotion