For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లావుగా ఉన్న తొడలను సన్నగా మార్చే వ్యాయామం..!

|

ప్రతి ఒక్కరి శరీర తీరు ప్రత్యేకం. వారి వారి శరీరానికి అనుగుణంగా కదలికలు ఉంటాయి. కొన్ని అసహజ కదలికలు అనారోగ్యాన్ని కలిగిస్తుంది, చక్కటి శరీర ఆకృతిని కూడా దెబ్బతీస్తుంది . ప్రతి కదలిక ప్రత్యేకమైనదే కాక దానికి తగిన సౌకర్యము పరిధి ఉంటాయి .

How to Reduce Heavy Thighs

ఈ కింద చెప్పబడిన వ్యాయామం తోడల కోసం ప్రత్యేకం, అధిక బరువు ఉన్నవారికి తగినది కాదు.

1. నిటారుగా నిల్చుని, మీ పాదాలు 30 సెంటి మీటర్ల దూరం ఉంచి మీ పిరుదుల పైన మీ రెండు చేతులు బొటనవేళ్ళు ముందుకు ఉండే విధంగా ఉంచండి .

2. ముప్పై సెకనులు మీ పొత్తి కడుపుని క్లోక్ వైస్ గా తిప్పండి. ఆపి ,తర్వాత వ్యతిరేక దిశ(యాంటీక్లాక్ వైజ్)లో ముప్పై సెకనులు తిప్పండి. ఈ విధం గా ఆరు సార్లు చెయ్యండి.

గమనిక : మీ పాదాలు ఈ వ్యాయమం చేసేటప్పుడు నేలకు సమాంతరంగా ఉండేలా చూసుకోండి.

3. పైన చెప్పిన విధంగా నిల్చోండి. కుడి తొడని మీకు సౌకర్యవంతమైన దూరం ముందుకి ఉంచి మీ పొత్తికడుపు ను క్లాక్ వైస్ గా ముప్పై సెకనులు తిప్పండి . ఆపి , ఇప్పుడు వ్యతిరేక దిశలో మరొక ముప్పై సెకనులు తిప్పండి.
గమనిక : పూర్తి చేసాక యథాస్థితికి రండి .

4. ఇప్పుడు మీ ఎడమ తొడని ముందుకు పెట్టి, పొత్తికడుపు ను క్లాక్ వైస్ గా ముప్పై సెకనులు తిప్పండి. ఆపి వ్యతిరేక దిశ లో ముప్పై సెకనులు తిప్పండి .
గమనిక : పూర్తి చేసాక తిరిగి యథాస్థితిలోకి రావాలి.

5. ఇప్పుడు మీ పాదాలు కదపకుండా మీ పొత్తికడుపుని కుడి వైపు 15 నుండి 20 సెంటి మీటర్లు కదపండి;

గమనిక : ఇది మీ కొత్త ప్రధమ స్థితి.

6. ఇప్పుడు మీ శరీరాన్ని ముప్పై సెకనులు క్లాక్ వైస్ గా తిప్పండి. బాలన్స్ తప్పకుండా జాగ్రత్త వహిస్తూ వ్యతిరేక దిశలో మరొక ముప్పైసెకనులు తిప్పాక మీ పొత్తికడుపుని మధ్య లోకి తెండి.

7. ఇప్పుడ మీ పొత్తికడుపుని ఎడమ వైపుకు కదిపి పైన చెప్పిన విధం గా వ్యాయామం చేయండి.

8. పూర్తీ చేసాక మీ పొత్తికడుపుని మధ్యలోకి ఉంచండి. దీనితో మీ వ్యాయామం పూర్తి అయింది.

ఇతర సూచనలు

మొదటినుంచి చివరి వరకు ఈ వ్యాయామం ఆపకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
శరీరాన్ని తిప్పే వ్యాసం మీ శరీర సౌకర్యాన్ని బట్టి ఉండి సాధన చేసే కొద్దీ పెరుగుతుంది.

English summary

How to Reduce Heavy Thighs | లావుగా ఉన్న తొడలను సన్నగా మార్చే వ్యాయామం..!

Our body is unique to each of us and as a result; alternates in its own variety of movements; some of which create ill health and poor body structure. Each movement is unique within itself and is controlled or limited by the flexibility that exists within the individual.
Story first published: Sunday, April 7, 2013, 10:43 [IST]
Desktop Bottom Promotion